నేను దాచాను

ప్రసాదు: నేను నవంబరు ఒకటవ తేదీన ౧౧,౦౦౦ ICICI Bank 390 days Fixed deposit లో దాచాను.
Readers of blog: అయితే
ప్రసాదు: ఇంకా నేను నిన్న SBI Mutual Fund లో ౫౦౦౦ వేసాను.
Readers of blog: అయితే
ప్రసాదు: అయితే అంటారేమిటి, ఇంకా నేను మొన్న ౩౦ ITC Shares కొన్నాను
Readers of blog: అయితే నీ తలకాయ.
ప్రసాదు: ???????????
అంటే ఇవి చేస్తే Share Value పెరగాలి కదా, పెరగట్లేదు.
Readers of blog: అయితే మాత్రం పెరిగిపోతాయా ఏమిటి? తెలివి తక్కువ దద్దమ్మ Share value పెరగాలి అంటే మూలధనం పెరగాలి. మూలధనం కావలిసిన వాడి దగ్గర Mutual Fund, అనవసరమైన చోట Fixed deposit చేసావు, ఇక పొతే నీ blog post's చూసి నువ్వు ఏదో గాంధేయ వాడివి అనుకున్నాము వెళ్ళి ITC లో పెట్టుబడులు పెట్టావు.
ప్రసాదు: మొదటి రెండిటికి నాలుక కరుచుకున్నాను మూడవది మాత్రం నేను ఒప్పుకోను, ఇప్పుడు ITC Cigarettes ఒక్కటే కాదు అన్ని Food products లో ఉంది, ఇంకా Paper recycling చేస్తుంది.
Readers of blog: నీ తెలివి తెల్లారినట్టే ఉంది, అయినా నువ్వొక్కడివే దాస్తే సరిపోదు అందరూ దాయాలి కదా.
ప్రసాదు: అందుకే వ్రాసాను.. :-)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.