ఇక్కడ నేను అంటే ఒక ఆంధ్రప్రదేశ్ MLA or MP.
నన్ను ఎన్నుకున్నవారి కోసం - నిజంగానే, నా కుటుంబ సభ్యులు నన్ను ఎన్నుకున్నరు కదా.
నాకు ఆర్ధికసహాయం చేసిన తోటి MLA or MP's కోసం - లేకపోతే వచ్చే ఎన్నికలలో పంచడానికి డబ్బులు ఎక్కడ నుంచీ వస్తాయి?
ఇంకా ఒక నాయకుడి కోసం - ఇదెందుకా మరి Forbes అత్యంత శక్తివంతులైన నాయకుల జాబితాలో పేరు రావాలి కదా!
ఇంకా ఒక Industrialist కోసం - మరి ఆ నాయకుడికి డబ్బులు దోచి పెట్టాలి కదా!
మరి మీలాంటి సామాన్యులకోసం పనిచెయ్యం
ఎందుకంటే మీరు ఉన్నాది - ౨౦ శాతం కన్నా తక్కువ, ౮ శాతం ధనవంతులు, మిగిలిన వాళ్ళంతా పేదలే కదా!
మరి పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాము అనుకుంటున్నారేమో, కానే కాదు, మనకి British వాళ్ళు నేర్పిన పాఠాలు అప్పుడే మరచిపోతామా ఏమి, వాళ్ళని బానిసలు చేసుకోవడానికి. ఇప్పుడు డబ్బు ఉంది అని జల్సాలకు అలవాటు పడి, డబ్బులు తగలు పెడుతున్నారు. పంటలు పండించడం నాటితరం వారికి వచ్చు నేటి తరం వారికి ఏమీరాదు. అప్పుడు వాళ్ళని బానిసలు చెయ్యడం మొదలు పెడతాం. ఎంత సంపాదించినా మనిషి బ్రతకడానికి తిండి కావాలి. ఇప్పటికే గోదాములలో బియ్యం మూలుగుతుంది, దాంతో ధరలు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల తరువాత ఇంకా పెరుగుతాయి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి.
హి హి హి...
మీకు నిజం చెప్పేసాను అయినా మీరు మారరు ఎందుకంటే ఈ Corporate సంస్థలు తయారుచేసిన Formula మీ బుర్రలో దిగిపోయింది కదా - "రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు!".
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.