ఈరోజు ఖలేజా ధైర్యం చేసి చూసాను

ఓం
నిజంగా అది కధలో ఏమీ తప్పు లేదు అనిపించింది, ఒకే ఒక్క విషయం తప్ప అది అల్లూరి సీతారామ రాజుని దేవుడిని చెయ్యడం.
కొన్ని సార్లు అదే రకమైన నటన అనిపించింది ఇంకొన్ని సార్లు పోకిరి చిత్రం లో మహేష్ బాబు కనిపించాడు.
కానీ చివరి ఇరవై నిమిషాలు కధలో పట్టు తెచ్చి ఆఖరి మూడు నిమిషాలు  నిశ్చేష్టులను చేసేసింది మళ్ళీ దేవుడు అని. కనీసం దేవుడు నీ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడాడు అన్నా బాగుండేదేమో.

కొంచం సేపు అసలు ఇలాంటి చిత్రానికి ఎలా ఒప్పుకున్నాడు అని, ఇంకొంచం సేపు ఇది వేరే కళాకారుడి కోసం వ్రాసిన కధ అని ఇంకొంచం సేపు ఇది మహేష్ బాబు సినిమా అని తల తిప్పేసింది. మధ్యలో ఉన్న ఒక్క గంట తీసేసుంటే సినిమా ౨౦ ౩౦ సార్లయినా చూడచ్చు అనిపించింది.

ఇది నా అభిప్రాయం మాత్రమె మీ అభిప్రాయం మీది.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.