ఒక్కడా ఇద్దరా లేక clone?(ఎనిమిది తలుపులు ముప్పైనాల్గవ భాగం)

గగన్ - ౧(కట్టేసి ఉన్నవాడు): ఏమిటి నిశ్చేష్టుడుగా ఉండిపోయావు చాలా విషయాలు తెలుసుకున్నావు ఇది తెలుసుకోలేదా

గగన్ - ౨: వీడిని చంపేస్తే ఓ పనైపోద్దిగా!!

గగన్ -౧: అలాంటి పని చెయ్యకు మనం చేసిన తప్పులో వీడొకడు, వీడి DNA కి ఈ ఆవరణలో ఏమైనా జరిగితే మొత్తం మొత్తం నాశనం అవుతుంది.

గగన్ -౨: మరి వీడిని ఏమి చేద్దాం.

గగన్ -౧: వీడిని ఎక్కడనుంచీ తీసుకు వచ్చామో అక్కడకి తీసుకు వెళ్ళి చంపెద్దాం.

గగన్ -౨: ౩౦ రోజులు నువ్వు పడుకోలేదు, అంతా వీడి వల్లే. సర్లేగానీ ఇద్దరం ఒక్కడిగా అవుదాము దాంతో కొంతైనా నీ Body cells rejuvenate అవుతాయి.

గగన్ -౧: ముందు నన్ను విడిపించి వాడిని కట్టు, తరువాత చూద్దాం.

గగన్ -౨: సరే

అప్పటికే మోద్దుబారిపోయిన అర్జున్ ని తీసుకుని lock చేసి గగన్ ని విడిపించాడు ఇంకో గగన్,

గగన్ -౧:ముందు వీడు తీస్తున్న video ని ఆపాలి లేకపోతే కొంప కొల్లేరైపోతుంది.

ఇద్దరూ వెతకడం మొదలు పెట్టారు ఈలోగా

గగన్ -౧: అవును ఇవన్నీ నీకు తెలిసాయి సరే నన్ను తప్పుపదతావేమిటి, రాజ్యాంగం అలా ఉంది.

అర్జున్: అలా ఉందా మీరు రాసారా?

గగన్ -౨: ముందు వేడిని చంపేద్దాం, తరువాత వీడియో గురుంచి వెతుకుదాము.

గగన్ -౧: నీకు ఎప్పుడూ అదే ఆలోచనా, వీడి దగ్గర ఆ video నకలు ఉంది బయటపడితే మొదట దాన్ని సంపాదించాలి.

గగన్ -౨: తరువాత.

గగన్ -౧: తరువాత సంగతి తరువాత, అర్జున్ ఎక్కడ పెట్టావు నేను పడుకున్నప్పుడు నువ్వు వేరే ఏదో చేసావు, అవును వాడిని, అదే రోహిత్ ఎందుకు వచ్చాడు.

ఇలా అంటుండగా ఎక్కడ నుంచీ వచ్చాడో వచ్చాడు రోహిత్, చిన్న Fight జరిగింది, ఎలాగోలా ఇద్దరు గగన్ లిని పట్టుకుని వాళ్ళను Unify చేసే యంతం లోకి తీసుకు వెళ్ళాడు రోహిత్.

అర్జున్: మేరన్నట్టే జరిగిది uncle. మావయ్య ఒక్కరు కాదు ఇద్దరు. అవును మీకు ఎలా తెలుసు వాళ్ళు ఇద్దరు అని.

రోహిత్: నేను వాడు మంచి స్నేహితులము, నేను Human Neural మీద Phd తీసుకున్నాను, వాడితో నేను ఎప్పుడూ అంటుండే వాడిని మనిషికి ఉన్న మెదడును రెండుగా చేసి ఇద్దరినీ తయారు చెయ్య వచ్చు అని. అది వాడికి నచ్చింది. ఒక రోజు నాకు phone చేసి నీ research కి అవసరమైన equipment నా దగ్గర ఉంది చేస్తావా అన్నాడు. మొదట నేను ఒప్పుకోలేదు, తరువాత వాడు నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా చేసి చివరకు నన్ను ఒప్పించాడు. నేను రెండుగా విడగొట్టే దానిని తయారు చేసాను. కానీ నా ప్రయత్నంలో చిన్న లోపం రెండూ రెండు విదిపోయిన brains వాటిని అనుసంధానించడం అన్నీ వాడే చేసాడు. ఆ రెండు brains మధ్య communication కి చిన్న చిన్న పరికరాలు ఏర్పాటు చేసుకున్నాడు.

కానీ అది వాడు ఎందుకు ఉపయోగిస్తున్నదో మొదట్లో నాకు తెలియదు తరువాత తెలిసింది దాన్ని నాశనం చేద్దాము అనుకున్నాను కానీ కుదరలేదు. కొన్ని రోజుల తరువాత ఈ అన్యాయం చూడలేక complaint ఇవ్వడానికి Police station కి వెళ్ళాను వాళ్ళు complaint తెసుకోవడానికి ready గా లేరు ఆ confusion లో అక్కడ ఉన్న ఒక constable ని హత్య చేసాను. అలా నేను చేసిన నేరం వాళ్ళ నన్ను జీవిత ఖైదీగా కాదు పిచ్చి వాడిగా prove చేసి mental hospital లో పెట్టారు, ఇది తెలిసిన వీడి నాన్నగారు నన్ను రక్షించారు ఆయనకు నేను చేసిన వాగ్దానం వల్ల వీడు బ్రతికిపోయాడు. ఇక ఇది వేడిని విడగోట్టడమే కాదు కలపడం కూడా దీని పని. అవును విన్నీ ఎక్కడ ఉంది, ముందు ఆమెని ఆపాలి.

(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.