తెలుగా తెంగ్లిషా?

ఏది మీరు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు?

2 comments:

  1. మీ ప్రశ్నకు నా జవాబు, తెలుగే. కాని ఈ క్రింది వాక్యం చూడండి.

    నేను కారెక్కి మార్కెట్టుకు కూరలు కొనటానికి వెళ్తున్నాను.

    ఇక్కడ రెండు ఆంగ్ల పదాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియనంతగా ఆంగ్లం మన తెలుగులో చొరబడిపోయింది. ఇదే పదాన్ని:

    నేను కారెక్కి సంతకు కూరలు కొనటానికి వెళ్తున్నాను
    అని వ్రాసి ఒక ఆంగ్ల పదాన్ని వదిలించుకోవచ్చు.

    ఆంగ్లంలో ఉన్న "కార్" అనే పదం తెలుగయ్యిపోయి "కారు" గా మారింది.కార్ అనే ఆంగ్ల పదానికి మనం వాడుకునే వీలుగా తెలుగు పదం ఇప్పటివరకూ పుట్టలేదు. ఏదన్న ఒక పదం కృత్రిమంగా తయారు చేస్తే అది వెగటు పుట్టిస్తుందే కాని వాడుకలోకి రాదు.

    కాబట్టి అవసరాన్నిబట్టి, అంటే మనం మన ప్రాతంలో తయారుచెయ్యని, కనిపెట్టని వస్తు వాహనాలకు, సహజంగా తెలుగులో పేర్లు ఉండే అవకాశం లేదు. అలాంటి పదాలను 'ఉ' కారమో, 'ఆ' కారమో తగిలించి తెలుగుచేసి వాడటం తెంగ్లీష్ కిందకు రాదని నా ఉద్దేశ్యం

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.