ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ అభిమానులను సంపాదించుకున్న నోకియా మార్కెట్లోకి కొత్తగా రెండు సింబియన్ వర్సన్స్‌కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్‌లను విడుదల చేయనుంది. ఇటీవల మెక్సికోలో జరిగిన ‘డెవలపర్ డే’లో నోకియా విడుదల చేసిన సమాచారం ప్రకారం నోకియా సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రింద సింబియన్ కార్లా, సింబియన్ డొన్నా అనే వర్సన్స్‌ని విడుదల చేయనుంది.
నోకియా త్వరలో విడుదల చేయనున్న ఈ రెండు సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లలో మొదటిదైన సింబియన్ కార్లా ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్స్ కొసం రూపొందించడం జరిగింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ 1 GHz ప్రాససర్‌కు అనుకూలంగా పని చేస్తుంది. అంతేకాకుండా ఈ సమాచారం అంతా నోకియా డెవలపర్ డేలో ప్రస్తావించినప్పటికీ, విడుదలకు ముందు కొన్ని మార్పులు జరిగినా ఆశ్చర్యపొనవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ కొత్త సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కొసం ప్రత్యేకంగా వెబ్ బ్రౌజర్‌ని కూడా తయారు చేసినా చేయవచ్చుని అన్నారు. నోకియా సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో నొకియా కొత్త టెక్నాలజీ ఎన్‌ఎఫ్‌సి ని అనుసంధానం చేయనున్నట్లు వినికిడి.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.