జీన్స్ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన తమిళ నటుడు ప్రశాంత్. అతను గత కొంత కాలంగా తన భార్యపై విడాకులు కేసు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చెన్నై ఫ్యామిలీ కోర్టు 2009లో విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చినా దానిని సవాలు చేస్తూ భార్య గృహలక్ష్మి చెన్నై హైకోర్టుకు వెళ్లారు. దాంతో కేసు మొదటి వచ్చింది. ఎట్టకేలకు చెన్నై హై కోర్టు కూడా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్ధిస్తూ కేసు కొట్టివేసి ప్రశాంత్ కి విడాకులను మంజూరు చేసింది. వివాహమైన కొద్ది కాలానికి ప్రశాంత్ కి తన భార్య గృహలక్ష్మికు ముందుగా వివాహమైన సంగతి తెలిసింది. ఆమెకు 1998లో నారాయణన్ వేణు ప్రసాద్‌తో వివాహమైనట్టు రిజిష్టర్ దస్తావేజు సాక్ష్యాధారం లభించింది. దాంతో ఆమెకు అప్పటికే వివాహమైన విషయాన్ని దాచి పెట్టి మరీ తనతో పెళ్లి చేశారని అతను ఫిర్యాదు చేశాడు.
Case favor to actor Prashanth | విడాకుల కేసులో హీరోకి ఫేవర్ గా తీర్పు- Oneindia Telugu
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.