నిన్ను నన్ను కలిపింది facebook (ఎనిమిది తలుపులు ముప్పై అయిదవ భాగం)

అర్జున్: మొత్తానికి నేను uncle కలిసి మీ నాన్నగారిని ఒకటి చేసి, అత్తని బయటకు వెళ్ళకుండా ఆపగలిగాము.
రోహిత్: అవును అర్జున్ ఇంతకీ గగన్ నిన్ను ఎందుకు తీసుకు వచ్చాడు?
అర్జున్: ఏమో నాకు తెలియదు, మొదట ముందు మనం గగన్ మావయ్యని మావయ్యగా చేద్దాం.
అలాగ కొన్ని గంటలు గడిచిన తరువాత గగన్ ఇప్పుడు గగన్ అయ్యాడు.
గగన్: అవును నేను ౩౦ రోజులు పడుకోకున్నా నేను రోజూ పడుకున్నట్టే ఉంది.
అర్జున్ కి రోహిత్ కి నవ్వాగలేదు.
అర్జున్: మావయ్య నీకు నీ గురుంచి చెప్పాలంటే మాకు పిచ్చెక్కుతుంది, సరే గాని మమ్మల్ని ఎందుకు ఇక్కడకు ఎందుకు రప్పించావు?
గగన్: ఏమీ లేదు అసలు విన్నీకి నేను ఎందుకు నచ్చానో తెలుసుకోవడానికి, నేను అందంగా ఉండను నేను మంచి Physic ఉన్న వాడిని కూడా కాదు. అసలు ఏమి జరిగింది నేను ఎందుకు నచ్చాను విన్నీకు, నేను ఎన్ని సార్లు అడిగినా తను చెప్పేది కాదు.
అర్జున్ : మరి నేను ఏమి చెయ్యగలను?
గగన్: నువ్వు విన్నీ ని అడగాలి అసలు నేను తనకి ఎలా పరిచయం అయ్యాను. తను నన్ను ఎందుకు ప్రేమించింది, నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్న ఎలా సహించింది? చాలా సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి.
అర్జున్: అయితే నేను ఏమి చెయ్యగలను?
గగన్: నువ్వు విన్నీ ని Hypnotize చేసి నా ప్రశ్నలకు సమాధానం తెప్పిస్తావు అని. అవును ఇంతకీ Camera ఎక్కడ ఉంది?
అర్జున్: సరే
అలాగా అర్జున్ Hypnotize చేసి అర్జున్ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు.
మొదటి ప్రశ్న
గగన్ ఎప్పడి నుంచీ పరిచయం
విన్నీ సమాధానం, చిన్నప్పుడు ఒక పెళ్ళిలో పరిచయం అయ్యాడు అది 1995 అనుకుంట వాడు తోటి పెళ్ళికొడుకు నేను తోటి పెళ్ళి కూతురిని, పెద్దయ్యాకా నిన్ను నేను అలాగే పెళ్ళి చేసుకుంటాను అన్నాడు.తరువాత నేను మరచిపోయాను. ఒక రోజు నాకు ఒక ఉత్తరం వచ్చింది నేను గుర్తున్నానా అని. అది వ్రాసింది బావ. తరువాత చాల సార్లు అడిగాను నా గురుంచి ఎలా తెలుసుకున్నావు అని, కొన్ని రోజుల తరువాత బావ చెప్పాడు.
మనమంతా ఈ Social Networking అని facebook orkut plus కానీ మన బంధువులే మనకు మంచి Social Network.
మరి మేము ఇద్దరం మొదటిసారి ఎలా కలుసుకున్నాము ఇది గగన్ రెండవ ప్రశ్న.
మా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరములు, అప్పటికే మా నాన్న MLA ఇద్దరం Graduation పూర్తి చేసాము. సాధారణంగా E-Mails కానీ అన్నిట్లోనూ కొంచం కొత్తగా చెయ్యాలి అనుకునేవాడు బావ, అందుకే ఉత్తరప్రత్త్యుత్తరములు. ఒకరోజు నువ్వు పనిచేస్తున్న కార్యాలయంలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏదో సరదాకా అందరిలా చేస్తున్నాడు అనుకున్నాను. కానీ బావని కనిపెట్ట లేక పోయాను. ఎందుకంటే బావతో పాటూ ఇంకా ౨౦ మంది చేరారు. కొన్నిరోజులకు వారిలో బావ ఎవరు అన్నది తెలుసుకోగలిగాను అంత అందంగా లేడు, కొంచం లావుగా ఉన్నాడు తెలుసుకదా అమ్మాయిల మనస్తత్వం లావుగా ఉన్న వాళ్ళు అంటే నేను చెప్పను..
అలా కొన్ని రోజులు గడిచాయి, తను నాతొ మాట్లాడతాడేమో అని ఎదురు చూసాను లేదు. కొన్ని రోజులకు నాకు ఒక Mail నన్ను ఇక్కడ ఉంచి నువ్వు Onsite ఎలా వెళతావు అని.
(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.