అన్నయ్య పెళ్ళి విశేషాలు

జనవరి ౨౮ నిశితార్ధం
February ఆఖరి ఆదివారం పెళ్ళి కొడుకును చేసారు
ఇంతలో మా బాబయ్య గృహ ప్రవేశం  February ౨౯ తెల్లవారితే ౧ March, మా పెద్ద బావగారు(మా నాన్నగారి మేనత్త పెద్ద మనవడు - నా రెండవ అయ్యగారి ) వంటల దగ్గర, నేను వడ్డన ల దగ్గర. నాన్నగారు మా అన్నయ్య స్నేహితుడు సతీష్(మా చిన్న తాతయ్యగారి మనవడు) వాళ్ళ నాన్నగారు కలిసి తాంబూలాలు కట్టారు. ఇక మా మేనమామ కూడా అంతా సముదాయించడం.
ఇక ౧ March రాత్రి పానకాల కావిడి. నాన్నగారి మేనత్త పిల్లలు మా ననమ్మగారి అక్క తరుపు వాళ్ళు ఇలా ఇల్లంతా సందడి.
ఆ రోజు రాత్రి ౧౨:౦౦ ఇంకొంత మంది.
తరువాత రోజు ఉదయాన్నే ౨ గంటలకు మంగళ స్నానాలతో మొదలు, తరువాత ఉపనయనం, సుముహుర్తం తరువాత తాళి కట్టడం, తలంబ్రాలు అప్పగింతలు.
మేము ఇంటికి అన్నయ్యా వాళ్ళు అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి.
తరువాత రోజు రమా సత్యనారాయణ స్వామి వ్రతం.
తరువాత కమలవోత్తుల వ్రతం , పక్కనే reception. తరువాత నేను చెన్నై ప్రయాణం.

మరి అన్నయ్యకు కళ్యాణతిలకం దిద్దినది మా విజయక్క, పారాణీ కూడా. మరి వదినకు గోరింటాకు పెట్టింది మా చెల్లెలు శ్వేతా.
ఇక రోజూ అన్నయ్యకు హారతి, మా మేనత్తలు మా అక్కలు చెల్లెళ్ళు మా పెద్దమ్మలు మా పిన్నమ్మలు.
ఇక వడ్డనలు మా అన్నదమ్ములు, వంటలు మా బావగారు దగ్గర ఉండి చేయించారు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.