నాకు చిన్నప్పడ నుంచీ

ఒక మంచి వాహన చోదకుడిని అవ్వాలి అని కోరిక.
కానీ నాకు బండి నడపడం రాదు కాదు నేర్చుకోలేదు!
నేర్చు కొకపోవడానికి అనేక కారణాలు.

కానీ ఇప్పుడు నేర్చుకోవాలి అందుకు కారణాలు
౧. వాహనం నడపడం రాదనీ నాకు సంబంధాలు రావట్లేదు
౨. దారిలోని వ్యక్తులను కాపాడలేను
౩. సరుకులు తేవడానికి కాలి నడకన వెళ్ళాలి.

కానీ నేర్చుకోక పోవడానికి కారణాలు అనేకం
చిన్నప్పడ నుంచీ మా ఇంట్లో వాహనాలు నడపోడ్డు అనే వారు, తరువాత కొన్ని సార్లు ప్రయత్నించాను కానీ break నొక్కడం పదులు clutch   పట్టు కోవడం ఇలాంటివి. ఈ లోగ చిన్న accident అంతే కుడి కాలు మడం (పాదం) దగ్గర ఎముక విరిగింది ఇక ఇప్పుడు break నొక్కడానికి క్రిందకి రావట్లేదు, తరువాత అతి ముఖ్యం మైనది నేను వాహనం కొన్న పెట్టడానికి స్థలం లేదు. ఇంకా ఎక్కువ ముఖ్య మైనది ఇంధనం దాని వల్ల కాలుష్యం.

ఏంటో ఈ సంకట స్థితి నుంచీ బయట పడలేక పోతున్నాను.