భారతీయుడు :అమ్మ ఈ రోజు నాన్నగారికి సెలవు అంట కదా
అమ్మ: నిజమే నాయన ఈ రోజు సెలవు
భారతీయుడు : ఎందుకమ్మా?
అమ్మ: అవినీతిపై విజయం సాధించినాము అందుకు.
భారతీయుడు : మరి మనం నగ్గితే మనం పండుగ చేసుకోవాలి కానీ అవినీతి పరుని చుట్టాలు చేసుకుంటున్నారు ఎందుకు?
అమ్మ : నిజమే నాయన ఇది కలికాలం, రావణుడి ని సంహరించాడు అని దీపావళి అదే రోజున నరకాసుర సంహారం జరిగింది అని ఇంకొంత మంది పండుగ చేసుకున్నారు.
కానీ ఇక్కడ అవినీతి పైన విజయం పొందినప్పుడు రాక్షస సమూహం పండుగ చేసుకుంటుంది. సగటు భారతీయుడు కష్ట పడతాడు, ఈ వార్త పత్రికలకు పండగ.
భారతీయుడు: మరి మనం ఎప్పుడు చేసుకుందాము?
అమ్మ : ఇలాంటి అవినీతి అంతమయ్యాకా.
భారతీయుడు : అది ఎప్పుడు వస్తుంది?
అమ్మ : అది సత్యయుగం లేదు అని నిరూపించే వాళ్ళ ద్వారా తెలుస్తుంది.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.