ప్రశ్నకు సమాధానం వేరు

అనగనగా ఒక అబ్బాయికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు, అతనికి Matrimony లో అతని చెల్లెలు వెతికిన అమ్మాయి నచ్చింది, సరే అని "మీతో సంబంధం కలుపుకుందాం అనుకుంటున్నాను అన్నాడు"(చేసిన పొరపాటు అమ్మాయి కోరుకున్న జీతం చూడకపోవడం), వచ్చిన సమాధానం అబ్బాయిని నిర్ఘాంత పోయేలా చేసింది.

ఏమనుకున్నారా సమాధానం "మన పిల్లలు ఒకరితో ఒకరు కలిసి ఉండలేరేమో"

అంటే పెళ్ళయిన తరువాత కూడా అమ్మాయిలు పెళ్ళి కాని అబ్బాయిల కోసం ఇంకా వెతుకుతున్నారా? లేకపోతే జీతం తక్కువ అని చెప్పలేక ఇలా అన్నారో అర్ధం కాలేదు.

ఇలాంటి సమాధానాలు నేను కూడా చెప్పానేమోకొన్నిసార్లు కానీ మరీ ఇంత తేడాగా కాదు.

సర్లే ఇలాంటివే ఇంకొన్ని,

కొంతమంది వాళ్ళ టపాలలో దేవుడు లేడు అని వ్రాస్తాడు, కానీ అవసరానికి ఇతిహాసాలు చూపించడం మొదలు పెడతారు, అదే వాళ్ళని అడిగితే ఒక లంకే పెట్టి ఇక్కడ చూడమంటారు, ఎవడో వ్రాసింది చూపించడం వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి లేకపోవడం సర్వ సాధారణం అయిపొయింది. లేదా వాళ్ళు నాయకుడు కాడు మేము leader క్రిందే పనిచేస్తాము అనే అభిప్రాయమేమో

ఇక మన ప్రభుత్వం గురుంచి చెప్పనే చెప్పక్కర్లేదు,
RTI క్రింద, నరసాపురం కోటిపల్లి Railway line గురుంచి పెట్టాను, సంధానం ఇంకా survey జరుగుతుంది. అంటే Reliance వాడికి KG Basin లో gas దొరకడం ఆగిపోవాలా? లేకపోతే YSR congress అధినేత ను ఉపయోగించి భూస్వాములు స్వాధీనం చేసుకున్న భూముల లో పనికిరాని భూములు దొరకాలా? లేకపోతే మా ఊళ్ళలో పంటలు వేయడం మానెయ్యాలా?


No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.