సంస్కృతీ సంప్రదాయాల గురించి వాటిని ఆచరించని వాళ్ళు మాట్లాడతారు

ఇది అన్నిటికన్నా హేయమైన విషయం.
నాకు తెలిసి నేను ఇప్పటి వరకు జరుపుకున్న జన్మదిన వేడుకలు
నా తల్లిదండ్రుల దీవెనలతో జరిగినవే. నా చిన్నప్పుడు నా మిత్రులు నా జన్మదిన వేడుకలకు వచ్చే వారు నేను వెళ్ళే వాడిని. తరువాత నా కుటుంభ సభ్యుల దీవెనలు పొందే వాడిని.ఎందుకంటే వాళ్ళతో ఉండడానికి నేను ఉన్నాను అని వాళ్ళ ఆనందం.
ఇక వీటి గురించి పక్కన పెడితే నాకు బాగాగుర్తున్న విషయం వివేకానందుడు ఒకరోజు ఆలయంలో ఉంది బాధ పడుతుంటే, ఒకరు వచ్చి ఎందుకు బాధ పడుతున్నారు అని అడిగితే "ఈ రోజు నా జన్మదినం అందుకు".
అదేమిటి జన్మదినం అంటే పండగ కదా మరి మీరు ఎందుకు బాధ పడుతున్నారు అంటే "నా జీవితంలో ఒక సంవత్సరం తీసివేయ బడింది" అన్నారు.
ఇది విజ్ఞత ఉన్న వాళ్ళకి ఇలా అర్ధం అవుతుంది "ఆయన సాధించాల్సిన గమ్యానికి ఒక సంవత్సరం తగ్గింది అని"
మరి అతి తెలివైన వారికి "జీవితం అనుభవించడం తెలియదు" అని అర్ధం అవుతుంది.

ఇకపోతే వారు ప్రచురించిన ఛాయా చిత్రాలు సగం బట్టలతో ఉన్నారు కొందరు అది ఏ విధమైన సంస్కృతీ?
ఒక  చీర ౩౦౦ వందల నుంచీ ౫౦౦ వందల లోపే ఉంటుంది కానీ వాళ్ళు వేసుకున్న దుస్తులు ఖరీదు దరిదాపు ౨౦౦౦ పైచిలుకే ఉంటుంది, విదేశీ అలవార్చిన విష సంస్కృతీ ఇది. ఒక పక్క నేతలు మగ్గం వాడులుతున్నది ఇందుకే ఇది ఆ సంస్కృతీ సంప్రదాయాలు గురించి మాట్లాడుతున్న వాళ్ళకి తెలియదా అంటే తెలుసు - కానీ వాళ్ళ రివాజు ప్రకారం "మేము పోరాడేది వీళ్ళు చేసిన అసభ్య పనుల గురించి". అంటే అలా సగం దుస్తులు వేసుకోవడం ఏ విధమైన సంస్కృతీ?

నాకు  గుర్తెరిగి నేను నా పుట్టినరోజు నాడు ఎంత సాధ్యమైతే అంతవరకూ నాకు కొత్త బట్టలు వేసుకోవడం రివాజు. మరి బట్టలు విప్పడం ఏ విధమైన సంస్కృతి?(ఇది ఈ ఘటన జరిగినప్పుడు కాదు నా స్నేహితులలో కొంతమందికి Birthday bumps ఇవ్వడం అలవాటు - అది వాళ్ళకు ఇంకో చెత్త వాళ్ళ నుంచీ అలవాటయ్యింది)
ఇది వ్రాసిన నన్ను వాళ్ళు ఖచ్చితంగా దూషించడం మొదలు పెడతారు నాకు తెలుసు. పైగా నాలాంటి వాళ్ళు ఇలా వ్రాస్తారు అని తెలుసు కనుక
"కొంతమంది మా వస్తువులు దొంగతనం చేశారు అని ఆ వ్యక్తులు అనడం వీళ్ళు ప్రచురించారు"
మంచి చేద్దాం అని కొందరు ప్రయత్నిస్తుండగా కొంత దొంగలు అందులోకి చేరడం ఎప్పుడూ జరుగుతూనే ఉంది, అది నేనూ ఒప్పుకుంటాను, తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వాళ్ళు "సంస్కృతీ సాంప్రదాయాలు తెలియకుండా వాటిని చులకన చెయ్యడమే ద్యేయంగా పెట్టుకున్న వాళ్ళ లాగా"
ముందు సభ్యతా సంస్కారం గురించి తెలుసుకునివీళ్ళు మాట్లాడితే బాగుంటుంది.
ఇకపోతే అక్కడ మందు ఎంతమంది కొట్టారో ఈ వ్యక్తులు తెలుసుకుంటే మంచిది.