నన్ను voters జాబితా నుంచీ తప్పించిన సాంబారు సారూ

నేను ఏమి కోల్పోయాను అని ఆయన ప్రశ్న.
మీరే నన్ను voters list నుంచీ తొలగించారు కదా, ఇంకేమి కోల్పోవాలి. ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు అసలు మొదలు తుదలు లేదు అని మీరు అనుకోవచ్చు కానీ సాంబారు మాస్టారుగారికి అర్ధం అయితే చాలు.
నేను కోల్పోయిన మొదటి వస్తువు
౧. ముడి ఇనుము - అదీ మన శత్రుదేశానికి
౨. వేలాది ఉద్యోగాలు పోయాయి- అదేమిటి అలా అంటావు అంటే మీరు గమనించి ఉంటే మనదేశంలో శత్రుదేశం phones అమ్ముడైన కాలం తెలుసుకోండి, అదే కారణంతో చాలా కాలంగా ఉద్యోగాలు కొల్పోయారు.
౩. మనశ్శాంతి - నాకు నెలకి అప్పటి సమయంలో జీతం తక్కువ అంటే బాగా తక్కువ కాదు, మరి దాచుకుందాము అంటే Mutual funds అది దివాళాకోరు పెట్టుబడి, సరే Fixed deposit చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కోట్ల కుంభకోణాలు మా ప్రదేశంలో Banks లో కోట్ల కోట్ల frauds బయటపడ్డాయి. అదేమిటి దానికి దీనికి లంకె అనుకున్నరేమో, ఈ తప్పిదాలు చేసిన వాళ్ళకి అండ వచ్చింది మంత్రుల దగ్గర నుంచీ, అప్పట్లో వచ్చిన చిత్రం "రాజావారి చేపల చెరువు" కధలు.
౪. ఇప్పుడు బాధ పడుతున్న కృష్ణా జిల్లా వాసులు, నేను అప్పుడే చెప్పాను ఎత్తిపోతల పధకం మీకోసం కాదు మాకోసం కాదు తన సంస్థలకోసం మళ్ళించుకుంటున్నారు అని చెప్పాను -  మరి ఆ సాంబారుగారు అడగ వచ్చు నువ్వు case వెయ్య వచ్చు కదా అని, తమ్మిని బొమ్మను చెయ్యగలిగిన వారు అది మిగులు నీరు అని నిరూపించలేరా?
౫. వేల ఎకరాల కాకినాడ చుట్టు పక్కల భూములు ఇప్పుడు బీడు భూములుగా మారిపొతున్నాయి, అవి అప్పుడు SEZ గా మార్చడానికి బీడు భూములు అని నిరూపించారు. పచ్చని పంట భూములు ఇప్పుడు వెలవెలబొతున్నాయి.
౬. రాష్ట్రంలో చమురు సుధ్ధీకరించే పరిశ్రమ పెడతాను అని మమ్మల్ని మొసం చేసిన Reliance ని GAS నిక్షేపాలు తీసుకోనివ్వకుండా ఆపలేక పోయారు.
౭. రాష్ట్రంలో విధ్యుత్తు ఉత్పత్తి చేస్తూ పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నారు - అదేమిటి అని అడిగితే అది మీ రాష్ట్రంలో తక్కువ పక్క రాష్ట్రంలో ఎక్కువకు అమ్ముతున్నారు అంటారు, అదేమిటి అన్నదాతల ప్రభుత్వం అని చెప్పి నీ రాష్ట్రానికి నీ వంతు సాయం చెయ్యలేవా అంటే (నాకు దీని గురించి ఇంకా సమాధానం రాలేదు)
౮. చేనేతరైతు ఆకలి అంటుంటే - తన వాళ్ళ కోసమని రాజీవ్ విధ్యా మిషన్ లో కొన్నరు, అదికూడాఅ పక్క రాష్ట్రం నుంచీ. వాటి గురించి నేను వ్రాసిన గతంలో వ్రాసిన post
ఇంకా కొన్ని post1 post2
మరి నేను కొన్నానా అని మీరు అడగ వచ్చు, ఏమి చెయ్యగలను కొంతవరకు మాత్రమే నేను మార్చగలను, నేను కొనాలి అన్నా అమ్మేవాడికి మనదేశం అనే విధానం ఉండాలి కదా నాకు కొనడానికి దొరకడానికి.
౯. ఇక మా ఊళ్ళలో అందరినీ Christians క్రింద మార్చి, మా ఊరి జనాల మధ్యే చిచ్చు పెట్టారు.
౧౦. ౧౦ ఎకరాల ఆసామి ఇప్పుడు, ఇళ్ళు వాకిలిలేని కూలీలు.
మరి రైతు రాజ్యం అయితే రైతులు ఆత్మహత్య చేసుకునే స్థితికి ఎందుకు చేరుకున్నాడు? ఇక్కడే వస్తుంది వాళ్ళకి కోపం, మేము ఉన్న రోజులలో రైతే రాజు, అప్పుడూ ఇప్పుడూ రైతుల ఆత్మహత్యలు తగ్గలేదు ఇంకా పెరిగాయి.

1 comment:

  1. గురువు గారూ !
    మీ అన్ని టపాల పై స్పందించాలనే ఉంది. కాని అది నా శక్తికి మించిన పని.ఈ ఒక్క టపా పై త్వరలోనే స్పందిస్తా.

    2009,మే ప్రాంతంలో నన్ను వెలివేసిన బ్లాగ్లోకంలో నన్నూ ఒక తృణంగా భావించిన మీకు థ్యాంక్స్ .

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.