మీకు కూడా మన దేశాన్ని తిట్టడం అలవాటే కదా.


ప్రతీ ఒక్కరూ ఈ అనాగరిక కాలంలో పరుగు పెడుతున్నారు దేని వైపు తెలియదు, గమ్యం ఉండదు ఇంకొకడిని తిట్టడం తప్ప.
కనీసం మన సంస్కృతిలో ఒక గమ్యం ఉంది
మొక్కలు నాటిన వాడు పూల కోసం పెంచుతాడు
పొలం దున్నేవాడు పంటల కోసం పాటుపడతాడు

ఇక ఈ నూతన అనాగరిక సంస్కృతిలో నెగ్గక పొతే పక్క వాడి మీదకి అభాండం వేయడం పరిపాటే.
కొందరు చెప్పిన ఆ చైనా(అదే మన దేశానికి ఇంకో Bronze రావడానికి కారకురాలు) అమ్మాయి అక్కడ referee ని తిట్టింది ఎందుకంటే అక్కడ తడిగా ఉంది అందువల్ల కాలు జారి పడిపోయాను అని. తడిగా ఉంటే ఆడటం మానేయాలిగానీ కాలు విరిగాకా ఇంకొకరి మీద నింద మోపడం ఎంతవరకు సమంజసం.
ఇక రెండవ విషయం ప్రతీ ఒక్కడికీ చైనా ఒక reference మరి
విషాలు జిమ్ముతున్న electronic items ను dispose చెయ్యడానికి ఎందుకు అనుమతిస్తున్నారు? - ఎందుకంటే డబ్బు పిచ్చి తగలు పెట్టడానికి డబ్బు ఇస్తారు కాబట్టి.
ఇక రెండవది అక్కడ ఎంత మంది కర్మాగారాలలో పనిచేస్తున్నారు - ఇదెక్కడి క్రమ శిక్షణ.
ఇక మూడవది చైనా మన శత్రు దేశానికి ఎందుకు సాయం చేస్తుంది.
నాల్గవది ఇది చిన్న విషయం అనుకోవచ్చు రాళ్ళు నాణ్యత కొలవడం కష్టం అని చెప్పి గరిష్ఠ ధరలో సగానికి కొని వాటిని తిరిగి మన దేశానికే అమ్ముతున్నారు - ఇది ఎటువంటి communism అది capitalism రెండవ రంగు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి?
ఐదవది - ఒక జాతి వాళ్ళకి ఒక్కరే సంతానం ఉండాలి - ఇదెక్కడి న్యాయం
ఆరవది  - ౧౦ సంవత్సరాలుఒక వ్యక్తి కష్ట పడి తయారు చేసిన దాన్ని copy చెయ్యడం ఎంతవరకు సమానత్వం?

ఇలా అంటే నువ్వు చైనా వెళ్ళవా అక్కడ వాళ్ళతో మాట్లడావా అని ఎగిరే వాళ్ళే సగం communism పేరు చెప్పి రాచరికం అనుభవించడం ఇష్టపడే వాళ్ళు.