అమ్మ అడిగింది

ఈ రోజు అమ్మతో మాట్లాడుతున్నాను అప్పుడు అమ్మ నన్ను ఒక ప్రశ్న అడిగింది "పాలు మీగడ కట్టట్లేదు" అని నేను పాలకి ఎంత ఇస్తున్నారు అని అడిగాను నలభై అంది అంత ఇస్తున్నప్పుడు పాల packet కొనచ్చు కదా అన్నాను.
అప్పుడు అమ్మ నా మాట నాకే అప్పజెప్పింది పాలు అమ్మే పాల packet ఎవరు dispose చేస్తారు అని.
దానికి నా దగ్గర సమాధానం లేదు. ఇంకా ఆ పాలు నిలువ పాలు అంటే వాటిని నిలవజెయ్యడానికి ఏమీ కలపలేదు అని చెప్పగలవా అని?
ఇదికూడా నాకు అందని విషయం.
అమ్మకు చెబుదాము అనుకున్నాను అమ్మా మేము తప్పుజేస్తున్నాము డబ్బు డబ్బు అని పరిగెడుతూ కొత్త వస్తువు ముందే నేను ఉపయోగించాలి అని కోరిక పెంచుకుని మన గొయ్య మనమే తవ్వుకుంటున్నాము అని.
నా గమ్యం తెలుస్తున్నా మొదట ఏది మార్చాలో తెలియక సతమతమవుతున్నాను.