ఇది కొంత మందికి మాత్రమే అందరికీ కాదు


పూజకన్న నెంచ బుద్దిప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు,
విశ్వదాభిరామ వినురవేమ.

చేసే పూజ పునస్కారాలకన్నా బుద్ది మంచిదై ఉండవలెను, యిచ్చిన మాటకంటే ఆ మాటను నిలబెట్టు కోవటం ముఖ్యము. అలాగే ఏ కులంలో పుట్టిననూ ఆ కులం కంటే,గుణము మంచిదిగా ఉండవలెను.ఇదే ప్రధానము.

ఇది కొంత మందికి మాత్రమే అందరికీ కాదు
ఎందుకంటే అందరూ చెడ్డవాళ్ళు కాదు అని నా అభిప్రాయం. కొంతమంది మతం మీద ఎప్పుడూ బురదజల్లడానికే ప్రయత్నిస్తూంటారు. వాళ్ళ అభిమతం నాకు ఇప్పటికీ తెలియదు(అందులో పాశ్చ్యాత మతంలోకి మారలేదు అనే బాధ కూడా అయి ఉండవచ్చు).

మొన్న ఒక వ్యక్తి చేసిన ఒక అభిప్రాయం
The Professor Emeritus said: "In the text, it has been asked to do karma without thinking about the consequences. How can it be said that we should not think about the consequences? Whatever we do affects others too. For example, if I start drinking and then driving without thinking about the consequences, I might kill many people on the road."

ఇదే అతని చెడ్డగుణం తెలుపుతుంది. యుధ్ధానికి నువ్వు ప్రేరేపించలేదు అలాంటి సమయంలో సందిఘ్ధంలో ఉన్న అర్జునిడికి శ్రీకృష్ణుడు చేసిన ఉవాచ. దాన్ని ఇలాంటి వాళ్ళు తమకోసం ఉపయోగించుకుంటున్నారు.
మరి వీళ్ళను ఏమనాలి?
వీళ్ళా మనకు గురువులు అనిపిస్తుంది.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.