తాటి చెట్టు క్రింద నిలబడి పాలు తాగుతుదామంటే జనులు నమ్మెదరా(మరో ఉప్పు సత్యాగ్రహానికి తయారవ్వాలేమో!)


పాల నీడిగింటఁ గ్రోలుచునుండేనా
మనుజులెల్లఁగూడి మద్యమండ్రు
నిలువఁదగనిచోట నిలువ నిందలువచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.

తాటి చెట్టు క్రింద నిలబడి పాలు తాగుతుదామంటే జనులు నమ్మెదరా,అలాగే కల్లు అమ్మేవాని ఇంట్లో ఉండి పాలు త్రాగిననూ దానిని జనులందరూ కల్లుగానే అనుకుందురు. నిన్ను అనుమానింతురు.అలాగే చెడ్డవాడితో కూడితే జనులు మనలను కూడా చెడ్డవానిగాను భావించెదరు.

రాత్రికి రాత్రి పార్టీ పెట్టేసారు అంతే ఇప్పుడు జనాలకి అనుమానం వాళ్ళు వీళ్ళు ఒక్కటే అవుతారా మళ్ళీ వీళ్ళతో కలిసి మన గొంతు నొక్కేస్తారా?
ఇప్పుడు ప్రజలకోసం పనిచేస్తాం అని పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం నటిస్తున్నారు అని తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి.
ఒక ప్రతినిధి మీరు ఇలా బట్టలు కట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు అంటే ప్రజలకోసం అని, మరి మీ పిల్లలు అమెరికాలో ఎలా ఉంటారు అంటే అది వాళ్ళ ఇష్టం అంటారు మరి ఈ వ్యక్తికి డబులూ ఎలా వచ్చాయో దేవుడికే ఎరుక?


No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.