గురువులైనవారి గుణములీలాగురా!

మృగమదంబుఁజూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా!
విశ్వదాభిరామ వినురవేమ.

కస్తూరి రంగు చూడటానికి నల్లగా ఉండును కానీ దాని సువాసన మాత్రం ఎంతో గొప్పగా పరిమళభరితమై ఉంటుంది. అదే విధంగా గురువుల గుణములు కూడా.

ఇది నా విశ్లేషణ
ఉపాధ్యాయుడు పిల్లల ప్రయోజనం గురించి ఆలోచించాలి, అతనే మంచి గురువు.
చిన్నప్పుడు మాకు శిక్షలు ఉండేవి నాకు బాగా గుర్తు మేము పాఠాలు అప్పజెప్పక పొతే మా చేత గుంజీలు తీయించే వారు, గోడకుర్చీ వేయించారు వంగోబెట్టి పాఠాలు పఠనం చేయించే వారు. కానీ ఇప్పుడు చాలా మారిపాయింది. కొంతమందికి దానివల్ల ధ్యాస పెరిగేది నాలాంటి మూర్ఖుడికి ఎలాగైనా చదువు ఒంటబట్టదు :)

శిక్ష అనేది అతని ధ్యాస పెంచేదిశగా ఉండాలి కానీ అతనికి హాని కలిగేలా ఉండకూడదు, అద్దం మీద రాయి వేస్తే జరిగే లాగా అస్సలు ఉండకూడదు.

వేమనగారు చెప్పినట్టు గురువు కఠినంగా ఉన్నా విద్యార్ధులకు మంచి చెయ్యాలి అని తపించే వాడు కావాలి.

1 comment:

  1. mi post chadivi, kondarilonaina maarpu raavalani asistunnaanu. Please remove word verification.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.