రాముడొకడుపుట్టి రవికుల మీడేర్చె

రాముడొకడుపుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁజెఱచె
ఇలను బుణ్యపాప మీలాగు కాదొకో
విశ్వదాభిరామ వినురవేమ.


శ్రీరామచంద్రుడంతటి ఉన్నత గుణములు కలిగినవాడు సూర్యవంశమునందు జన్మించుట వలన ఆ వంశము చరితార్థమైనది. నేటికీ విఖ్యాతి చెందినది.అలాగే దుర్యోధనుడు జన్మించుట వలన కురువంశము నామరూపాలు లేకుండా పోవడమే కాకుండా ఆ వంశానికి ఎన్నటికి చెరిగిపోని అపఖ్యాతి కూడా కలిగింది.ఇవే పాప పుణ్యముల ఫలితాలు.

ఈ పధ్యం తెలిసికూడా మంచితనం అలవర్చుకోవడానికి ప్రయత్నించరు.
దానికి కారణాలు అనేకం
అందులో ముఖ్యమైనది హేయమైన డబ్బు వల్ల వాళ్ళ తరువాత తరం ఇక్కడ జనాలకి ముఖం చూపనక్కర్లేదు.
రెండవది అసలు పనిచేసేది మన గ్రామంలో కాదు కాబట్టి పరువుపోయినా బాధలేదు.