నీరు పల్లమెరుగు నిజముగాను

కల్ల నిజములెల్ల గరళకంఠు డెరుగు
నీరు పల్లమెరుగు నిజముగాను
తల్లితానెరుగును తనయుని జన్మంబు
విశ్వదాభిరామ వినురవేమ.

ఏది అబద్దమో, ఏది నిజమో నల్లని కంఠము కలిగిన ఆ పరమేశ్వరునికి తెలుసు ఆయన సర్వము గ్రహించగలడు.పల్లము ఉన్న వైపుకే నీరు గ్రహించును.బిడ్డ పుట్టే సమయం తల్లికి మాత్రమే తెలుసు.

ఈ సత్యాలు ఎప్పటికీ మారవు. ఎందుకంటే గరళకంఠుడు నీ కర్త, ఆయన చూపును దాటి ఏదీ పోలేదు.
నీళ్ళు ఎప్పుడూ పల్లానికే పోతాయి - ఇక్కడికి భౌతిక శాస్త్రం తీసుకు రాకండి. అక్కడ పీఢనం అలాంటివి చాలా ఉంటాయి.
బిడ్డ పుట్టే సమయం తల్లికి మాత్రమే తెలుస్తుంది, వైధ్యులు పుట్టే సమయం అటుఇటుగా మాత్రమే తెలుపగలరు ఆ సమయంలో నిజమైన సమయం తల్లికి మాత్రమే తెలుస్తుంది.

ఇక ఈ వెశ్లేషణ అవసరమా అని అందరూ అడగవచ్చు నాకు ఆ ప్రశ్నకు సమాధానం లేదు.

ఇకపోతే ఈ పధ్యానికి ప్రస్తుతం జరుగుతున్న ఆర్ధిక (కు)సంస్కరణలకు ఒక సంబంధం ఉంది.
తమదేశంలో నిరుధ్యోగం పెరిగిపోయింది అని అమెరికా అంటుంటే మా దేశంలో పెట్టుబడులకు ఆస్కారం ఉంది అని మన దేశ ప్రధాని

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
దినగదినగ వేము తియ్యగనుండు
సాధనమునపనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ.

(సాధన వలన ఏ కార్యము అయినా సాదించవచ్చు.మృదుమధురమయిన కంఠస్వరము ఎల్లవేళలా అలాగే ఉండాలంటే సాధన చేయటము ఒక్కటే మార్గము.అలాగే రోజూ తింటూ ఉంటే వేపాకులు కూడా కొన్ని రోజులకు తియ్యగా ఉన్నట్లు అనుభవంలోకి వస్తుంది.ఈ భూమి మీద ఏ పని అయినా సాధన చేయుట వలన సఫలం అవుతుంది.)
అని రెచ్చిపోతున్నారు అదే విదేశీ సంస్థాగత మదుపర్లకు ఈ పధ్యం కొంచం మార్చుకోండి అంటున్నారు.మూడవ వ్యాఖ్యం మొదట మేము చేస్తున్నాము(ఇప్పటి వరకు మీరు పెట్టుబడులు పెట్టడానికి మేము అనుమతి ఇవ్వడానికి ప్రయత్నించాము ఇప్పుడు సాధించాము)
ఇక మొదటి వ్యాఖ్యం మీకు మీరు మీ వస్తువులు తీసుకు వచ్చి ఇక్కడ అమ్ముకొండి మోదట్లో మీరు తెచ్చిన వస్తువులు మా జనులకు నచ్చవు అందుకే మా దేశ జనలుకు రెండవ వ్యాఖ్యం, వాళ్ళకే అర్ధం అవుతుంది.

ఈ తీరు దేశానికి చేటు చేస్తుంది అని భరత మాత గుండే తల్లడిల్లుతుంది. వేమనగారు పధ్యాలు మనం మంచి చెయ్యడానికి వ్రాస్తే వీళ్ళు దేశ ఆర్ధిక వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలించి బానిసత్వం అలవర్చడానికి పూనుకున్నారు అని.

మన దగ్గర డబ్బులు లేవా అంటే - ఉన్నాయి కానీ సంపాదించే వాళ్ళలో నూటికి ౭౦ శాతం మందికి ఇళ్ళు మీద అప్పులు ఉన్నాయి మిగిలిన ౩౦ శాతం డబ్బులు ఉన్నా అవి ఎలా ఉపయోగించుకోవాలో తెలియని పరిస్థితి.

ఇక మనం ఇళ్ళు కొన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవా అంటే, అవి ఎప్పుడో విదేశాలకు తరలిపోయాయి కదా. ఈ నిజం నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు లేవు కానీ ఇది నిజం ఈ నిజం ఆ ఈశ్వరుడికే తెలుసు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.