పసిడి గలుగువాని బానిసకొడుకులు!

కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు
విద్యచేత విఱ్ఱవీగువాడు
పసిడి గలుగువాని బానిసకొడుకులు!
విశ్వదాభిరామ వినురవేమ.

మంచి కులములో పుట్టినవాడు,వంద గౌరవము కలవాడు,చదువు వలన గర్వపడు వాడు వీరందురును ఐశ్వర్యము కలవానికి బానిడలుగానే బ్రతకవలయును.అనగా వారందురును ధనవంతుని ఆశ్రయించి ఉండవలసిన వారే. లేనిచో వారికి జీవనము లేదు.

అనగనగా ఒక వ్యక్తి అతనికి ఒంటిమీద పూర్తిగా బట్టలు ఉంటే లేదా ఉండాలి అంటే బండబూతులు తిడతాడు, కానీ వాటిని తయారుజేసే వాళ్ళు ఒకవేళ మేము మా వస్తువులు ఇక్కడ అమ్ముకుంటాము అంటే అదెలా కుదురుతుంది అంటారు.
ఈ ద్వందనాలుక నాకు లేదు నేను మొదట నుంచీ ఈ విదేశీ వ్యక్తిత్వానికి దూరం.......

మొదట మారాల్సింది వాళ్ళు కాదు మనం, చీరలు కట్టుకోవడం కష్టం కొంతమందికి, ఇంకొంతమందికి చీరలు భారం.
ఇదేకాదు ఒకవేళ ఆ విదేశీ సంస్థలు ఇక్కడ చేరాయనుకోండి అక్కడకి వెళ్ళే మార్గంలో పైన చెప్పిన వాళ్ళే ముందు ఉంటారు.
చెప్పే ముందు ఆచరించాలి(ఈ నియమం నేను చాలాసార్లు తప్పుతుంటాను - ఈ టపా వ్రాసింది అందుకే నేను ఒకవేళ ఆ మార్గంలో ఉంటే నన్ను ఎత్తి చూపిస్తారు అని అంతేకాదు ఎత్తి చూపండి)