ఓగునోగెగాక యుచితజ్ఞు డెటులౌను?

వేము పాలువోసి ప్రేమతో బెంచిన
చేదువిరిగి తీపిఁజెందబోదు
ఓగునోగెగాక యుచితజ్ఞు డెటులౌను?
విశ్వదాభిరామ వినురవేమ.

ఎవరి స్వభావాలను మనం నశింపచేయలేము.అది ఎట్లనగా వేప చెట్టుకు రోజూ పాలు పోసి ఎంత ప్రేమగా పెంచిననూ అది తీయగా మారదు.ఆ విధంగానే ఎంత మేలు, హిత బోధలు చేసిననూ చెడ్డవాడు మంచివాడుగా మారలేడు.

ఒకటి మాత్రం నిజం రెండవది నిజం అని మనం నిరూపించలేము ఎందుకంటే ఎవడూ పూర్తిగా చెడ్డవాడు కాదు కాబట్టి(నిజమే అనుకుంటున్నాను).
కొంతమంది తమకి అనుగుణంగా కొన్ని జనాభిప్రాయ సేకరణలు మార్చుకుంటున్నారు అందులో ఒకరు పారిశ్రామికవేత్తలు ఇంకొకరు తమని తాము Marxist సిధ్ధాంత వాదులుగా అనుకునే వారు.

నేను వ్రాస్తున్న ఈ టపా ఆ రెండు వర్గాలికే కాకుండా సామాన్య జనానికి కూడా........

నేను Horlicks కి వ్యతిరేకిని కాదు కానీ వాళ్ళు చెబుతున్న అబద్దాలకు.
Junior Horlicks, Normal Horlicks గురించి, దీని గురించి ఆ Marxist వర్గాల వాళ్ళు కూడా బుర్రపెడితే మంచిది.

పాలులో ఉన్నన్ని పోషక విలువలు ఏ విధమైన విధానంలో రావు మిగిలినవి కొంత వరకు పోషక విలువలు ఇస్తాయి. మనం ఇలా ప్రకృతి సిధ్ధంగా కాకుండా వచ్చినవాటి వల్ల పొందే లాభం శరీరంలో కొన్ని పరికరాలు పనిచెయ్యడం మానేస్తాయి.

పిల్లలు పాలు తాగకపోతే భయపెట్టి తాగించండి. తినకపోతే లాలించి భోజనం పెట్టండి. మీ బద్దకం వల్ల లాభపడుతున్నది రైతులు కాదు వ్యాపారస్తులు పారిశ్రామిక వేత్తలు.

ఇంకో విషయం మనం ముఖ్యంగా వీళ్ళకు అవకాసం ఇస్తే, పంటలు పండేచోట ఇళ్ళు, పంటలు పండనిచోట వరినాట్లు వేసే రోజులు వస్తాయి.

ఇక ఆ Marxist సైద్దంతికులకు, అవసారినికి ఒక వ్యక్తిత్వాన్ని గొప్పగాచూపడం మాను.

ప్రశ్న ప్రశ్నకు సమాధానం కాదు. జనాలకి కావలిసినది ప్రశ్న కాదు సమాధానం.

America వాళ్ళు నడిపే అభిప్రాయ సేకరణలు ఇక్కడవారికి ఎలా పనికొస్తాయో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. వాళ్ళవి పారిశ్రామికీకరణ ప్రజా అభిప్రాయాలు. పరిశ్రమలకు వ్యతిరేకంగా ఇచ్చే ఏ అభిప్రాయం ప్రచురించరు. ఈ Marxist వాదులు తమకి నచ్చినట్టు వాటిని అన్వయించుకుంటారు. మీకు నాయకత్వం నచ్చకపోతే మమ్మల్ని ఏమి చెయ్యమంటారు ౫ సంవత్సరాలు వాళ్ళు రాజకీయ కూర్చిలో కూర్చోవడానికి అనుమతి నిచ్చిన రాజ్యాంగాన్ని అడగండి. రాజ్యాంగాన్ని మార్పించండి.

ఇక ప్రజలకు
పాలు తాగకపోతే తాగేలా చెయ్యండి.అంతేగానీ వెళ్ళి Gujarath ముఖ్యమంత్రిని నిందించకండి. ఎందుకంటే మీ ఇళ్ళలో పిల్లలలాగా ఉండే వాళ్ళు రాష్ట్రంలో చాలా మంది ఉంటారు.
Horlicks అలవాటు చెయ్యకండి. ఎందుకంటే దాని వల్ల ఈరోజు కావలిసిన Vitamins వస్తాయి, కానీ తరువాత శరీరానికి కావలిసిన Vitamins ను ఆకుకూరలు లేదా మీరు మాంసం తింటుంటే వాటినుంచీ వాళ్ళ శరీరం పీల్చుకోలేదు.
కాకరకాయ కూర వారానికి లేదా నెలకి ఒక్కసారైనా తినేలా చేయించండి, చేదు ఒక్కోసారి మంచిదే.
Pizza Burger కు దూరంగా ఉండండి. వాళ్ళు మీకు వేసే Bill లో కనీసం ౧౦ శాతం కూడా తయారీ ధర ఉండదు, ఇంకా దాంట్లొ ఆసలు పోషక విలువలే ఉండవు.
పంటలు పండేచోట ఇళ్ళు కట్టకండి దయవుంచి వాటిని పంటలు పండించుకునేందుకే ఉపయోగపడనివ్వండి.
పాలు కొంటున్నారా అయితే ఒక చిన్న పని చెయ్యండి పాలను అక్కడే పాల packets నుంచీ ఒక గిన్నెలోకి పోసి ఆ packet ను దుకాణదారునికి తిరిగి ఇచ్చేయండి.
ఆర్ధిక స్వాతంత్రం లభించింది మంచి చెయ్యడానికి సమాజానికి ఇలా హాని చెయ్యడానికి కాదు. దయవుంచి Plastic వినియోగం తగ్గించండి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.