మనమే కూర్చోపెడుతున్నామా?

కనకమృగము భువిని గద్దు లే దనకయె
తరుణి విడిచి చనియె దాశరథియుఁ
దెలివి లేనివాడు దేవుడెట్లాయెరా
విశ్వదాభిరామ వినురవేమ.

మూర్ఖత్వము దేవుడిలో కూడా ఉంటుందా అని అనుకునేవారికి బంగారు లేడి భూమిపై ఉన్నదా లేదా అని రాముడు విచారించక తన భార్యయైన సీత కోరిక తీర్చుటకొరకు సీతను విడిచి దాని వెంటపడి వెళ్ళెను.ఆ తెలివి లేనివాడు దేవుడు ఏల అయ్యెను?
అనా ఆయన ప్రశ్న లేకపోతే
మనం దేవుని రూపం తెలుసుకోగలమా అనా?

దీని గురించి నాకు తెలియదు కానీ రాముడు మానవరూపంలో వచ్చిన విష్ణూమూర్తి అని అందరికీ తెలిసిన విషయం, వేమన మంచి పంచిన వ్యక్తి కాబట్టి. కానీ ఇక్కడ వేమన గారి ఉధ్ధేశ్యం మనం మాత్రమే దేవుడిని గుర్తించగలం అని. కానీ కొంతమంది మనలోని అమాయకత్వం అదునుగా అలుసుగా తీసుకుని రాక్షసులు పీఠం ఎక్కుతున్నారు.