Google is celebrating 25million downloads

చిత్త శుద్ది కలిగి పుణ్యంబు
కొంచమైననదియుఁకొదువకాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ.


మఱ్ఱి వృక్షము చూసినా ఎంత విస్తరముగా ఉండును.కాని దాని విత్తనమును చూస్తే ఎంతో చిన్నది. అలాగే మంచి మనసు తో చేసిన పుణ్యము బహుచిన్నదిగా తక్కువదిగా తలపోయరాదు. సద్బుద్ధితో చేసినది చిన్నదైనా,పెద్దదైనా ఉన్నత ఫలితమునే కలిగించును.

చాల సార్లు నాకు సమాజం ఏమి చేసింది అని ప్రశ్నించే వాళ్లతో విసిగిపోతున్నాను. సమాజం అంటే వాళ్ళు కాదా? వాళ్ళు సమాజంలో భాగం కారా?
ఒక పెద్ద దేశం అందులో ఉమ్మడి కుటుంబాలు, చిన్న చిన్న కలహాలు అయినా సర్ది చెప్పడానికి ఒక పెద్ద దిక్కు, అందువల్ల కొన్ని సార్లు మిగిలిన సొమ్ముతో దాన కార్యాలు లేకపోతే సకుటుంబ సమేతంగా పుణ్య తీర్ధాల ప్రయాణం.
కానీ ఆర్ధిక స్వాతంత్రం దాన్ని చిన్నాభిన్నం చేసేసింది.
పోనీ సంపాదించిన సొమ్ముతో బాగున్నారా అంటే అదీ లేదు Club's Disco's etc అని తగల పెట్టడం.
ఇంకోరకం డబ్బు ఉంది వెంటనే ఇళ్ళు(ఇల్లు కాదు) కొనాలి, ఒకటి కాదు రెండుకాదు చాలా పోనీ కార్యాలయం దగ్గరలో నా అంటే కాదు కార్యాలయంకు ౩౦ ౪౦ Kilo meters దూరంలో - ఇక దాని పర్యావసనాలు అనేకం ఇంటికి చేరుకోవడానికి కార్యాలయానికి రావడానికి పట్టే సమయం.
తరువాత మూడవ రకం నా లాంటి వాళ్ళు డబ్బు ఉన్నా నా వాళ్ళకు దూరంగా ఉన్నాను అని అనుకునే వాళ్ళు, పోనీ మానేస్తారా అంటే డబ్బు పిచ్చి పైకంగా మారితే ఎక్కడ మానేస్తారు?

ఇంత సంపాదించినా ఇంకొకడిని చూసి అసూయ ద్వేషం. ఇలాంటి వాళ్ళు దానం చేస్తారు అనుకోవడం తప్పే. కానీ మానవ ప్రయత్నంగా ఈ టపా.

రాసినది ఒకటి చెబుతుంది ఒకటి అని తిట్టుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఏమి చెయ్యను కుహునా వాళ్ళ పేరడీ, మొదలు పెట్టేది సంగసంస్కరణ చివరికి చేరేది అసలు సంబంధం లేని అవహేళన.

మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అందుకే ఈ లంకే

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.