ఎప్పడ నుంచో వ్రాద్దాం అనుకుని వాయిదా వేస్తున్నాను ఇప్పుడు వ్రాస్తున్నాను

మేడిపండుచూడ మేలిమై యుండు
పొట్టవిప్పిచూడఁబురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.


నిగనిగలాడుతూ కనిపించే మేడిపండుబయటికి చూచుటకూ చాలా చక్కగా కనిపించును. కాని దాని పొట్టవిప్పి చూస్తే లోపల పురుగులుండును. ఆ విధముగానే పై పై బీకరములు చూపు వాని మదిలో పిరికి తనము సందర్భము వచినప్పుడు బయల్పడును.

ఇది అక్షరాలా ముమ్మాటికీ నిజం Mutual Funds FD లకు పొంతన పెట్టిన వారికి.
అసలు inflation అంటే ఏమిటి అని ఒక గొప్ప ఆర్ధిక వ్యక్తి వ్రాసారు.
నాలాంటి వాళ్ళకు అసలు Stock Market మీద మొదటి నుంచీ దురభిప్రాయమే ఉంది, కాబట్టి నా వ్రాతలు నిజమో కాదో మీ మనఃసాక్షి మాత్రమే తెలుపగలదు.
మొదట అసలు Mutual Funds నాకు అర్ధమైన విధానం లో చెబుతాను నిజమో కాదో మీరే తెలుసుకోండి.
నా దగ్గర ౩ లక్షలు ఉన్నాయి దాన్ని ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు, అందుకని Mutual Funds లో పెట్టుబడి(క్షమించాలి అసలు ఇది పెట్టుబడి అని వ్యావహారికం మాత్రమే - నిజమైన పెట్టుబడి కానే కాదు) పెట్టాను దాన్ని ఆ సంస్థ నాలాగా డబ్బులు ఇచ్చిన వారి సొమ్ము Stock market లో Shares కొనడానికి అమ్మడానికి ఉపయోగిస్తుంది - ఇది కూలంకషంగా జరిగేది.

అంటే ఆ ధనం కేవలం ఒక వ్యక్తి నుంచీ ఇంకొక వ్యక్తి చేతికి చేరింది. మరి ఆ వ్యక్తి ఏమి చేస్తాడు దాన్ని తీసుకుని ఇంకొక Share కొంటాడు వచ్చిన లాభం తో కావాల్సిన సరుకులు కొంటాడు లేదా ఇంకొన్ని Shares కొంటాడు. మరి ఆ డబ్బు ఏమైంది? చివరకు ఎవరికీ ఉపయోగ పడనీ విధంగా మారింది.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం, మరి డబ్బులు ఎవరికీ ఉపయోగపడని స్థితికి చేరుకుంటే ఏమవుతుంది ధనం లభ్యత తగ్గుతుంది, ధనం లభ్యత తగ్గినది అంటే మనం నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వెచ్చించే సొమ్ము తగ్గిస్తాం పర్యావసనంగా, ధనాపేక్ష ఉన్న ఈ సంస్థలు ధర పెంచుతాయి. దీన్ని inflation అని అంటాం.

ఇంకో కారణం ఈ Mutual Funds Stock Market, Currency commodities వల్ల కలిగే నష్టాలు, కొన్ని సార్లు అన్నీ మన దేశంలో లభిస్తాయి అన్నది నిజం కాదు. అలాగని లభిస్తున్న వాటిని కూడా దిగుమతి చేసుకోవడం ఆరాచకం. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు(అదే ఇందాకా చెప్పాను కదా వ్యావహారికం మాత్రమే అని) వస్తాయి అంటే వాళ్ళకు Dollar నుంచీ Rupees కావాలి. అంటే Rupee ఆవశ్యకత పెరిగింది అంతే Rupee ధర పెరుగుతుంది. బాగుంది అంటే మనం Dollar కొనడానికి అయ్యే ఖర్చు తగ్గింది. ఎక్కువ నవ్వకండి అసలు కధ ఇప్పుడే మొదలయ్యింది అతను పెట్టిన పెట్టుబడి(పెట్టుబడి కాదు) ఉదాహరణకు ౧౦౦$ అనుకుందాం అంటే ౫౩౧౩.౯౮ కొన్ని రోజుల తరువాత లాభం వచ్చింది ౫౩౧౩.౯౮ కాస్తా ౧౦౬౨౭.౯౬ ఇప్పుడు రెండు జరుగుతాయి ఒకటి రెట్టింపు సొమ్ము(Rupees లో) వాడు ఎగరేసుకుని పోతున్నాడు, మరియు Dollar ఆవశ్యకత కాబట్టి Dollar ధర పెరుగింది. వెంటనే మనం ఒక్కోసారి బయట దేశం నుంచీ కొనుగోలు చెయ్య వలిసిన వస్తువుల ధర పెరుగుతుంది. ఉదాహరణకు Urea ధర లాంటివి.
ఇక inflation కాక ఇంకొకటో ఇంకోటో వస్తాదా?
కొనేది వేరే దేశం కానీ చెల్లింపులకు US Dollar ఎందుకో అర్ధం కాదు.
మరి FD లు చేస్తే లాభం ఏమిటి అన్నదే కదా మీ ప్రశ్న, ధనం రైతులకు ఉపయోగ పడుతుంది.(కొంత మంది అవినీతి పరులు కాకపొతే)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.