రేపటి నుంచీ ఒక పూటే

కొంచం వింతగా అనిపించింది కానీ కొత్త కాదు కరుణానిధి ఉదయం ౯ గంటల నుంచీ మధ్యాన్నం ౧౨:౩౦ నిమిషాల వరకు ఉపవాసం ఉన్నాడు అలాగ ఉంది petrol Bunks strike
ఉదయం ౮:౩౦ నుంచీ సాయంత్రం ౫:౩౦ నిమిషాల వరకు Normal Outlets in Cities ఉధ్యోగాలకు వెళ్ళే వాళ్ళుకు ఆ సమయంలో ఎక్కువ అవసరం ఉంటుంది. National High ways మీద రాత్రి ౭:౩౦ నుంచీ ఉదయం ౪:౩౦ వరకు, సాధారణంగా ఎక్కువగా Long Distance వెళ్ళేవాళ్ళు ఎన్నుకునే సమయం.
ఇందులో వింత ఏముంది, అవసరమున్న సమయంలో మేము తెరుస్తాము మిగిలిన సమయంలో మూస్తాము అని చెప్పారు. దీని వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు ఎందుకంటే
౧. ఇది వరుకు ప్రభుత్వానికి ఏ సమయంలో Current తియ్యాలో స్పష్టత లేదు ఇప్పుడు వీళ్ళు Petrol Bunks తెరిచి ఉంచిన సమయంలో మాత్రం Current తియ్యకుండా ఉంటే చాలు
౨. ౨౪ గంటలు తెరిచి ఉంచడం వల్ల ప్రజలలో బద్దకం పెరిగి సమయ పాలనకు దూరంగా ఉన్నారు, ఇప్పుడు కనీసం కొంచమైనా సమయ పాలన వస్తుంది.
కరుణానిధి నన్ను క్షమించు నువ్వు చేసిన ఉపవాసాన్ని వీళ్ళు చేస్తున్న Strike తో పోలుస్తున్నందుకు, ఎందుకంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ ఆ అరోగ్యం చెడకుండా ఉండడానికి ౩ AC లు రెండు ఫంఖాలు పెట్టించుకున్న గుర్తు, కానీ వీళ్ళు చేస్తున్న దాని వల్ల మళ్ళీ సమయ పాలనకు అలవాటు పడటం మొదలు పెడతారు ప్రజలు.