ఆడితప్పువారలభిమాన హీనులు

ఆడితప్పువారలభిమాన హీనులు
గోడెఱుఁగని కొద్దివారు
కూడి కీడు సేయఁగ్రూరుండు తలపోయు
విశ్వదాభిరామ వినురవేమ.


మాటతప్పేవారు హీనులు. వారు మాటపై నిలువలేరు. ఇలాంటివారు అభిమానం వదలి ఏ సమయానికి కావలసిన మాట ఆ సమయానికి అనగలుగుతారు. వీరిని ఎవరూ మెచ్చుకోలేరని వేమన మహాకవి ఈ పద్యంలో చెప్పారు.

ఇలాంటి వారు శ్రీరంగ నీతులు వల్లిస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
వేల ఎకరాలు కబ్జాచేసిన వాళ్ళు ఇప్పుడు జీవ పరిరక్షణ గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది.

కొంత మంది చెప్పే అబధ్ధాలు వాళ్ళకి కావలిసినవి దొరకక చెప్పేవి అని తెలిసి వాడ్ని దూరం పెడదాం అంటే మధ్యలో మతం తీసుకు వస్తారు, పైగా ఇలాంటి వాళ్ళు మతం ఉండకూడదు అనే వాళ్ళు. రెండునాల్కల ధోరణి వీళ్ళకి అలవాటే.

కొన్ని సిధ్ధాంతాలు పుట్టింది వాళ్ళకి కావలిసినది జరగక. అందరికీ కావల్సినవి జరగక కాదు.

ఇప్పుడు FDI తో జరిగేది కూడా అదే.