గత టపాలో కోపంతో వ్రాసాను ఇప్పుడు కొంచం సంయమనం పాటించి వ్రాస్తున్నాను

धुप - అంటే నిఘంటువు ప్రకారం కూడా ఎండ కాదు మరి తెలుగు Advertisement లో ఎండ అని ఎలా అంటారు?
నిజానికి అది కాంతి లేదా వెలుతురు.
अगर वो बाते जूट निकलेतो - ఆ మాటలే అసత్యమైతే, అసలు రెంటికీ పొంతన ఉందా. నిజానికి తెనుగులో ఇలా ఎలా ఉంటుంది? మాట నిలబెట్టుకోక పొతే అని ఉండాలి కానీ.
मै सरपे हाथ लगाके बोलता हं - తల మీద ఒట్టేసుకుని చెబుతున్నాను. నిగంటువు ను వాడేసారు నిజంగా, వాడి ఉద్దేశ్యం జుట్టు వెనక్కి చూపించి చెప్పగలుగు తున్నాను అని కానీ ప్రమాణాలు కాదు. అయినా ఇప్పటి కాలంలో ప్రమాణాలు ఎవరు నమ్ముతున్నారు.

ఇక నిన్నమన దేశంలో కోట్లు పెట్టి బాషా సంస్థలు(ILDC/TDIL) నడుపుతున్నారు, మరి అలాంటిది నిన్న నేను ప్రభుత్వ ప్రకటన లో ఒత్తులు పొల్లులు విడిపోయి కనిపించాయి(అదే జనన మరణాల నమోదు గురించి), అంటే ప్రభుత్వానికి తెలుగు అంటే అంత చులకనా లేదా డబ్బుల కోసం కనీసం computer లో తెలుగు లిపి లేని కేవలం తెలుగు Font ఉన్న computer లో ప్రకటన తయారు చేసారా ?

కొత్తగా ఇంకా చాలా ప్రకటనలు అనువాదములే. ఇక్కడ కూడా అమ్ముతారు కానీ ప్రకటనకు వచ్చే సరికి అనువాదాలు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.