అందరికీ అలవాటు పాడెయ్యి అని

నాకు కొన్ని విషయాలు అర్ధంకావు,అందులో అతిముఖ్యమైనది ఏదైనా పనికి రాకపోతే పాడేయ్యడం ఎందుకు అలవాటు చేసుకున్నాను అని, నాలాగే చాలా మంది.
ఇక దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనే కదా మీ ప్రశ్న, దాని దగ్గరకే వద్దాం.
ప్రతీరోజూ పత్రికలోనో లేక ఒక టపా లోనో చూస్తున్నాను, RTC లో పాత వాహనాలు ఇంకా వాడుతున్నారు అని. అది చెడ్డదే కానీ అవి ఎక్కడ పడెయ్యాలి అని మాత్రం రాయరు. ఎందుకంటే పాత వాహనాలు ఏమి చెయ్యాలో ఎవరికీ తెలియదు.అవి వ్రాసే వాళ్ళకు తెలిసినదల్లా కొత్తది వేగంగా వెళుతుంది మరియు కొత్తదాని వల్ల సౌకర్యంగా ఉంటుంది. కానీ పాతదాన్ని ఎలా విడగొట్టి పనికి వచ్చేలా చెయ్యాలో ఎవడూ వ్రాయడు, ఎందుకంటే వాళ్ళకు వీళ్ళ మీద నింద మోపడం తప్ప వేరే పని ఏముంది.
వ్రాసే మునుపు లేదా చేసే మునుపు నువ్వు పదేయ్యమన్న/పడేసిన వస్తువు కాలుష్యం అవుతుందా అని ఆలోచించు దాన్ని కాలుష్యం కలుగ చెయ్యని వాటిగా ఎలా మార్చాలో చెప్పు ఆ తరువాత కూడా వాళ్ళలో మార్పు రాకపోతే అప్పుడు నిందించు. అంతే కానీ ఎదో వ్రాయాలి కాబట్టి వ్రాయద్దు.


No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.