అసలు జయ ప్రకాష్ నారాయణ గారు అభిమతం ఏమిటి?

FDI లు రావడం అవసరమంట!
సరే ఆయన మాటే నిజం అనుకందాం(అదే గోదాములు సరిగ్గా నిర్వహించట్లేదు శీతల గిడ్డంగులు సరిగ్గా నిర్వహిచాట్లేదు), ఆయన అభిప్రాయం అబద్దం కాదు అనుకుందాం, ఇప్పుడు ప్రత్యక్ష పెట్టుబడుల దగ్గరకు వద్దాం. దీనిలో కిటుకులు గురించి మాట్లాడుకుందాం.
౧. స్థలం కొనాలి మళ్ళీ అది ఎవరి దగ్గర ఉంది అమ్మేది ఎవరు? మళ్ళీ ఆ MLA
౨. సరే స్థలం దొరికింది ఆ స్థలం ఎవరిదీ? అది ఇదివరకు పంట పోలమా? ఎవడూ ఎడారిలో గిడ్డంగు పెట్టడు కదా.
౩. గిడ్డంగులకు సరే పంట పొలం కాదు వేరే స్థలం దొరికింది మరి ఇప్పటి వరకు ఉన్నగిడ్డంగులు ఏమి చేస్తారు? వాటికి అప్పులు ఇచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏమవుతాయి?
౪. సరే ఇక పొతే గిడ్డంగులుకు కావాల్సిన ఇంధనం ఎక్కడిది?
౫. డబ్బులు లోపలి వస్తున్నాయి అంటే Currency Trading మొదలవ్వుది, అంటే Dollar విలువ పెరుగుతుంది మరి దీన్ని ఆపగలరా? అంటే రాజకీయ నాయకులు చేసే తప్పు ప్రజలు చేస్తే ఒప్పు అవుతుందా?
౬. ఇక గిడ్డంగుల నుంచీ బయట పడదాం ప్రస్తుత బజారు పరిస్థితులు గురించి కూడా చర్చిద్దాం, ప్రత్తి దోచుకుంటున్నారు నిరూపించి కారాగారంలో పెట్టించగలరా?
౭. జనాలు అసలు మన దేశంలో తయారైన వస్తువులు కొనడం మానేస్తున్నారు, వాళ్ళను వెళ్ళి చేనేత కార్మికులు చేత తయారు చేసిన వస్తువులు కొనమని చెప్పండి. ఇప్పటికే నేత కార్మికులు ప్రత్తి ధర ఆకాశాన్ని అంటుంది అంటున్నారు మరి ప్రత్తి ధర పెంచడం ఎంత వరకు సబబు?
౮. Barbie Dolls తెలిసినంత కొండపల్లి బొమ్మలు ఈ కాలం పిల్లకు తెలుసా?
౯. వాళ్ళ దేశాల్లో ఉద్యోగాలు లేవు కుర్రోమోర్రో అంటుంటే వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడితే వాళ్ళ దేశాల్లో ప్రజలు చూస్తూ ఊరుకుంటారా?
౧౦. చివరాకరిగా ఒక్క ప్రశ్న ధరలు Dollar లో ఉంటాయా? రూపాయల్లో ఉంటాయా?

1 comment:

  1. ఒక వినియోగదారుడుగా నేను ఎఫ్.డి.ఐ ని స్వాగతిస్తున్నా.మనకు వస్తువులు తక్కువ రేటు కి వస్తాయి. జె.పి గారు చెప్పినట్లు ఇప్పుడు గొడవ చేస్తున్న వాళ్ళలో ఎక్కువ శాతం పార్టీ ముసుగులో ఉన్న దళారులే.ఇన్ని రోజులు వ్యాపారస్థులు అమాయకులైన వినియోగదారులని వాళ్ళ ఇష్టారాజ్యం గా దోచుకుంటుంది చాలు.ఇంకా మిగిలిన విశ్లేషణలు అన్నీ ఒట్టీ మాటలే.చూద్దాం ఫలితం ఎలా ఉంటుందో. తొందరెందుకు.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.