ఎలా ధరలు తగ్గుతాయి? - FDI

నిజంగా ఇది ఒక సమాధానం లేని ప్రశ్న.
చూద్దాం అసలు FDI లు రాగానే జరిగే పరిణామాలు.
దళారులు కొనే దానికన్నా ఎక్కువకే కొంటారు చాలా మంచిది. ఇప్పుడు ఖర్చుల పట్టికకు వద్దాం రెండు విధానాలలో

దళారిFDI
రైతుకు చెల్లించిన ధరరైతుకు చెల్లించిన ధర
గిడ్డంగులకు తరలింపు ధరగిడ్డంగులకు తరలింపు ధర
గిడ్డంగులలో ఉద్యోగుల జీతాలుగిడ్డంగులలో ఉద్యోగుల జీతాలు
దళారి మోసం 
వ్యాపారుల లాభంవ్యాపారుల లాభం
వ్యాపారుల దగ్గర పని వాళ్ళ జీతాలు
(సాధారణంగా నాకు తెలిసి వీళ్ళ జీతాలు
3000 నుంచీ 5000 వేల వరకు ఉంటాయి)
సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ జీతాలు
Manger కు 50000 పైచిలుకు
HR కు లక్షల్లో జీతాలు
Company Auditor సంవత్సరానికి కు కోట్లు
ఉద్యోగులకు జీతాలు 10000 నుంచీ

AC నిర్వహణ ధరలు 

cleaning ధరలు

ఇక మీరు వెళ్ళి రావడానికి అయ్యే ఇంధనం ఖర్చులు.

మీరు తెచ్చుకున్న vehicles నిర్వహించేందుకు అయ్యే ఖర్చు.

సంస్థకు కాపలా సిబ్బంది జీతాలు.

Food processing ఖర్చు.
తగ్గింది హై హై FDI మరి ధరలకు కళ్ళెం వేస్తుంది అంటే నాకు నమ్మకం కలగట్లేదు చూద్దాం.

ఇక పర్యవసానాల దగ్గరకు వద్దాం

FDI ల వల్ల కొత్త ఇబ్బందులుపరిణామాలు
రైతుకు చెల్లించిన ధర పెరిగిందిఅంటే రైతు లాభ పడతాడు, రైతుకు పెరిగిన లాభం చూసి విత్తనాల ధరలు పెరగవా?
(దోచుకునే వాడికి మార్గాలు అనేకం)
గిడ్డంగులుకొత్త గిడ్డంగులు కడతారా పాత గిడ్డంగులు ఉపయోగిస్తారా?
కొత్త గిడ్డంగులు కడితే ఒక నష్టం - పంట పొలాలను ఉపయోగిస్తారు ఎందుకంటే దూరం ఎక్కువైతే రవాణా ఖర్చులు పెరుగుతాయి కదా
పాతవి ఉపయోగిస్తే అప్పటి వరకు అక్కడ పనిచేసిన కార్మికులను రానివ్వరు ఎందుకంటే కొత్త నిల్వ విధానం పాత వాళ్ళకు తెలియదు కాబట్టి శిక్షణ ఇచ్చిన కార్మికులనే పనిలో పెడతారు.
ఉద్యోగులుఅందరూ కొత్త వాళ్ళే(ఇది అబద్దం) రైతులు అవ్వచ్చు రైతు కూలీలు కావచ్చు. అంటే రైతు కూలీలు కానీ రైతులు కానీ వలస పోతారు, దాని వల్ల ఇప్పటికే కూలీల రుక్కం భరించలేక పోతున్నాం ఈ ఉపాధి పధకం వల్ల అనే రైతులు పంటలు వెయ్యడం మానేస్తారు పంటలు తగ్గితే ధరలు పెరగవా?
AC నిర్వహణఅసలే విద్యుత్తు ఇష్ట రాజ్యంగా పోతున్న రోజుల్లో ఎలా నిర్వహిస్తారు అంటే Diesel ఉపయోగించాలి, ఇప్పటికే America చెబుతున్న దాని ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంధనం ఎక్కువగా వాడుతున్నాయి అందుకే ఇంధనం ధరలు పెరుగుతున్నాయి, మరి ఇంధనం ధరలు పెరిగితే motor ఆధారిత పంటల ధరలు పెరగవా?
plasticఈ సంస్థలు plastic మాత్రమే వాడతాయి. మరి దాన్ని ఎక్కడ పాతి పెడతారు?
చిన్న దుకాణాలలో(నిన్న నేను cover వద్దు అంటే) కాగితంలో చుట్టి ఇచ్చారు, ఇదివరకు రోజులలో వేరు కాగితం లోనే చుట్టే వారు. మరి వచ్చిన plastic recycling ఖర్చు ఎవరు బరిస్తారు?
నువ్వు రావడానికి అయ్యే ఇంధనం ఖర్చుఇది పెరుగుతూనే ఉంటుంది(దీన్ని మనం చూడట్లేదు)
మరి ఇన్ని రకాలుగా మనం ధరలు పెంచుతున్నాం, ఎక్కడ తగ్గింది ఏమి తగ్గింది.
మొదట దళారులను నిలువరించండి. ఇప్పటికే ఈ దళారుల వల్ల మన దేశంలో సొమ్ము కనపడకుండా పోతుంది, ఇక FDI లు వస్తే దళారులు corporate సంస్థలుగా అవతారం ఎత్తుతారు.
corporate సంస్థ అంటే తెలుసు కదా మళ్ళీ చెప్పాలా?