ధరలు పెరుగుదలకు కారణాలు(Mutual Funds మరియు Stock Market)

నేను చాల కాలం నుంచీ ధరల పెరుగుదలకు వ్యతిరేకిని. ఎందుకంటే దాని వల్ల దెబ్బతిన్న వాడికే కదా దాని రుచి తెలుస్తుంది.

అసలు విషయానికి వద్దాం.

అనగనగా ఒక వ్యక్తీ అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు, ఈ కధ క్రితం టపాలో వ్రాసాను

ఇప్పుడు మన కధ దగ్గరకు వద్దాం,
నిజానికి మనలో చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నప్పుడు Fixed Deposits చెయ్యడం అలవాటు, కానీ  కాలం మారింది అని చెప్పి వెళ్ళి  డబ్బులు ఉపయోగ పాడనీ ప్రదేశానికి పంపడం మొదలు పెట్టాము అదే Mutual Funds and Stock Market. కధలు అనేకం ఒకడికి investment(నిజానికి కాదు) ఇంకొకడికి లాభం కోసం ఇంకొకడి నిర్వచనం ప్రకారం Fixed Deposits మీద వచ్చే వడ్డీ పై పన్ను చెల్లించాలి అని.

కానీ మనం మన కాలునే మనం నరుకుంటున్నాం, అది ఎలాగా అన్నదాని గురించి విసిదీకరిస్తున్నాను

మీ దగ్గర ఇప్పుడు ౧ లక్ష ఉంది, దాన్ని నిల్వ చెయ్యాలి అనుకున్నారు, మీరు బాగా research చేసి అబ్బో Banking Shares చాలా హేచ్చులో ఉన్నాయి అని చెప్పి ఇంకా పెరుగుతాయి అని చెప్పి Mutual Funds Banking sector. అసలు చేసిన పెద్ద తప్పు అదే. ఏమయ్యింది ఇప్పుడు Banks వద్ద నిరర్ధక ఆస్తులు పెరిగి పోయి ఆ Share విలువ పడిపోయింది, దాంతో మీ వద్ద ఉన్న Mutual Fund విలువ పడిపోయింది.

ఇక అసలు Mutual fund ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి వద్దాం, నేను చెప్పేది నిజం అవునా కాదా అన్న విషయం మనం RTI file చేసిగానీ తెలుసుకోలేము కానీ  కొంత మంది వ్రాసినది చదువుకోండి.

నేను తెలుసుకున్న దాని బట్టి ఇలా(Equity segment), Equity Segment లో కొనాలి అని వ్రాసి ఉన్న వాటిని కొంటారు. నిజమే కదా కొనాలి అని వ్రాసి ఉంది మరి అమ్మేది ఎవరు? నాకు ఇప్పటికీ అర్ధం కాని విషయం సర్లే మీకు ఇప్పుడు ఒక సందేహం వచ్చే ఉంటుంది దీనికి ధరలకు లంకె ఏమిటి అనే కదా మీ అనుమానం అదే చక్రవ్యూహం ఇక్కడ జరిగే అబద్దపు ప్రచారం.

ఏమవుతుంది విదేశీ పెట్టుబడుల(పెట్టుబడులు కాదు దాని నిర్వచనం దానిదే) పెట్టారు కొంత మంది. ఇప్పుడు వాళ్ళకు  లాభాలు వచ్చాయి అదే కొనాలి అని వ్రాసారు కదా . వెంటనే వాళ్ళు అమ్మకాలు మొదలు పెడతారు దాంతో Dollar Demand పెరుగుతుంది అంటే Dollar యొక్క మారకపు విలువ పెరుగుతుంది.అది పెరగడం చూసి ఇంకొంతమంది currency trading commodity trading మొదలు పెడతారు, డబ్బుకు ఉన్న విలువ shares కు ఉంటుందా అంటే ఉండదు, కాబట్టి Dollar ధర పెరిగినా కొంటారు, మరి Dollar ధర పెరిగే సరికి ఎగుమతుల మీద వచ్చేది పెరుగుతుంది కదా మరి లాభమే కదా అనుకోవచ్చు, కానీ ఎగుమతి మన దేశం నుంచీ జరుగుతున్నాది ఏమిటి దూది ఆహార పదార్ధాలు Software(ఇది ఇప్పుడు లేదు), అవి మనకి కూడా అవసరం అమ్మేవాడు ఎక్కువ లాభం చూసుకుంటాడు కానీ దాని వల్ల  పర్యావరణ హాని సమతుల్యత దేశంలో పెరుగుతున్న ధరలు పట్టించు కుంటాడా లేదు  . ఇక మనం ఎగుమతులు దిగుమతులతో నిష్పత్తి వేసుకుంటే దిగుమతి పదార్ధాలు చాలానే ఉన్నాయి మరి వాటి ధరలు పెరగవా? కచ్చితంగా పెరుగుతాయి, దాంతో ద్రవ్యోల్పణం పెరుగుతుంది ఈ మధ్యలో కుంభకోణాల ద్వారా వచ్చిన డబ్బు కూడా విదేశాలకు తరల్చడం వల్ల Dollar ఇంకా బలపడుతుంది.
ఇక ద్రవ్యోల్పణం పెరగడం వల్ల అన్నీ అమ్మాలి అంటారు(ఇప్పుడు కొనేవాడు కచ్చితంగా దొరకడు) కాబట్టి తక్కువ ధరకు అమ్మడం  మొదలు పెడతారు కాబట్టి Mutual Fund లో NAV తగ్గుతుంది, ఇప్పుడు నీ చేతిలో ఏమి మిగిలింది?
దీనికి నువ్వు Market research చెయ్యలేదు అనే సమాధానం, ఇంతకన్నా Market research అంటే ఏమిటి?

ఎంత ద్రవ్యోల్పణం ఉన్నా వీళ్ళ జేబులు నిండుతూనే ఉంటాయి. ఇకపోతే Fixed deposits వల్ల  లాభాలు "Warren Buffet"లాంటి వాళ్ళు ఉండరు, Sardar Vallabhbhai Patel Verghese Kurien లాంటి వాళ్ళు తయారు చేసిన ౩ Million Virtual గా లాభ పడే వాళ్ళు ఉంటారు.