పనికి రానిది అవసరమా?


ఈ ఖతి దిగుమతి చూసుకుని ఒక్కసారి తిరిగి రండి. కొత్తగా కనిపిస్తే అక్కర్లేదు.

నన్ను నేను ఎన్నో రోజులుగా ప్రశ్నించు కుంటున్న ప్రశ్న.
నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తున్న ఒక సంఘటన మా ఇంట్లో ఇనుప బాల్చీ తుప్పు పట్టినప్పుడు లేదా దానికి చిల్లు పాడినప్పుడు దానికి మక్కు పెట్టడం లేదా దానిని కరిగించి కొత్త వస్తువో తయారు చేయించడం. కాలం మారింది ఆ వ్యవస్థ నశించింది(కాదు నాశనం చేసాము)
మనం తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామో అర్ధం కాని పరిస్థితి నాది.
దానికి కారణాలు అనేకం అందులో మొదటిది అతి ముఖ్యమైనది
పల్లెలలో(నాకు తెలిసి ఏ ఊరు పట్టణం కాదు - ఆధునిక భాషలో) అందరికీ తెలిసినది ఇప్పుడు పాలు packets అమ్ముతున్నారు, వాటి వల్ల నష్టం వాటిని తిరిగి కొన్ని రోజులు ఉపయోగించగలం కానీ వాటిని తిరిగి బాగు చెయ్యలేము పైగా వాటిని ఏమి చెయ్యాలో తెలియక కాలుష్యం కల్గిస్తుంది అని తెలిసినా తగలు బెడుతున్నారు. మరి ప్రత్యాన్మాయం లేదా అంటే ఉంది కానీ జనాలు వీటిని ప్రత్యామ్నాయాలు అనుకుని తెచ్చుకున్నారు కదా పాతవి ఉపయోగించ మంటే వీటు సత్యకాలం లో బ్రతికే వాడు అంటారు. అయినా చెబుతున్నాను మీరు ఒక గాజు సీసా కొనుక్కుని అందులో పాలు నింపుకొని లేదా లోహం తో తయారు చేసిన గిన్నెలు ఉపయోగించి ఆ ఖాళీ packet వాళ్ళకు తిరిగి అప్పగించండి.
ఇలా కొన్నిటిని మనం నిషేదిద్దాం.
నేను నా అభిప్రాయం తెలిపాను మీరు కూడా మీ అభిప్రాయం తెలపగలరు అని నా అభిమతం.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.