కొన్ని మోసాలు గమనిద్దాం!(Stock Market)

ఇక్కడ నేను చెప్పేవి చిన్నవిగా కనిపించవచ్చు కానీ తరువాత అవి చేసే నాశనం తక్కువ కాదు.
౧. Kingfisher Airlines -
ఇందులో మీరందరూ వీళ్ళు పైకి చెబుతున్నట్టు జీతాలు చెల్లించలేని స్థితి మరియు ధరల పెరుగుదల, అసలు కారణం అందుకు భిన్న మైనది,
మీ అందరికీ తెలుసు Flight లో రెండు వర్గాలు ఉంటాయి మొదటిది వ్యాపారి వర్గం రెండవది సామాన్య వర్గం.
cancellations ఉంటాయి అని చెప్పి సామాన్య వర్గానికి ఉన్న సత్తువ కన్నా ఎక్కువ సంఖ్యతో reservation కు అనుమతి ఇస్తారు. కొన్ని సార్లు ప్రయాణాలు మానుకునే వాళ్ళు తక్కువ కాబట్టి కొంత మంది సామాన్య వర్గం వాళ్లకు ప్రయాణానికి వీలు కుదరదు అందుకని వాళ్లకు(ఇది వ్యాపార వర్గానికి ఉంటాదో లేదో తెలియదు) ఒక అయిదు నక్షత్రాల వసతి గృహంలో తరువాత ప్రయాణ తారీకు వరకు వసతి ఏర్పాటు చేస్తారు(మరి ఇక్కడ వీళ్ళకు ఇస్తున్న డబ్బులు ఎక్కడివి)
తరువాత వ్యాపార విభాగంలో వాళ్ళకు అన్ని రకాల మధ్యపానీయాలు ఇస్తారు అది కూడా తన brand(Kingfisher) లో అత్యధిక ధర పలుకుతున్న పానీయాలు ఈ రెండు విషయాలు చాలు నా లెక్క ప్రకారం
ఇంకా చెప్పాలి అంటే ఆ kingfisher calendar అదో దరిద్రం.
౨. ICICI -
దీని మోసాలు అన్నీ ఇన్ని కావు, లాభాలు చూపిస్తుంది అనుకోవచ్చు కానీ ప్రజలను పీల్చుకు తింటున్నాయి.
వీళ్ళు చేసే మోసాలు కొన్ని లాభాలు స్వీకరించడానికి అప్పులు ఇచ్చిన చోట వసూలు చెయ్యకుండా సంస్థకు అప్పు(నిజానికి మనం savings ఖాతా అని నా అభిప్రాయం) ఇచ్చిన వాడిని దోచుకుంటాయి, ఇంకొన్ని రోజులలలో ఆ సంస్థకు అప్పు ఇచ్చే వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదేమో(అదే savings ఖాతా ఉంచే వాళ్ళు)
౩. SBI -
వీళ్ళను మోసం చేసే వాళ్ళే, ఎక్కడ NAV లు బయట పడతాయో అని ప్రభుత్వాలు వీళ్ళ చేత సుదూర ప్రాంతాలలో ఉద్యోగులకు Conference ఏర్పాటు చేస్తాయి, దాని వల్ల ఉద్యోగులకు పని భారం పెరగడమే కాకుండా కొన్ని సార్లు పెద్ద పెద్ద మోసగాళ్ళు వెతికి పట్టడంలో ఆలశ్యం జరిగి వాళ్ళు పారిపోవడానికి సమయం దొరుకుతుంది.
చాలా ప్రభుత్వ రంగ పధకాల వల్ల నష్ట పోతూనే ఉంటుంది, ఎందుకంటే మంత్రుల ఒత్తిళ్ళు ఒక్కోసారి అప్పు తీసుకున్న వ్యక్తీ చేసే మోసాలు ఎలాంటివంటే యంత్రం అసలు ధరకన్నా రెట్టింపు ధర దాని వల్ల ఒక్కోసారి ఆస్తులు జప్తు చేసి అమ్మినా ౪ వంతు కూడా రావట్లేదు.

ఇవి నాకు తెలిసిన కొన్ని మోసాలు తెలిసినప్పుడు ప్రచురిస్తుంటాను.