Thanks giving day అంటే

మొన్న మీకు తెలిపాను కదా మనందరి కోసము: వ్యాపారస్తుల కోసం మన శాస్త్రాలు లేవు కానీ మన....
ఇప్పుడు ఇంకొన్ని, నిజానికి ఎవరికైనా ధన్యవాదాలు తెలపాలి అంటే మనం వాళ్ళను ఇంటికి పిలిచి భోజనం పెడతాము, కానీ దాని వల్ల తక్కువ డబ్బు వ్యాపారస్తుల చేతికి వెళుతుంది, పైగా అక్కడ కొన్ని సార్లు ఈ FDI లకు కూడా లాభం చేరదు.
సరే అసలు ఇప్పుడు ఉన్న ధన్యవాద దినం గురించి మాట్లాడు కుందాము, ప్రస్తుతం Moore's సూత్రం ప్రకారం transformer size (విద్యుత్తు transformer కాదు) సగానికి పడిపోవడం వల్ల సంస్థలు ఇష్టా రాజ్యంగా ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. మరి వ్యాపార సూత్రం ప్రకారం లభ్యత పెరిగితే ధర తగ్గాలి కానీ అది కేవలం ఆహార విషయంలో మాత్రమే జరుగుతుంది(ప్రస్తుతానికి - తరువాత రోజులలో అది కూడా ఉండదనుకోండి - FDI లు వస్తున్నాయి కదా) ధరలు పెరుగుతున్నాయి ఏమంటే retina display అని ఇంకొంతమంది కొత్త ఉపకరణాలు అని ఏవో పేర్లు పెడుతున్నారు(ఆ జాబితాలో నేనూ ఉన్నాను అనే బాధ - Software Engineer) దాని వల్ల మూల ధర తగ్గినా brand value(అదో చెత్త) పెరగడం వల్ల వాటి ధర తగ్గించి అమ్మలేక పోతున్నారు, దాంతో ఏమయ్యింది మొత్తం సూన్యం అయ్యింది, కొన్ని రోజులు hotcakes(ఆకలి లేక పోయినా తినడం - అంటే అవసరం లేక పోయినా కొనడం) తరువాత ఇది బాగుంది అని అరిచి గోగ్గోలు పెట్టినా కొనే వాళ్ళు ఉండరు, మరి ప్రస్తుతం ఆ సామాన్లు విడగొట్టి కొత్త వాటిలాగా చెయ్యడం కుదరదు ఏమి చెయ్యాలి?
వెంటనే వస్తుంది ఈ ధన్యవాద దినం, అంతే ఈ పాత సామాన్లు వాళ్ళకు లభించిన ధరకు ఆ రోజు అమ్మడం మొదలు పెడతారు, పైగా packing చేసి. ఈ పిచ్చి జనం నాకు అది దొరకినది ఇది దొరికినది అని చంకలు గుద్దుకుని పాత వస్తువులు వాడతారు(అంటే అన్ని సార్లు జరుగుతుంది అని చెప్పలేము కానీ మన దేశానికీ వచ్చిన laptops అవన్నీ చూసి వ్రాస్తున్నాను) ఎందుకంటే ఆ ఒక్క రోజే Dealer price మీద చిన్న లాభంతో అమ్ముతారు కాబట్టి.

పాతవి(కొత్తవి) దొరికిన dealer ధరకు దొరికింది కదా ఏమిటి నీ ఏడుపు అనే కదా, ఇక్కడ వాళ్ళు నిల్వ ఉండిపోయిన వస్తువులు లేదా ఎవరూ కొన్ని వస్తువులు అమ్మి 30 రోజులలో సంపాదించేది 7 రోజులలో సంపాదిస్తారు, పోయేది నువ్వే పాత వస్తువు కొనుక్కుని.