1. ఇప్పటికే దేశీయంగా రిలయెన్స్ ఫ్రెష్, మెట్రో లాంటి బడా రీటెయిల్ కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటి వల్ల చిన్న చిన్న కిరాణా వర్తకులకు, రోడ్ల మీద తిరుగుతూ కూరగాయలు అమ్ముకునేవారికి నష్టం జరగడం లేదా? 'ఎఫ్.డీ.ఐ' అన్న మాటే లేదు తప్ప ఇది కూడా 'బడా వ్యాపారులు వర్సెస్ చిన్నవ్యాపారు' ల పరిస్థితే కదా?
దీనర్ధం భారతీయుడు దోచుకోకూడదు విదేశీయుడు దోచుకున్నా పర్వాలేదా అనా?
దోచుకోవడం ఎవడు చేసిన దోచుకోవడమే.
2. రోడ్ల మీద పాదచారులకు, సైకిళ్ళమీద వెళ్ళే వారికి అసౌకర్యంగా ఉంటున్నాసరే, కార్ల సంఖ్య పెరిగిపోవడానికి అవకాశమిస్తున్నాం. బీజేపీ హయాంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం సాగించారు. ఆ విషయాన్ని ఆ పార్టీ సగర్వంగా ప్రకటించుకుంటూ ఉంటుంది. నాలుగు లేన్ ల రోడ్ల నిర్మాణం జరిగిన పల్లెలకు వెళ్ళి చూడండి. కార్లు, లారీలే తప్ప ఎడ్ల బండ్లు కనిపించడంలేదు. గతంలో రోడ్డు దాటడానికి వీలుండేది. డివైడర్ల వల్ల ఇప్పుడా అవకాశం పోయింది. దృశ్యాన్ని ఇంకో వైపు నుంచి చూడండి... పాదచారులు, సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళూ ఎప్పటికీ అలాగే ఉండిపోవడం లేదు. బైక్ కొనుక్కునే స్థాయికీ, కారు కొనుక్కునే స్థాయికీ ఎదుగుతున్నారు. అలాగే, అసంఖ్యాక ప్రజానీకానికి అందుకొనే స్థోమత లేకపోయినా ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూళ్ళు, సాంకేతిక కళాశాలలు అవతరిస్తూనే ఉన్నాయి. అయినా జరుగుతున్నదేమిటి? రిక్షా కార్మికుడు, రోజు కూలీ దగ్గరనుంచి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఆ స్థాయి విద్య అందించాలనుకుంటున్నారు. ఈ మొత్తం సన్నివేశం నుంచి బడా చిల్లర వ్యాపార సంస్థలను మాత్రమే మినహాయించాలనడంలో సహేతుకత ఏమిటి?(ఎఫ్.డీ.ఐ అనే మాటను కాసేపు వదిలేద్దాం)
ఎవడు వెళ్ళాడు వాహనాలు కొనుక్కునే స్థాయికి అందరూ అప్పుల మీదే కొంటున్నారు, ప్రభుత్వాలకు Banks కు పంగనామాలు పెట్టి తిరుగుతున్నారు, వెళ్ళి అడగండి ఎంతమంది సొంత ఖర్చుతో కొన్న వాహనాలో? ప్రభుత్వాలు ప్రభుత్వ పాటశాలలు కట్టించలేదు అని ఇప్పుడు తీసుకు వెళ్ళి ఆంగ్ల మధ్యమ బడిలో చదివించడం చేసి ప్రభుత్వాల చేత డబ్బులు వృధా చేయించిన రోజు అనిపించలేదా ఈ స్థోమత వస్తుంది అని.
3. ఇందులో చిన్న చిన్న చిల్లర వ్యాపారుల ఉపాధి సమస్య ఇమిడి ఉంది కనుక పై అంశాలతో ఈ సమస్యను పోల్చలేమని మీరు అనచ్చు. అయితే ఏ కుటుంబమూ ఈ రోజున ఒకే ఉపాధిని పట్టుకుని వేళ్ళాడడం లేదన్న సంగతినీ గుర్తించాలి. 'ఒక చిల్లర వ్యాపారి కుటుంబంలో కనీసం అయిదుగురు సభ్యులు ఉంటారనీ, ఎఫ్.డీ.ఐ వల్ల వాళ్ళందరికీ ఉపాధి పోతుందనీ" అంటున్నారు. జరిగేది ఏమిటంటే, అయిదుగురూ చిల్లర వ్యాపారమే చేయాలనుకోరు. చదువులు వగైరాలతో ఇప్పటి ఉపాధి కంటే ఉన్నతమైన ఉపాధికి మళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ అదే ఉపాధి మార్గం లో ఉన్నా తండ్రిని మించి వ్యాపారాన్ని వృద్ధి చేసే మార్గాలు తొక్కుతారు. ఆ క్రమంలో వాళ్ళు కూడా ఏ సూపర్ బజార్ స్థాయికో వెళ్లాలని అనుకోవచ్చు. ఇంకో సన్నివేశానికీ అవకాశం ఉంది. ఒక కిరాణా వ్యాపారి కొడుకు పై చదువులు చదివి ఏ విదేశంలోనో ఉంటూ వాల్ మార్ట్ లో షాపింగ్ చేస్తూ ఉండచ్చు. ఇలా అనడం ద్వారా సమస్యను చులకన చేస్తున్నానని దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా ఊర్ధ్వచలనం ఇలాగే సంభవిస్తుంటుంది. ఇందుకు భిన్నంగా ఎఫ్.డీ.ఐకి వ్యతిరేకంగా వాదించేవారు సమాజాన్ని ఒక చలనశీల దృక్పథం నుంచి చూసే బదులు నిశ్చల చిత్రంగా చూస్తున్నారా?
ఇది విడిపోవాలి అని కోరుకునే వారి మనస్థత్వం ప్రపంచం చిన్నది అని అర్ధం చేసుకునే రోజులు త్వరలోనే వస్తున్నాయి, సరే మీరన్నట్టు అందరూ వెళ్ళి ఉద్యోగాలే వేలగాబెడతారు అనుకుందాం అసలే ఈ వ్యాపార సంస్థల జేబుల నుంచీ పైసా రాలట్లేదు ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడ నుంచీ వస్తాయి? వీళ్ళకు డబ్బులు తీసుకోవడమే తెలుసు తప్ప ఇవ్వడం తెలియదు.
4. చెడిపోయే పండ్లు, కూరగాయలు వగైరాల శాతం తక్కువే నని వాదించడం గమనిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. ధాన్యం వగైరాలు నిల్వ చేయడానికి తగినన్ని గోదాములు, శీతల గిడ్డంగులు లేకపోవడం ఏటా చర్చకు వస్తూనే ఉంటుంది. వృద్ధి రేటు పెరిగిన దశలో కూడా చాలినన్ని గిడ్డంగులు నిర్మించలేని దుస్థితిలోనే ప్రభుత్వాలు ఉన్నాయి. ఎన్డీ.ఏ హయాంలో కూడా టన్నుల కొద్దీ ఆహార ధాన్యాలు ఆరుబయట ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పుచ్చిపురుగులు పట్టడం గురించి; ఎలుకలకు, పందికొక్కులకు ఆహారం కావడం గురించి విన్నాం. ఇటీవలి కాలంలో సుప్రీం కోర్ట్ కూడా ఈ సమస్యను తీవ్రంగా తీసుకున్న సంగతి తెలుసు. గిడ్డంగుల నిర్మాణానికి విదేశీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సంగతి అబద్ధం కాదు. ఇక సరఫరా వ్యవస్థ మరింత అధ్వాన్నం. పీడీఎస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాణ్యతకు సరి తూగడం లేదని చెప్పి అమెరికా మన దేశం నుంచి కొంతకాలం పాటు మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన సంగతిని గమనించారా? వీటన్నిటి నేపథ్యం నుంచి ఎఫ్.డీ.ఐని చూడవలసిన అవసరం లేదా?
నిజానికి మీలాంటి వాళ్ళు చెబుతున్న అబద్దపు ప్రచారాలలో ఇది ఒకటి, మా ముందు తరంలో జనాలు తృణ దాన్యాలు కానీ బియ్యం కానీ వడ్లు కానీ ఇళ్ళలో నిల్వ ఉంచేవారు, ఇప్పుడు కాలం మారింది విదేశీ విపణి పెరగడం వలన "అన్నం తినడం వలన లావై పోతాను కాబట్టి అన్నం తినడం మానేసాను".
అనే వాళ్ళే మరి అమ్ముడు కాని అన్నం కోసం డబ్బులు వేచ్చిస్తారా అంటే నేనైతే నమ్మను, అదే కాకుండా గిడ్డంగులు పడిపోయి మక్కి పోయిన బియ్యం ఉంది అని వార్తా పత్రికలూ గోగ్గోలు పెడుతున్నాయి, మరి విదేశీ గిడ్డంగులు ఎలా సాకుతారు?
ఇక మీ మామిడి పండు కధ కే వద్దాం మామిడి పండు నేను తినని సంవత్సరం లేదు మరి నాకు నాణ్యత తగ్గడం వలన తేడా చేసిందా అంటే లేదు మరి అక్కడ మాత్రం ఎందుకు తేడా చేస్తాది చెయ్యదు కానీ ఆ దేశంలో పాండిచే మామిడి పళ్ళను కొనే వాళ్ళు తగ్గిపోతారు అన్న చిన్న విషయం కూడా మీరు అర్ధం చేసుకోలేదు "బంగినపల్లి మామిడి రుచి వేరే ఏ మామిడి పండుకు రాదు అని వాళ్ళకు తెలుసు కాబట్టి" - ఇక మీరు అన్నట్టు దిగుమతి నిషేదించారు అనే అనుకుందాం మరి దిగుమతి నిషేదిస్తే ఇక్కడకు వచ్చిన ఆ దేశ ప్రజలు ఎందుకు తింటారు అని ఆలోచించే స్థాయిలో లేక ఇలా వ్రాస్తున్నట్టు ఉంది.
ఇక నేను గతంలో చాల మార్లు చెప్పాను మన డబ్బులతొటే వాళ్ళు ధనవంతులు అయ్యే ప్రయత్నం అని, ఇప్పటికీ అదే చెబుతున్నాను.
ఆ దేశాలలో నిరుద్యోగం పెరిగిపోతుంటే అసలు పెట్టుబడులకు ఆ దేశ ప్రజలు ఎలా సమ్మతిస్తారు?

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.