నేరమూ శిక్ష

ఇది ప్రస్తుతం నన్నువేధిస్తున్న అనేక ప్రశ్నలు.

నేరం చేసిన వ్యక్తికీ శిక్ష పడటం సంగతి అలా ఉంచితే చెయ్యని వాడికి పడే శిక్షే ఎక్కువ.

ఉదాహరణకు పొగత్రాగువాడికి జరిగే హానికన్నా పీల్చే వాడికి హాని ఎక్కువ.

౫ సంవత్సరాల క్రితం నాకు ఒక కాలు విరిగింది, ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు అక్కడ వైద్యుడు అడిగిన మొదటి ప్రశ్న నా శరీర ఆకృతిని చూసి తాగేసాడా అని అడిగాడంట, దానికి నా స్నేహితుడికి అప్పటికే నా రక్తం చూసి భయపడుతున్న వాడి నోరు పెగల్లేదు, తరువాత తేరుకుని వీడికి తాగుడు అలవాటు లేదు అని చెబితేగానీ ఆ వైద్యుడు ముందుకు కదలలేదు, అంటే ఆ ఆకృతి ఉన్న వాళ్ళంతా తాగుబోతులా?

ఇక ప్రతీ ఒక్కడూ పురుషాధిక్య సమాజం అని ఏడుస్తూ ఉంటారు కానీ వీటి గురించి ఎప్పుడూ అనరు
అత్తగారి ఆడపడుచు పెత్తనాలు తోతికోడల్ల గొడవలు, అంటే ఒక పురుషుడు తప్పు చేస్తే అది అందరి తప్పా?

పురుషాధిక్య ప్రపంచం అయితే పురుషుడు పురుషుడిని ఎందుకు హీనంగా చూస్తాడో చెప్పగలారా.

సరే పురుషాధిక్య సమాజం అనే అనుకుందాం అలా అయితే జీతగాడు కానీ వాళ్ళకు పెళ్ళిళ్ళు ఎందుకు జరగట్లేదు?
బ్రాహ్మణులనే చూడండి ౪౦ సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్ళి కాని వాళ్ళు ఎందఱో, వాళ్ళ జీవన విధానం వల్ల ప్రకృతి నిలబడుతుంది కానీ కుంటుబడదు - ఎదో కొంత మంది అహంకారం ఉన్న వాళ్ళ వల్ల ఇప్పుడు వాళ్ళ స్థితి అలా మారింది, మరి నేరం చేసిన వాడికి శిక్ష పడిందా లేక

ఇలాంటి ప్రశ్నలు కోకొల్లలు
మనం ఆచరించాల్సినవి మూడే మూడు
ధర్మం తప్పకు నీతివీడకు చెడుచెయ్యకు.