కధ బాగుందా?

అనగనగా ఒక భూస్వామి, ప్రజలు బాగుండడం నచ్చలేదు. ప్రజలకు స్వతంత్రంగా బ్రతకడం తెలిసింది. కానీ అలా బ్రతికితే వాడికేమిటి లాభం అందుకే చిన్న వ్యవహారం నడిపాడు.

తన తండ్రి అధికారం పెట్టుకుని సహజవనరులు ౨౦ రూపాయలకు కొని తరువాత దాంతో తాయారు చేసిన Cement గానీ విద్యుత్తు గానీ ౫౦ రూపాయలకు అమ్మి తన సంపద పెంచుకున్నాడు.

ఈ మధ్యలో తన పాత శత్రువులను అంతం చెయ్యడానికి ఒక పధకం పన్నాడు, ఆ పాత శత్రువు ఇంట్లో మొదట సోదాలు చేయించి ఆ నిరాయుధులైన శత్రువుల మీద దాడి చేయించి అంతం చేయించాడు.

మరి సహజంగానే భూస్వాములకు శత్రువులు ఉండనే ఉంటారు, అలా కొందరు శత్రువులు అతను చేసిన మోసాలు బయటకు తెప్పించారు. కానీ ఆ శత్రువులు హత్య చేయించినది ఇతనే అని నిరూపించలేక పోయారు, కానీ అతను చేసిన మిగిలిన తప్పులలో అతని పాత్ర చూపించ గలిగారు. ఈ మధ్యలో పెద్దమ్మతో గొడవ పెట్టుకుని కులం చిచ్చు పెట్టాడు. దాంతో తప్పులు నిరూపించడానికి పెద్దమ్మ ఆశీర్వచనం కూడా దొరికింది(ఇక్కడ గొడవ అంటే చిన్న పిల్ల గోళీక్కాయ గొడవ అనుకున్నారు ఇక్కడ లంచంలో వాటా తగ్గడం మరియు ప్రజల చేత ఇళ్ళు ఎక్కువ కట్టించి అదే ఖనిజాలు దోచుకుని ధనవంతుడు కావడం  కూడా కొంచం సహించలేక పోయింది)

అలా తప్పులు నిరూపించడం పెరిగిపోవడం వలన అతనిని విడుదల చేయించడానికి అతని తల్లి (కాకి పిల్ల కాకికి ముద్దు) ఏడవడం మొదలు పెట్టింది. దాంతో పెద్దమ్మ దిగి వచ్చింది, అంతర్గతంగా ఒక ఒప్పందానికి వచ్చింది, మొదట శత్రువుల దగ్గర ఆయుధాలూ నిర్వీర్యం చేయించడం తరువాత ప్రజలు వయోవృద్ధులు సమర్దిస్తున్నాట్టు చెడ్డ వారిని ఒక్క మంచి కార్యం చేసినా సమర్ధిస్తారు అని నిరూపించమని ఆదేశించారు.

ఇక్కడ మంచి కార్యం అంటే ప్రజలు కట్టిన శిస్తుతో ప్రజలకు లంచం ఇవ్వడం అని అర్ధం చేసుకోగలరు.