ప్రభుత్వాల తెలివితేటలు - ప్రజల తెలివితేటల కన్నా ఎక్కువ.

మొన్న పల్ల కొండల రావుగారు ఒక ప్రశ్న అడిగారు, అసలు జనవరి ౧ నూతన సంవత్సరం ఎందుకు అవుతుంది అని.
నేను ఇది వరకే చెప్పాను అందుకు ఏ విధమైన ఆధారం లేదు. ఎవడో ఒకడు చేయించ మన్నాడు ఇంకొంత మంది కలిసి కూర్చుని చేసారు అని. అది కొంత మేర నిజం, ఇంకొన్ని ఆధారాలు.
ఇది వరకు Gregorian calendar మునుపు ఒక Julian Calendar ఉండేది, దాని ప్రకారం కొన్ని చోట్ల నూతన సంవత్సరం April 1 అయ్యేది, తరువాత దాన్ని Gregorian Calendar Julian Calendar వాళ్ళు కలిసిగట్టుగా Fools Day చేశారు, తరువాత కాలంలో కొన్ని దేశాలతో ఈ కారణంగా విభేదాలు ఏర్పడుతున్నాయి అని అది కొన్ని రోజులు వెనకకు జరిగేటట్టు సర్దుబాటు చేసారు, అప్పటి నుంచీ అది ౧౪ ఏప్రిల్ అయ్యింది, కానీ సమస్య తీరలేదు ఇంకా జటిలం అయి కూర్చుంది. సాధారణంగా ఆ రోజు పన్నులు చెల్లించడానికి చివరి రోజు, జనాలు నూతన సంవత్సరం మరియు Fools day దగ్గర దగ్గరగా జరుపుకోవడం వలన తాగుడు సంస్థలకు పన్ను చెల్లించడానికి చాలా ఇబ్బంది పెరిగింది, దాంతో తాగుడు సంస్థలు ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి వచ్చాయి ఎలాగైనా ప్రజల చేత నూతన సంవత్సరం మార్పించండి అని, అదే పని ప్రభుత్వాలు చేసి చివరికి జనవరి ౧ నూతన సంవత్సరంగా నిశ్చయించారు.

కానీ దీని మీద పరిశోధన జరిగితే అంటే చచ్చిన ఆత్మలు తీసుకు వచ్చి చేయిస్తే నిజానిజాలు బయట పడతాయి, బ్రతుకున్న వాళ్ళతో చేస్తే రోజూ అరగదీస్తున్న రోకలి మీద Radiation పరిశోధన జరిపి అది ౧౦౦ సంవత్సరాల క్రితానిది కాదు ౧౦౦ రోజుల క్రితానిది అని చెబుతారు.