రక్షక దళ సభ్యులు ఉన్నారా?

తరువాత రోజు ఉదయం విశ్వనాధు తల్లిదండ్రులు ఉదయాన్నే లేగిచి అన్ని కార్యక్రమాలు ముగించుకుని విశ్వనాధు ప్రవచనాలు చేస్తున్న ప్రదేశంలో కుర్చున్నారు, అగమ్యి కూడా వారి చెంతనే కూర్చుని ఉన్నాడు, మీరు రోజూ ఇక్కడే కుర్చుంటున్నా రా అని అడిగితే అవును అనే సమాధానం మరి మీ గురించి రోజూ మీ గది ముందు కూర్చుంటున్నారు కదా స్వామి మరి గదిలో ఉండేది ఎవరు అని అంటే అసలు ముందు నీకు గుర్తుందా నువ్వు నిన్న రాత్రి ఏ గదిలోకి వచ్చావో అని ప్రశ్న,
అభివృద్ది గురించి తెలుసుకోండి - భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే!
స్వామి:నేను అలా అనలేదు, ప్రకృతి మనకు అవసరం లేనిది ఎప్పటికీ తయారు చెయ్యలేదు, కానీ మనకి మన పని చేసుకోవడం నామోషీ, అందుకే బానిసలను తయారు చేసాం, ఇలా అందరూ లేరు కొందరు మాత్రమే ఉన్నారు కానీ కుహానా వాదులు అందరూ అలంటి వాళ్ళే అని క్షణానికి ఒకమారు అనడంతో నమ్మడం మొదలు పెట్టారు, కానీ ఈ కుహానా వాదుల లాభాపేక్ష వలన లాభ పడింది విదేశీయులు, ఎందుకంటే మనకోసం మనం పనిచెయ్యడం మాన్పించడంలో సఫలం అయ్యారు, అందుకే యంత్ర ఉపయోగం పెరిగింది, అసలు యంత్రాల అవసరం దేనికి?
ఆంధ్రుడు:అదేమిటి బట్టలు ఉతకడం తరువాత ప్లేట్లు కడగడం తరువాత
స్వామి:ఆగాగు, బట్టలు ప్లేట్లు దగ్గరకి వద్దాం మొదట కంచాలు గురించి మాట్లాడుకుందాం, అవి అన్నీ ఒకే పరిమాణంలో ఉండవు, మరి అన్నిటినీ ఎలా కడుగుతాయి అని కూడా ఆలోచించకుండా కొనేసారు చాలామంది, ఎందుకంటేప్రకటనలు నమ్మడం మనకు చాలా అలవాటు కదా, పలు మార్లు చెబితే అబద్దం నిజం అవుతుంది, అలాగే ఇది కూడా, అన్ని పనులు చేస్తాయి అని నమ్మడం కోనేయ్యడం తరువాత వాటిని ఉపయోగించే సమయంలో అపశృతులు, వాడిని అడిగితే వాడు మీరు సరిగ్గా ఉపయోగించలేదు కాబట్టే పనిచెయ్యడం మానేసింది అనే అబద్దం, ఎందుకంటే వాడికి కూడా ఎందుకు పనిచేయ్యలేదో తెలియదు, ఇక బట్టలు ఉతికే యంత్రం, ఇవి ఎప్పుడూ పనిచెయ్యవు, కానీ మనం ప్రకటనలలో చెప్పినట్టు ఒకరు తాళ్ళు కట్టుకుని బట్టలు ఉతికేస్తున్నట్టు ఊహించుకుని మట్టి వదిలిపోయింది అని ఆనందించి తరువాత మరకలు వదలక మళ్ళీ ఉతుక్కుని వాడిని తిట్టుకుంటాం. అయినాసరే వాడొద్దు అనం.
ఆంధ్రుడు:మరి వీటిని ఎందుకు నిషేదించట్లేదు?
స్వామి:చెప్పాను కదా మనల్ని విడగొట్టుకుని బద్దకస్తులని చేసి బంధువులను దూరం చేసి స్నేహితులను గొప్పవాళ్ళుగా చిత్రీకరించినన్నాళ్ళు ఈ మోసం తప్పదు. ఇక విడిపోయి మనం సాధించినది అభద్రత.
ఆంధ్రుడు:అదేమిటి విడిపోవడం వలన అభద్రత ఎందుకు ఏర్పడింది?
స్వామి:ఇదివరకు రోజులలో యుద్ధాలు అవి లేని కాలంలో అత్యాధునిక మారణాయుధాలు లేని కాలంలో ప్రసాంతంగా బ్రతికే వారు, ఒకరికి బాధ కలిగినా సాయం చెయ్యడానికి ఊరు ఊరు వచ్చేది, మరి ఇప్పుడు పక్కవాడి ఇల్లు కదా తగలదిపోయింది నా ఇల్లు కాదు కదా అని బ్రతికే జనం.
ఆంధ్రుడు:అదేమిటి రక్షక భటులు ఉన్నారు కదా?
స్వామి:రక్షణా అదేమిటి?సగం భటులు కూర్చుంటే నిలబడలేని వారు ఇంకొంతమంది పాత నేరస్తులకు రక్షణ ఇంకొంతమందిని మంత్రులకు రక్షకులిగా ఇంకొంతమందిని Nuxalites పొట్టన పెట్టుకుంటూనే ఉంటున్నారు.
ఆంధ్రుడు:అదేమిటి Nuxalites తప్పులు చేసిన వాళ్ళను శిక్షించా డానికి ఏర్పాటైన దళం, వాళ్ళు పుట్టకుండా ఉండాలి అంటే అన్యాయం అంతం కావాలి కానీ వాళ్ళను అంతం చేస్తే మళ్ళీ పుట్టకుండా ఉంటారా?
స్వామి:నిజానికి ఎక్కువ తెలివైన వాళ్ళు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ మోసం చేసిన వాళ్ళను బెదిరించి డబ్బులు గుంజుకుని తీసుకు వెళ్లి చైనా వాళ్ళ దగ్గర మారణాయుధాలు కొంటున్నారు, ఇంకా వాళ్ళు చేసే దరిద్రపు పనులు ఎక్కడ తెలివైన వాడు దేశం కోసం పనిచెయ్యడం మొదలు పెట్టి తమ ఉనికికి అడ్డం వస్తాడో అని campus interviews చేసి మరీ వాళ్ళను వాళ్ళ దళ సభ్యులుగా చేసుకుంటున్నారు.
ఆంధ్రుడు:అంటే తెలివైన వాళ్ళా ఎక్కువ మోసపోయేది?
స్వామి:అలా చెప్పానా, ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే తెలివైన వాళ్ళు సమాజాన్ని మోసం చేస్తూ తమను తాము మోసం చేసుకుంటున్నారు!
ఆంధ్రుడు:అర్ధం కాలేదు!
(ససెశమ్...)