Showing posts with label చీకట్లో రాజును. Show all posts
Showing posts with label చీకట్లో రాజును. Show all posts

మోజుగా మారనంత వరకూ ప్రపంచం ప్రశాంతంగా ఉంది మారాకా!

విగ్రహారాధన ఎందుకు చెయ్యొద్దు అన్నారు?
స్నేహితుడు: మనకు పెద్దల మీద నమ్మకం పోవడము మరియు వస్తువుల మీద మోజు పెరగడం కూడా!
ఆంధ్రుడు:వస్తు ప్రీతి పెరగడానికి వీటికి సంబంధం ఏమిటి?
స్నేహితుడు:  వస్తువుల మీద విపరీతమైన మోజు పెరిగిపోవడంతో మనం వాటితో ఎక్కువ సమయం వెచ్చించాలి అని దైవారాధన సమయాన్ని తగ్గించేసాము వేగం వేగం అని అంటున్నాము కానీ నిజానికి మోజు ఎవరైనా ముందుగా పొందేస్తారేమో అని వాళ్ళు పొందకుండా మనం ముందు పొందడానికి కొన్ని యంత్రాలు చేసుకున్నాము అవి కొన్ని రోజులు పనిచేస్తాయి తరువాత ఎందుకూ పనికిరావు, ఒక యంత్రం ఇంకొక యంత్రానికి పోటీ కొత్త యంత్రం పాత యంత్రానికి పోటీ, పాత యంత్రం తయారీకి పెట్టుబడి పెట్టిన వాడికి కొత్త యంత్రం పోటీ
ఆంధ్రుడు:అర్ధం కాలేదు?
స్నేహితుడు: ఒక యంత్రం తయారయ్యింది దాని ధర తరువాత తయారైన వాటికన్నా ఎక్కువ ఉపకరణాలు ఉన్న కొత్త యంత్రం కన్నా ఎక్కువ, దీని వల్ల పాత యంత్రం కొత్త యంత్రం కొన్న వాడి పోటీకి తట్టుకోలేదు, అలా అన్నీ కోల్పోతాడు, పైగా ఇప్పుడు వస్తున్నా యంత్రాలు
ఆంధ్రుడు: మీరు ఎప్పుడూ అంతే ఎదుట వారు బాగుపడితే చూడలేరు
స్నేహితుడు:బాగు పడటం అంటే తమ స్వార్ధం కోసం ఇంకొకరు నాశనం అయినా పర్వాలేదు అనుకోవడమా? లేదా తమకు ఆధిపత్యం కావాలి అని కోరుకోవడమా?
ఆంధ్రుడు:  అది లేకపోతే పేదవాడు బ్రతకలేడు!
స్నేహితుడు:ఇది అందరూ చెబుతున్న అబద్దం...........
(సశేషం...)

విగ్రహారాధన ఎందుకు చెయ్యొద్దు అన్నారు?

తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకున్నాను
స్నేహితుడు: నాకు ఈ విషయం చెప్పడం ఎల్లప్పుడూ ఇష్టం లేదు, ప్రజలు ఈ విధానాలు తెలుసుకుని దుష్ప్రయోజనాలు అర్ధం చేసుకుని దూరంగా ఉండట్లేదు వాటిని అలవాటు చేసుకుంటున్నారు, వాళ్ళకు వైద్యులు వంతు పాడుతున్నారు.
ఆంధ్రుడు: అంటే వైద్యుడు అబద్దం చెబుతున్నాడా?
స్నేహితుడు: నిజంగానే అబద్దం చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక ప్రకృతిని ఆశ్రయిస్తే విదేశీయుల కోసం పనిచెయ్యడం మానేస్తారు, అందుకోసం విదేశీయులు వాళ్ళు దేశం విడిచి వెళ్ళే ముందే మనలో నాటేసారు, దానికి కుహానా వాదులు వంతు పాడుతున్నారు.
ఆంధ్రుడు: వాళ్ళు నాటిన విష భీజాలు ఏమిటి?
స్నేహితుడు: మొదటిది విగ్రహారాధన చెయ్యకూడదు.
ఆంధ్రుడు: అది నిజమే కదా విగ్రహం అంటే రాయి
స్నేహితుడు: నీలాంటి వాడికి అది రాయి, నాలాంటి వాళ్లకు దేవుడు, మన పూర్వీకులు అవలంభించిన ప్రతీ దాంట్లో ఒక నిఘూడ రహస్యం ఉంది, మన పెద్దలు ఆ రహస్యం తెలుసుకోకుండా కేవలం అర్ధం తెలుసుకున్నారు అది విదేశీయులకు కలిసి వచ్చింది, విగ్రహారాధన బహిష్కరించాలి అని తీర్పు ఇచ్చారు.
ఆంధ్రుడు: ఏమిటా రహస్యం.
స్నేహితుడు: నాకు తెలిసిన కొన్ని ఎరువుల రహస్యాలు, విగ్రహం కు మనం చేసే అభిషేకం వలన వచ్చే తీర్దాలు ఇప్పుడు విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్న ఎరువుల కంటే ఎంతో ఉత్తమ మైన రసాయనాలు కలిగి ఉండేవి, ఇలా ఇంకా చాలా ఉన్నాయి.
ఆంధ్రుడు: నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం మరి మంత్రాలు ఎందుకు చదువుతారు?
స్నేహితుడు: వచ్చావా మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత దగ్గరకు, సరే చెబుతాను అందరూ రసాయన శాస్త్రం నమ్ముతారు కదా, ఇక్కడ అది అయ్యుండవచ్చు అప్పట్లో ఇప్పటిలాగా మనుషుల దగ్గర గడియారాలు ఉండేవి కావు, ఒక లయబద్దంగా ఉచ్చారణ చెయ్యడం వలన సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి కాబట్టి.
ఆంధ్రుడు: మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు?
(సశేషం ...)

తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకున్నాను

అందరూ మంచి వాళ్ళు కావాలి అని కోరుకుంటాం కానీ హేళన చెయ్యడం మాత్రం మానం.
స్నేహితుడు: తంలో ధనవంతుడు పేదవాడిని కొట్టి పని చేయించుకునే వాడు, ఇప్పటికీ ఆ స్థితి మారలేదు కానీ ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే అభివృద్ధి పేరు చెప్పి సగం భూమిని పనికి రాని భూమిగా మారుస్తున్నారు.
ఆంధ్రుడు:అదేమిటి పనికిరాని భూమి, అదెక్కడ ఉంది?
స్నేహితుడు: కొన్ని సార్లు మనం చూస్తుంటాము కొన్ని ప్రదేశాలలో పరిశ్రమలు మూతబడ్డాయి అని, మరి అవి మళ్ళి తెరుచుకున్నాయి అని చదవలేదు, అదే కాకుండా పరదేశీ వ్యామోహంతో వాళ్ళ అలవాట్లు గొప్పగా అనిపించడంతో మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము.
ఆంధ్రుడు: ఏమిటా అలవాట్లు?
స్నేహితుడు: మొదట పారిశ్రామికీకరణ, ఇదివరకు రోజులలో మన దేశంలో ఎవరు పండిస్తే వాళ్ళే తినే వారు, లేదా వస్తుమార్పిడి జరిగేది, దీని వల్ల లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి, వాటిని అధిగమించడానికి కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాం మన జీవన విధానంలో, కానీ అప్పటికీ మనదేశంలో వస్తు వ్యామోహం అంత హెచ్చుగా లేదు, కానీ ఈ పరదేశీ వస్తు వ్యామోహం పెరిగిపోయాకా, బంధుత్వం కన్నా వస్తువు గొప్పది అనే స్థాయికి చేరుకున్నాము. ఇలా వస్తు ప్రీతి పెరిగిపోయి మనిషి ప్రకృతితో బ్రతకడం మరచిపోయాడు. అంతే కాదు అభివుద్ది పేరు చెప్పి జంతువులను ఆహారంగా మార్చుకోవడం అతి ముఖ్యమైన పనిగా పెట్టుకున్నాడు.
ఆంధ్రుడు:  జంతువును ఆహారంగా మార్చుకోలేదు, ఆహారం దొరకక జంతువును తింటున్నాడు అంతే.
స్నేహితుడు: ఇది ఇంకో అబద్దం, కారణాలు అన్వేషిస్తే మనిషికి అంతః శుభ్రత కన్నా బాహ్య శుభ్రత మాత్రమె ముఖ్యం అనే కాలంలో బ్రతుకుతున్నాడు. ఇంకో అబద్దం మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిది తన తల్లిదండ్రులు పడే కష్టం చూడలేక కష్టపడి చదువుకుని ఇంత పైకి వచ్చాను అని.
ఆంధ్రుడు: అంటే నిజం ఏమిటి?
స్నేహితుడు: ఇంకొకడి అవసరం మనకు ఉద్యోగం అవుతుంది కానీ వాడికి నా సేవ ఎల్లప్పుడూ అవసరం కాదు అనే అభిప్రాయం, అందుకే ప్రతీ ఒక్కరి ప్రయత్నం నేను ఏదో కొత్తది తయారు చేసి ఇస్తే ఎలాగు వస్తుప్రీతి పెరిగిపోయి ఉన్నాడు కాబట్టి కొంటునే ఉంటాడు నాకు డబ్బులు వస్తూనే ఉంటాయి అని.
ఆంధ్రుడు: అంటే ఉన్నతంగా బ్రతకడం తప్పా?
స్నేహితుడు: ఉన్నతంగా బ్రతకడం అంటే ఎల్లప్పుడూ నువ్వు చేసే పని వల్ల పనీ పాటా లేని వాళ్ళు పెరగడమా లేదా కాలుష్యం పెరగడమా?
ఆంధ్రుడు: అంటే ప్రస్తుతం మనం చేస్తున్న అన్ని పనులు కాలుష్యం పెంచేవే అంటారు!
స్నేహితుడు: కాలుష్యమే కాదు జీవన ప్రమాణాలు దిగాజర్చేవి కూడా, ఉదాహరణకు surrogacy.
ఆంధ్రుడు: మీకు దీని మీద సదభిప్రాయం లేనట్టుంది, దీని వల్ల ఎన్నో పిల్లలు లేని జంటలకు పిల్లలు కలిగారు!
స్నేహితుడు: అది అబద్దం, పిల్లలు లేని జంటలు తయారవుతుంటే కారణాలు తెలుసుకుని ఉద్యోగాలు మానేస్తారు అనే భయంతో, ఇదే కాకుండా దీంట్లో చాలా మోసాలు, దీని వల్ల జీవన ప్రమాణాలు దిగజార్చే సూచికలుపెరిగిపోయాయి .
ఆంధ్రుడు: ఏమిటా మోసాలు?
స్నేహితుడు: నాకు ఈ విషయం చెప్పడం ఎల్లప్పుడూ ఇష్టం లేదు, ప్రజలు ఈ విధానాలు తెలుసుకుని దుష్ప్రయోజనాలు అర్ధం చేసుకుని దూరంగా ఉండట్లేదు వాటిని అలవాటు చేసుకుంటున్నారు, వాళ్ళకు వైద్యులు వంతు పాడుతున్నారు.
(సశేషం...)

అందరూ మంచి వాళ్ళు కావాలి అని కోరుకుంటాం కానీ హేళన చెయ్యడం మాత్రం మానం.

ప్రతీ ఒక్కడూ పనిచేస్తూ ఉండటమే కావాలి, కానీ ఉద్యోగాలు మాత్రమే లేవు!
స్నేహితుడు: పని వాళ్ళుగా, తమకు భోజనం దక్కాలి అంటే ఇంకొకరి మీద ఆధార పడటం, అది వట్టి ప్రపంచ ద్రవ్య సంస్థ మాత్రమె కాదు కిరస్తానీ సంస్థలు భూస్వాములు కోరుకునేదే.
ఆంధ్రుడు: అంటే కిరస్తానీ సంస్థలు అదే చేస్తున్నాయా?
స్నేహితుడు: అవును, ఆదివారం సెలవు అందరికీ కానీ మారిన వాళ్లకు మాత్రం కాదు, ఆ రోజు వాళ్ళు పని చెయ్యడం మానేసి ఆ కిరస్తానీ అభిప్రాయాలు వినాలి, దీనివల్ల రెండు నష్టాలు మొదటిది వాళ్ళ ఇంట్లో పని జరగదు, రెండవది బయట వారికి శబ్ద కాలుష్యం.
ఆంధ్రుడు:  మీతో ముందే చెప్పాను వాళ్ళు అలా మారడానికి కారణం మీరు హేళన చెయ్యడం.
స్నేహితుడు: నిజమే చేసాము, లావుగా ఉన్నవాడిని బక్కగా ఉన్నవాడిని, తరువాత అర్ధం అయ్యింది ఈ విపరీతాలకు కారణం వాళ్ళను హేళన చెయ్యడం అని. ఇక నీ గురించి చెప్పు నువ్వు లావుగా ఉన్నవాణ్ణి హేళన చెయ్యలేదా?
ఆంధ్రుడు: నేనేమీ చెయ్యలేదు.
స్నేహితుడు: నీ హావభావలె చెబుతున్నాయి నువ్వు చేసావో లేదో, సరే నిన్ను నిందిస్తే ఏమి లాభం, ప్రజలు అర్ధం చేసుకోవాలి. హేళన చెయ్యడం వలన నీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది కానీ ఇంకొకరు బాధ పడ్డారు అని అర్ధం చేసుకోవాలి. కిరస్తానీ సంస్థలు మాట మార్పుడులకు ఎన్నుకున్న విధానాలు కూడా అవే, అవహేళనకు గురైనా అంగవైకల్యం ఉన్నా చేరదీసి అక్కడి వారి పాపాలను ఇక్కడి వాళ్ళ చేత తాగిస్తున్నారు. వాళ్ళను శుభ్రం చేసి ఆ మలినాలను ఇక్కడి వారి మీదకు గుమ్మరిస్తున్నారు.
ఆంధ్రుడు: అంటే హేళనకు గురైన వాళ్ళు ఇంకొకరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారా?
స్నేహితుడు: అవును, అంతే కాదు హేళనకు గురైన వాళ్ళు పనికి వచ్చే వస్తువులను తీసుకుని పనికిరాని వస్తువులుగా తయారు చేస్తున్నారు.
ఆంధ్రుడు: పనికి రాని వస్తువులు అంటే
స్నేహితుడు: మానవ నిర్మాణానికి కానీ జీవి నిర్మాణానికి కావలిసిన అణువులను, మనిషికి హాని కల్పించే వస్తువులుగా తయారు చేస్తున్నారు. ఉదాహరణకు పీడన శక్తిని ఉపయోగించి జీవికి హాని కలిగించే వస్తువులు.
ఆంధ్రుడు: వాటి పేర్లు?
స్నేహితుడు: తెలిసి కూడా అడుగుతున్నావు, ఒకసారి Naxals దగ్గరకు వెళ్ళు, వాళ్ళ చేతులలో ఎప్పుడూ ఉంటాయి.
ఆంధ్రుడు: వాళ్ళకు తెలియదా?
స్నేహితుడు:తెలియదు అని నేను ఎప్పటికీ అనను కానీ ద్వేషం భయం ఈర్ష్య, అన్నిటికన్నా అత్యంత హేయమైన అభిమనత్వం అన్వయత్వం.
ఆంధ్రుడు: అంటే?
స్నేహితుడు: గతంలో చెడ్డ వాళ్ళను చూపించి అలా బ్రతికితే పున్నమ నరకాలు ప్రాప్తిస్తాయి అని చెప్పేవారు, కానీ ఇప్పటి జనాలకు కొంతమంది అలా జీవించు పర్వాలేదు పున్నమ నరకాలు లేవు అని చెప్పి చెడ్డ వాళ్ళను ఆదర్శ వంతులుగా చూపిస్తున్నారు, అలా జీవించేలా చేస్తున్నారు.
ఆంధ్రుడు: అర్ధం కాలేదు!
స్నేహితుడు: గతంలో ధనవంతుడు పేదవాడిని కొట్టి పని చేయించుకునే వాడు, ఇప్పటికీ ఆ స్థితి మారలేదు కానీ ఇప్పుడు అందరూ అదే పని చేస్తున్నారు.
(సశేషం...)

ప్రతీ ఒక్కడూ పనిచేస్తూ ఉండటమే కావాలి, కానీ ఉద్యోగాలు మాత్రమే లేవు!

ఆంధ్రుడు:అది అందరికీ తెలిసిందే ఇక మీరు చెప్పారు కదా ఎవరు లాభ పడతారు?
నిజాలు మనకు తెలియవు, వాళ్ళ లాభాల కోసం ప్రచురణులు మనం తిరిగి ముద్రిస్తాం అది మన దౌర్భాగ్యం
స్నేహితుడు: Hybrid సంస్కృతీ!
ఆంధ్రుడు:ఏమిటా Hybrid సంస్కృతి?
స్నేహితుడు: ప్రస్తుత ప్రపంచం దేవుడు మనకు ఇచ్చిన అన్నిటినీ తిరిగి తయారు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాము, మనిషికి అవసరమైన వాటిని పనికి రాని వస్తువులుగా మారుస్తున్నాము.
ఆంధ్రుడు: ఇంతకీ Hybrid సంస్కృతీ అంటే ఏమిటి?
స్నేహితుడు: అందరికన్నా వేగంగా ఉండాలి అని మనం తయారు చేసుకున్న యంత్రాలు, మనం వాడుతున్న కృత్రిమ వ్యవసాయ పద్దతులు.
ఆంధ్రుడు: అంటే Electricity అన్ని వినాసకాలకు మూల కారణం అంటావు!
స్నేహితుడు: నిజమే తొందరగా ముగింపు పలకాలి అని లేదా అందరికన్నా ముందుండాలి అనే ప్రయత్నం ఎప్పుడూ మనం చేస్తుండే దే అవే మన కొంప ముంచుతున్నాయి.
ఆంధ్రుడు:అంటే మనకు పనికి రానివి ఏమీ లేవా?
స్నేహితుడు: లేవు అనట్లేదు కొందరికి మాత్రమే పనికి రావు, కానీ అభివృద్ది అని పేరుచెప్పి అబద్దాలు పెంచి మన దగ్గర నుంచీ మన పెద్దలు వ్రాసిన వాటిని దూరం చేసారు. కానీ వాటిని తిరిగి ఎవరైనా చదువుతుంటే నీకు మతి చెడింది అనే ప్రచారాలు.
ఆంధ్రుడు:అంటే మేము చదువుతున్నది దేనికీ పనికి రానిదా!
స్నేహితుడు:వేరే చెప్పాలా? పొలం పనులు ఎలా చెయ్యాలో తెలియదు, ఆవులు గేదెలు ఏ రకంగా పెంచితే మంచి పాలు ఇస్తాయో తెలియదు,  మొక్కలు పెంచడం అనేదే లేదు.
ఆంధ్రుడు: అవన్నీ చిన్న పిల్లలలకు తెలిపితే ఎప్పుడు చదువుతారు?
స్నేహితుడు: నేను అడుగుతున్నాది అదే వాటిని పాఠ్యాంశములుగా ఎందుకు చేర్చరు అని!
ఆంధ్రుడు:అదేమిటి వాటిని పాఠ్యాంశములుగా చేరిస్తే ఇంకేమైనా ఉందా వాళ్ళు అలసిపోతారు.
స్నేహితుడు: ఆ బద్దకాలకు మూలమే మనం తయారు చేసుకున్న ఈ అబద్దపు సిద్దాంతాలు, అశాస్త్ర విజ్ఞానం.
ఆంధ్రుడు: అంటే వీటి వల్ల ఉపయోగం లేదు అంటారు!
స్నేహితుడు: నిజంగానే లేదు.
ఆంధ్రుడు: ఉపయోగం లేని వస్తువులు చెప్పండి?
స్నేహితుడు: నువ్వు ఉపయోగించే వస్తువులు చెప్పు ఉపయోగం ఉందో లేదో నేను చెబుతాను!
ఆంధ్రుడు: ముందుగా విద్యుత్తు దీపం.
స్నేహితుడు: నిజమే మనం ముందుగా చర్చించుకోవాలి దీని గురించి. ఇవి లేని రోజులలలో సూర్యుని శక్తి మీద ఆధార పడే వాళ్ళం సూర్యుడు ఉన్నప్పుడే దినచర్యలు ముగించే వాళ్ళం, ఇది వచ్చాకా మన దైనందన జీవితంలో వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు, అతి ముఖ్యంగా వీటి వల్ల మనం పొందిన లాభం పగటి పూట కూడా విద్యుత్తు దీపం వెలిగించడం.
ఆంధ్రుడు: అది అవసరం, కాబట్టి
స్నేహితుడు: కాదు అది ఏ రకంగానూ పనికి రాదు, మనం చేసుకున్నాం.
ఆంధ్రుడు: చేసుకోవడం లేదు పాడు లేదు.
స్నేహితుడు: నిజమే మనకు పడమటి పద్దతులు ఎక్కించి ఇలా తయారు చేసారు, నిజానికి పద్దులు అవీ వేసుకోవడానికి మన పూర్వీకులు రచ్చబండలు ఏర్పాటు చేసుకుని, తీరికగా పూర్తి చేసారు, కానీ పడమటి వాళ్ళు ఒకటి తెలుసు కున్నారు పిల్లి పిల్లి తగువులాట కోతి తీర్చింది అన్న చందానా, వాళ్ళకు కావలసినది అందరూ కొట్టుకోవాలి.
ఆంధ్రుడు: ఏమిటో ఒక్క విషయం కూడా అర్ధం అయ్యేట్లు చెప్పట్లేదు కదా!
స్నేహితుడు: వాళ్ళు బ్రతికే విధానం ఎదుట వారిని అభద్రతా భావానికి గురి చేస్తే భద్రత కల్పించే సామాగ్రి కొనడానికి వస్తారు, దాంతో మనం డబ్బు సంపాదించ వచ్చు అని, నిరంతరం అదే చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళకు వాళ్ళు ఎసరు పెట్టుకున్నారు, యుద్ధ సామాగ్రి రెండు వైరి వర్గాల వాళ్ళకు అమ్మారు కానీ ఒక వైరి వర్గం ఆ యుద్ద సామగ్రితో వాళ్ళ మీదే దాడికి దిగింది, దాంతో బెంబేలెత్తి యుద్ధం మానవతా వాదం కాదు అనే ప్రచారం మొదలు పెట్టారు. ఇలా ద్వంద నాలుక ఉండటం. ఇక ఆ పంథా కుదరదు అని కొత్త పంథా ఎంచుకున్నారు, ఇప్పటికే ఇబ్బుడిముబ్బిడిగా ఈ పంథాలో సంపాదించిన ధనం బడా బాబులకు చేరట్లేదు కేవలం ప్రభుత్వం దగ్గర పడి ఉంది అని చెప్పి భిన్నమైన ప్రయత్నాలు మొదలు పెట్టి అటు వాళ్ళ దేశీయుల జీవితాలు నాశనం చెయ్యడమే కాకుండా ప్రపంచం మొత్తాన్నీ నాశనం చేసారు. ఇవి కావన్నట్టు వాళ్ళ దేశంలో ధరలు అధికంగా ఉండి వేరే దేశంలో ధరలు తక్కువా అని తెలిసిందా ఆ దేశంలో పేదరికం మీద ఒక ప్రకటన వదలటం రివాజుగా మార్చుకున్నారు.
ఆంధ్రుడు:అంటే వాళ్ళు ప్రకటించినట్లు మన దేశంలో పేదరికం లేదు అంటావా?
స్నేహితుడు: లేదు అని ఎప్పుడూ అనను కానీ ఖర్చు పెట్టె ధనం వాళ్ళ దేశంతో సరి పోల్చడం గురించి మాత్రమే నేను మాట్లాడు తున్నాను.
ఆంధ్రుడు:అంటే
స్నేహితుడు: వాళ్ళ దేశంలో కిలో బియ్యం ౩ Dollars ఉంటె మన దేశంలో కిలో బియ్యం ౩౦ రూపాయలు లేదు అని వాళ్ళ బాధ. ఇక ప్రపంచ ద్రవ్య సంస్థ బాధ దానిది, వడ్డీ వస్తున్నా వాళ్ళు కోరుకున్న చందానా అందరూ మారలేదు అని.
ఆంధ్రుడు: ప్రపంచం ద్రవ్య సంస్థ ప్రజలు ఎలా ఉండాలి అని కోరుకుంది,
స్నేహితుడు: పని వాళ్ళుగా, తమకు భోజనం దక్కాలి అంటే ఇంకొకరి మీద ఆధార పడటం, అది వట్టి ప్రపంచ ద్రవ్య సంస్థ మాత్రమె కాదు కిరస్తానీ సంస్థలు భూస్వాములు కోరుకునేదే
(సశేషం ..)

నిజాలు మనకు తెలియవు, వాళ్ళ లాభాల కోసం ప్రచురణులు మనం తిరిగి ముద్రిస్తాం అది మన దౌర్భాగ్యం

ఆంధ్రుడు:అదేమిటి మేము సంపాదిస్తుంటే ప్రభుత్వం ఆ పన్ను ఈ పన్ను అని చెప్పి మా దగ్గర గుంజి రాయితీలు ఇస్తుంది కదా.
అవసరమైన వాటి మీద నియంత్రణ ఉండదు అనవసరమైన వాటి మీద రాయితీలు - మధ్యవర్తికి లాభాలు
స్నేహితుడు: మీకు వాళ్ళు కన్పించేది లాభం, కానీ నిజానికి వాళ్ళకు అది కిరాయి. ఇక ప్రభుత్వ పధకాల వలన లాభ పాడేది మధ్య వర్తి ఎలా అయ్యాడో తెలుసుకుందాం. మన పత్రికలైనా వార్త పత్రికలైన నిజాలు వ్రాయడం మానేసారు, ఇక అవి చదవడం మనం మోస పోవడం పరిపాటే. వాటిని తిరిగి తిరిగి ముద్రిస్తూ ఉంటారు, ఇక కొన్ని పత్రికలు కేవలం నిజాలు అబద్దాలుగా చెయ్యడానికి పుట్టాయి, ఆ పత్రికలు చట్టంలో లొసుగులు ప్రజలకు హితబోధ చేస్తుంటాయి.
ఆంధ్రుడు:అది అందరికీ తెలిసిందే ఇక మీరు చెప్పారు కదా ఎవరు లాభ పడతారు?
స్నేహితుడు: ముందుగా చితపండు - చింతపండు చేసే చేటు అంతా ఇంతా కాదు, దానిని నిత్యావసర వస్తువులలో ఎందుకు చేర్చారు అంటే, చింతపండు చేసే చేటు తెలుసుకుని
ఆంధ్రుడు:ఆ నేను చెబుతాను చింత చెట్ల మీద దెయ్యాలు ఉంటాయి కదా అదేనా!
స్నేహితుడు: చింతపండును ప్రజలకు దూరం చెయ్యడానికి చేసిన ప్రయత్నం చింత చెట్టు మీద దెయ్యాలు ఉంటాయి అని ప్రచారం చేసారు, కొందరు దాన్ని ఆసరా చేసుకున్నారు, దెయ్యాలు ఉన్నాయి అని ప్రచారాన్ని ఉపయోగించుకుని దోచుకున్నారు, ఇక ఈ దెయ్యం కన్నా ఆరోగ్య విషయం అందరికీ తెలుసు,ఎందుకంటే మన కళ్ళకు చేటు కనిపించనంత వరకూ అది అబద్దం అంటాం, తరువాత వాడకం మానేస్తాం. అప్పుడు అదే జరిగింది మధ్య వర్తులు చేసిన నిల్వలు పేరుకు పోయాయి. ప్రభుత్వం కొంటుంది అంటే ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుంది అందుకే ఈ రాయితీ ప్రకటనలు.
ఆంధ్రుడు:అంటే ప్రభుత్వం ఏ పని చేసినా మధ్య వర్తికే లాభమా?
స్నేహితుడు: కాదు ఇంకొకరు కూడా ఉన్నారు అది ఉత్తర దేశ భారతీయులు.
ఆంధ్రుడు:అదేమిటి, అది ఎలాగ?
స్నేహితుడు: సాధారణంగా మన ప్రాంతంలో ఎక్కువగా పండేవి బియ్యం, ఆ బియ్యం మీద రాయితీ ఇచ్చారు, కాని నిజంగా జనానికి చేరింది మక్కిపోయిన బియ్యం, అంతలా ఎందుకు మక్కి పోయేలా ఎందుకు ఉంచారు అంటే అవి దొరకని చోటుకు తరలించడానికి, అది ఉత్తర భారతావని వాళ్ళ కోసం, కొన్ని రోజులు దాచాకా అక్కడ వాళ్ళు మక్కి పోయిన బియ్యం కొనట్లేదు అందుకు కొంత పాత బియ్యం పంపించి తిరిగి ఈ బియ్యం వెనక్కి తెప్పించి ప్రజలకు అంట గట్టారు. ఇక రాయితీ ఇచ్చిన ఇంకో రెండు వస్తువులు కూడా ఆ ఉత్తర భారతీయులు కోసమే అవి గోధుమలు మరియు గోధుమ పిండి. వీటి మీద రాయితీ ఎందుకంటే సంధానం దొరకదు.
ఆంధ్రుడు:అదేమిటి కొవ్వు ఎక్కువ ఉన్నవారు తినాలి అంటారు కదా!
స్నేహితుడు: కొవ్వు ఎక్కువ ఉన్నవారు గోధుమలు తో తయారు చేసినవి తింటే సన్నబడతారు అనేది కొంతమందికే నిరూపితం అయ్యింది. ఇక మన దగ్గర గోధుమలు పెరగవు కదా, పెరిగేది ఉత్తర భారతంలో.
ఆంధ్రుడు: అంటే ప్రభుత్వం చేసే ఏ పని వల్ల సామాన్యుడు లాభ పడదు అన్నమాట.
స్నేహితుడు: నిజమే సామాన్యుడికే చేటు చేసేవే ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చి ప్రజలను మోసం చేసి బద్దకస్తులను చేసి మధ్యవర్తికి లాభం చేకూర్చేవే.
ఆంధ్రుడు:అవును palm oil వల్ల ఎందుకు మధ్య వర్తి లాభ పడ్డాడు?
స్నేహితుడు: దీనికి సహాయ పరిచే ఆధారాలు లేవు కానీ దీని వల్ల నష్ట పోయేది మన తర్వాత తరం.
ఆంధ్రుడు:అదెలాగ?
స్నేహితుడు: మనకు అశాస్త్ర విజ్ఞానము మీద నమ్మకం ఎక్కువ, నేను చెప్పేది మీకు రుచించదు.
ఆంధ్రుడు:sciense అంటే మీ దృష్టిలో అశాస్త్ర విజ్ఞానమే కదా, ఇంతకీ ఈ రోజు చెప్పేది ఏ విభాగం మీద?
స్నేహితుడు: Hybrid సంస్కృతీ!
(సశేషం..)

అవసరమైన వాటి మీద నియంత్రణ ఉండదు అనవసరమైన వాటి మీద రాయితీలు - మధ్యవర్తికి లాభాలు

స్నేహితుడు:ప్రతీ ఒక్కడూ వాళ్ళను గొప్ప వాళ్ళ లాగా చూడటం అలవాటు చేసుకున్నారు. వాళ్ళు చేసే హాని అంతాఇంతా కాదు, కేవలం ఒక్క వ్యాపారస్తుడు చేసే దానికి మూడు రెట్లు నష్టం వాళ్ళు కలిగిస్తున్నారు, Naxals పుట్టుకే ఒక విచిత్ర కథనాల సమాహారం, ఒకడు భూస్వామి మోసం చేసినందుకు మారాను అంటాడు ఇంకొకడు వ్యాపారస్తుడు మోసం చేసినందుకు మారాను అంటాడు, అది భూస్వామ్య వ్యవస్థ మనుషులను పీల్చి పిప్పి చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కళాశాలలకు వెళ్ళి అక్కడ విధ్యార్ధులను Naxals గా మారుస్తున్నారు, మీరు అంటున్న recruitments కూడా జరుగుతున్నాయి.
మూత పడుతున్న ఖజానా సంస్థలు (Banks are getting closed)
స్నేహితుడు: ముందుగా జనాలకు డబ్బు పిచ్చి పోవాలి, ఇక కరువు ఒక ప్రదేశం లో విలయ తాండవం చేస్తుంది అంటే అక్కడకు స్వచ్చందంగా సాయం చెయ్యడానికి జనాలు ముందుకు రావాలి, ఇక మూడవది నీటి లభ్యత. మనలో చాల మంది చేతులు కాలాకా బావి తవ్వే రకాలు.
ఆంధ్రుడు:అదేమిటి మేము సంపాదిస్తుంటే ప్రభుత్వం ఆ పన్ను ఈ పన్ను అని చెప్పి మా దగ్గర గుంజి రాయితీలు ఇస్తుంది కదా.
స్నేహితుడు: మన ఈ ద్వంద నాలుక మనకు సహజమే ప్రజలు దేనికైనా ప్రభుత్వాన్ని నిందించడం సహజం, మరి మీ నాలుక ద్వంద నాలుక అని ఎందుకు అన్నాను అంటే సమాజ హితం కోరడం మీకు అలవాటు కానీ సమాజ హితం కోసం మీరు చెయ్యరు చేసే వాళ్ళను నిందిస్తారు, ఇక మీరు అన్న ఈ పన్ను గుంజడం అన్నది తప్పని రాక్షసత్వం అని ఒప్పుకుంటాను, కానీ దీనికి కారణాలు అనేకం, కానీ వీటితో లాభ పడుతున్నది ఎవరు అన్న దాని గురించి చర్చించుకుందాం ఇక మనం ఎందుకు పోరాడట్లేదు అని కూడా తెలుసుకుందాం!
ఆంధ్రుడు:ఎందుకు పోరాడట్లేదు?పోరాడుతున్నాం కదా కనిపించట్లేదా?
స్నేహితుడు:  దాని గురించి తరువాత చర్చిచుకుందాం, మొదట ఒక ముఖ్య మంత్రి ప్రజాహితం కోసం ౯ సరుకులు తక్కువ ధరకు ఇస్తున్నాము అన్నాడు, అందరిలాగానే అమ్మ జపం చెయ్యడం పరిపాటే కదా చేసాడు, ఆ ౯ సరుకులు నిత్యావసర వస్తువులు ఎలా అయ్యయో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు, ముందుగా ఆరోగ్యరీత్య మాట్లాడుకుందాం
౧. కంది పప్పు - కొంతవరకూ ఇది నిత్యావసర వస్తువే దీని మీద రాయితీని విభేదించ లేము.
౨. palm oil - ఇది నిత్యావసర వస్తువు కాదు, ఇంకా చెప్పాలి అంటే దీని వల్ల స్థూల కాయం ఎక్కువగా వస్తుంది - palm oil, దీనికన్నా వేరుశనగ మీద రాయితీ ఇచ్చుంటే అందరూ ఆనందించే వారు.
౩. చక్కర - ఇది కొంచం ఆనందిచాల్సిన విషయం. కానీ స్థూల కాయులకు అనవసరం.
౪. గోధుమలు - ఇది నవ్వాలో ఏడవాలో అర్ధం కాని పరిస్థితి - ఇది నిత్యావసర వస్తువుల జాబితాలోకి చేరడం ఆశ్చర్యకరం.
౫. గోధుమ పిండి - ఇది అత్యంత హేయమైన స్థితి
౬. పసుపు - చిటికెడు పసుపు ఆరోగ్యం, దీని గురించి గతంలో చర్చించు కున్నాం మళ్ళీ చర్చించుకుందాం.
౭. చింత పండు - ఆంగ్లేయుల కాలం నుంచీ కలకలం సృష్టించినదే, నిజానికి చింతపండు వల్ల ఆరోగ్యానికి చేటు, దీనికన్నా నిమ్మకాయలకు ఇచ్చి ఉంటె వేసవిలో చల్లదనం ఆరోగ్యం.
౮. కారం - ఇది కూడా ఆరోగ్యానికి చేటు. ఇక దీనిలో మోసాలు దీనిలోనివే.
౯. ఉప్పు - దొరకనిదా? దీని మీద రాయితీ ఏమిటో అర్ధం కాలేదు.
ఆంధ్రుడు:ఏమిటి ఈ ౯ ఉపయోగ పడనివా?
స్నేహితుడు: వేసవిలో ప్రజారోగ్యం ఇచ్చే వాటి మీద రాయితీ ఉన్నా పర్వాలేదు కానీ ప్రజారోగ్యం ఇవ్వని వాటి మీద రాయితీ దేనికో అర్ధం కాదు.
ఆంధ్రుడు:అంటే మీ అభిప్రాయం ఏమిటి?
స్నేహితుడు:వేసవిలో మజ్జిగ నిమ్మరసం వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చెయ్యాలి, కానీ ఆరోగ్యం తెచ్చే వాటిని మనం అందుబాటులోకి రానివ్వం కదా, పైగా వాటిని అందుబాటులోకి తెస్తే మధ్య వర్తి లాభ పడడు కదా!
ఆంధ్రుడు:ఇంతకీ మీ అభిప్రాయంలో మధ్యవర్తి ఎవరు, రైతు నుంచీ కొని గిడ్డంగులలో దాచేవాడా గిడ్డంగులలో కొని వ్యపరస్తుడికి ఇచ్చెవాడా లేదా వ్యాపారస్తుడా?
స్నేహితుడు:మొదటి రెండు రకాల వారు.
ఆంధ్రుడు:అంటే వ్యాపారస్తుడు మోసం చెయ్యడా?
స్నేహితుడు:కొంచం క్లిష్టమైన ప్రశ్న ఎందుకంటే, అతనికి రోజంతా కూర్చుంటే ఒక్కోసారి ఒకరోజు అతను బ్రతకడానికి అవసరమైన కిరాయి గిట్టదు.
ఆంధ్రుడు:కిరాయి కాదు లాభం.
స్నేహితుడు: మీకు వాళ్ళు కన్పించేది లాభం, కానీ నిజానికి వాళ్ళకు అది కిరాయి. ఇక ప్రభుత్వ పధకాల వలన లాభ పాడేది మధ్య వర్తి ఎలా అయ్యాడో తెలుసుకుందాం.
(సశేషం..)

మూత పడుతున్న ఖజానా సంస్థలు (Banks are getting closed)

స్నేహితుడు: కానే కాదు, కుటుంబం ఉంటేనే మనిషి ఆనందంగా ఉండగలడు, వాళ్ళ బాధ అదే వాళ్ళ కుటుంబంలో సాయం చేసే వాళ్ళ కన్నా సాయం ఆశించే వాళ్ళు ఎక్కువ, అందుకు ఉమ్మడి కుటుంబాలను విడగొట్టారు, సాయం చెయ్యడం ఆపించేసారు, శత్రుత్వం పెంచడం లాంటివి చేసార.
సమాధానం లేని ప్రశ్నలు ఉంటాయా? సమాధానాన్ని అమలు పరిచే వాళ్ళు లేరా?
స్నేహితుడు:ప్రతీ ఒక్కడూ వాళ్ళను గొప్ప వాళ్ళ లాగా చూడటం అలవాటు చేసుకున్నారు. వాళ్ళు చేసే హాని అంతాఇంతా కాదు, కేవలం ఒక్క వ్యాపారస్తుడు చేసే దానికి మూడు రెట్లు నష్టం వాళ్ళు కలిగిస్తున్నారు, Naxals పుట్టుకే ఒక విచిత్ర కథనాల సమాహారం, ఒకడు భూస్వామి మోసం చేసినందుకు మారాను అంటాడు ఇంకొకడు వ్యాపారస్తుడు మోసం చేసినందుకు మారాను అంటాడు, అది భూస్వామ్య వ్యవస్థ మనుషులను పీల్చి పిప్పి చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కళాశాలలకు వెళ్ళి అక్కడ విధ్యార్ధులను Naxals గా మారుస్తున్నారు, మీరు అంటున్న recruitments కూడా జరుగుతున్నాయి.
ఆంధ్రుడు:అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులను ధనవంతులు చేసే వాళ్ళను చెదగోడుతున్నారు అంటావు!
స్నేహితుడు:నిజమే అది గమ్యం లేని వాడి ప్రయాణం, గమ్యం ఉన్న వాడి ప్రయాణం ఎప్పుడూ ప్రకృతిని నాశనం చెయ్యనిదిగా ఉంటుంది, నిజానికి ఇద్దరూ తేడాలేని వాళ్ళే వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబం ఎల్లప్పుడూ AC లలో ఉండాలి అనుకుంటాడు Naxal ఎల్లప్పుడూ భూస్వామ్యుల వల్లే ఈ కష్టాలు అంటుంటాడు .
ఆంధ్రుడు:మరి నిజం?
స్నేహితుడు: మనిషిలో మానవత్వం నశించడం, మానవత్వం ఉన్నా ధనం ఇవ్వలేక పోవడం.
ఆంధ్రుడు:అర్ధం కాలేదు?
స్నేహితుడు:ఒక నొక సమయంలో ఒక ఊరు కరువులో కొట్టు మిట్టాడుకుంటుంది ఆ ఊరు లోతట్టు ప్రాంతమే కానీ ఆ ఊరుకు వచ్చే నీటిని మధ్యలో స్థాపించిన Retail stores వాళ్ళు తమ గదులు శుభ్రం చేసుకోవడానికి AC చల్లార్చడానికి ఉపయోగించడం మొదలు పెట్టారు.
ఆంధ్రుడు:లోతట్టు ప్రాంతం అయితే అక్కడ నీళ్ళు సమృద్ధి గానే ఉంటాయి కదా!
స్నేహితుడు:అక్కడకు నీళ్ళు వచ్చినప్పుడు, నీళ్ళు రానివ్వలేదు, అప్పు ఇవ్వడానికి Banks ఎప్పుడో మూతపడిపోయాయి, ప్రభుత్వమా ఎన్నికలప్పుడు హామీలే తప్పించి ఆ ఊరికి నీరు అందుబాటులోకి వచ్చేలా చెయ్యడం గాలికి వదిలేసింది.
ఆంధ్రుడు:మొదటి ప్రశ్న Banks ఎందుకు మూత పడ్డాయి, పల్లెటూర్లలో Banks తప్పక ఉంచాలి అనే నియమం ఉంది కదా!
స్నేహితుడు:నిజమే, ఆ ఊర్లో bank ఉంది కానీ అక్కడ గుమస్తానే లేరు, ఎందుకంటే అక్కడికి పనిచెయ్యడానికి ఎవ్వరూ రారు, ఇక నీ తరువాత ప్రశ్న స్వచ్చంద సంస్థలు ఏమీ చెయ్యట్లేదా అనే కదా?
ఆంధ్రుడు:అవును!
స్నేహితుడు:ఒక తరంలో కొంతమంది భూస్వాములు ఉండే వారు Naxal ఉద్యమం పుణ్యమా అని భూస్వాములు పంథా మార్చుకున్నారు, ధనం ఉందా వెళ్ళి stock market లో పెట్టడం దాంతో ఇదివరకూ ప్రజలను అణగ దొక్కి సంపాదించడం కంటే సులువైన మార్గం దొరికింది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్న చందాన ప్రతీ ఒక్కడూ డబ్బు ఉందా వెళ్ళి stock market లో పెట్టు అనే ఆలోచనకు వచ్చి ధనం దానం చెయ్యడానికి ముందుకు రావట్లేదు!
ఆంధ్రుడు:సరే నువ్వు అన్నదే నిజం అనుకుందాం మరి ఈ కష్టానికి తరుణోపాయం ఏమిటి?
స్నేహితుడు: ముందుగా జనాలకు డబ్బు పిచ్చి పోవాలి, ఇక కరువు ఒక ప్రదేశం లో విలయ తాండవం చేస్తుంది అంటే అక్కడకు స్వచ్చందంగా సాయం చెయ్యడానికి జనాలు ముందుకు రావాలి, ఇక మూడవది నీటి లభ్యత
(సశేషం ..)

సమాధానం లేని ప్రశ్నలు ఉంటాయా? సమాధానాన్ని అమలు పరిచే వాళ్ళు లేరా?

స్నేహితుడు: నిజమే, అది ఖచ్చితం. అనగనగా భరతుడు రాజ్యాధికారం పొందినప్పుడు ఇద్దరు రైతుల తగువులాట మీద ఒక కథ ఉంది, దానికి భరతుడు చెప్పిన పరిష్కారం నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆ స్థితిలో ఉంటే పరిష్కారం పిల్లి పిల్లి తగువులాడుకుంటే కోతి వచ్చి తగువు తీర్చినట్టుంది.
భరతుడు తీర్చాడో లేదో నాకు గుర్తులేదు కానీ నేటి ప్రతీ వ్యక్తీ తీర్చగలడు
స్నేహితుడు: లేని communist లను ఎక్కడ నుంచీ తీసుకు రావాలి?
ఆంధ్రుడు:అంటే అన్ని సంస్థలు ఉన్నాయి అవేవీ కావా?
స్నేహితుడు: కానే కాదు, కుటుంబం ఉంటేనే మనిషి ఆనందంగా ఉండగలడు, వాళ్ళ బాధ అదే వాళ్ళ కుటుంబంలో సాయం చేసే వాళ్ళ కన్నా సాయం ఆశించే వాళ్ళు ఎక్కువ, అందుకు ఉమ్మడి కుటుంబాలను విడగొట్టారు, సాయం చెయ్యడం ఆపించేసారు, శత్రుత్వం పెంచడం లాంటివి చేసార.
ఆంధ్రుడు:అంటే వాళ్ళు చెప్పేవి అన్నీ అబద్దాలే అంటావు, వాళ్ళు అణగదొక్కారు అని చెబుతున్నారు అది నిజం కాదు అంటావు.
స్నేహితుడు: అవునేమో అన్నట్లు మాట్లాడతారు అలా జరిగి ఉండవచ్చు అని మాట్లాడతారు, కొన్ని నిజాలు కొన్ని తమకు అనుకూలంగా రాజ్యాంగం సవరించడానికి ఎన్నుకున్న పంథా.
ఆంధ్రుడు: అంటే వాళ్ళు ఒకప్పుడు రాజులు వాళ్ళను అణగదొక్కి బానిసలు చేసుకోవడం అబద్దం అంటావా?
స్నేహితుడు:చరిత్ర గురించి నాకు అంతగా తెలియదు చరిత్ర ఎవరో ఒకరు వ్రాసింది, వాళ్ళకు తెలిసిన అంశాల నుంచీ, వాళ్ళకు నచ్చిన అంశాలను కలబోసి తయారు చేసింది, చరిత్రలో చాలా శాతం కొంతమందికి తెలిసినదే ఉంటుంది, అందరికీ తెలిసినది ఉండదు. అందరికీ తెలిసినది చరిత్రలో ఉండాల్సిన అవసరం ఉండదు.
ఆంధ్రుడు: మీ లాంటి వాళ్ళు ప్రతీదీ దేవుడు అని అభివృద్ధికి ఆటంకాలు కలిగించారు, పైగా ఈ మితండ వాదం కూడానా!
స్నేహితుడు: నిజమే మా లాంటి వాళ్ళు ఈ ప్రకృతిని దేవుళ్ళు అనుకున్నారు ఆ sudo communist లు ప్రకృతి మనిషి కోసం పనిచెయ్యాలి అని జనాలకు అబద్దాలు చెప్పి అశాస్వతమైన మనిషి కోసం ప్రకృతిని నాశనం చేసారు.
మీకు గతంలో చెప్పాను మేము ప్రకృతి పథం ఎంచుకున్నప్పుడు గిరిజన తండాలకు వెళ్ళాము అని, అక్కడ నాయకులు ఒకటే అన్నారు మా పూర్వీకుల నుంచీ అందరం చెట్లను దేవతలు అని నమ్మాము, కానీ అభ్యుదయ భావాలు అని కొంతమంది మాతో చేరి మా చేతే చెట్లను నరికించి మాకు ఆహారం లేకుండా చేసారు, ప్రతిఘటిస్తే ఆయుధాలకు మేము బలవ్వడం పరిపాటే. ఇక ప్రశ్నిస్తే ముగ్గురి దగ్గర నుంచీ ప్రాణ హాని వాళ్ళు Naxals, అటవీ అధికారులు మూడు వ్యాపారస్తులు.
ఆంధ్రుడు:Naxals అంటే నేను ఒప్పుకోను, మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి?
స్నేహితుడు:ప్రతీ ఒక్కడూ వాళ్ళను గొప్ప వాళ్ళ లాగా చూడటం అలవాటు చేసుకున్నారు.
(సశేషం ...)

భరతుడు తీర్చాడో లేదో నాకు గుర్తులేదు కానీ నేటి ప్రతీ వ్యక్తీ తీర్చగలడు

ఆంధ్రుడు:  అంటే మేము చదివేవి మనిషిని కష్టాలలోకి నెట్టుతాయా?
వైధ్యుడి భాష వైధ్యుదికే అర్ధం కాదు
స్నేహితుడు: నిజమే, అది ఖచ్చితం. అనగనగా భరతుడు రాజ్యాధికారం పొందినప్పుడు ఇద్దరు రైతుల తగువులాట మీద ఒక కథ ఉంది, దానికి భరతుడు చెప్పిన పరిష్కారం నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆ స్థితిలో ఉంటే పరిష్కారం పిల్లి పిల్లి తగువులాడుకుంటే కోతి వచ్చి తగువు తీర్చినట్టుంది.
ఆంధ్రుడు:ఏమిటి ఆ కథ అది మా యొక్క ఈ స్థితికి ఎలా కారణం అయ్యింది?
స్నేహితుడు: సరే మొదట భరతుడు తీర్చవలసిన తగువు గురించి తెలుసుకుందాం ఒకరోజు ఇద్దరు రైతులు వచ్చారు, ఒక రైతు తను కొన్నా పొలంలో లంకే బిందెలు దొరికాయి, ఆ పొలం నేను కొనక మునుపు ఈ వ్యక్తిది కాబట్టి ఆ బిందెలు అతనివే తీసుకో అంటే నేను తీసుకొను అంటున్నాడు. అప్పుడు భరతుడు ఇంకో రైతును అడిగితే నేను పొలం అమ్మినప్పుడు అక్కడ ఏమి దొరికినా అతనిదే కాబట్టి అది అతనికే చెందుతుంది అన్నాడు, మళ్ళీ మొదటి రైతు ఇది నాకు చెందదు అని ఈ తగువు తీర్చలేక భరతుడు తరువాత రోజు రమ్మన్నాడు.
ఆంధ్రుడు:ఆ తరువాత రోజు మీ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేయించండి అని ఆదేశం ఇచ్చారు! అంతే కదా కథ.
స్నేహితుడు:నువ్వు చెప్పింది ఎవరో కథకుడు ఈ మూల కథ తీసుకుని తనకు నచ్చిన పరిష్కారం ప్రచురించాడు, కానీ తరువాత రోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు కలియుగం ఆరంభం అయ్యింది ఈ సమస్యల సుడి గుండానికి సమాధానం దొరకదు అన్న ఉవాచ నిజం అయ్యింది, తరువాత రోజు ఇద్దరు రైతులూ వచ్చి ఈ లంకె బిందె నాది అంటే నాది అనే తగువులాట మొదలు పెట్టారు. భారతుల వారు ఏమి తీర్పు ఇచ్చారో నాకు తెలియదు, ఎందుకంటే ఇది కూడా నేను ఇదిమిత్తంగా విన్న కథ.
ఆంధ్రుడు:దీనికి నేటి తరానికి ఏమిటి సంబంధం?
స్నేహితుడు: నేటి తరం ఆ లంకె బిందె గొడవ మళ్ళీ జరిగితే ప్రభుత్వం తీసుకు పోతుంది ఎందుకంటే అది ప్రభుత్వం యొక్క హక్కు. కానీ ఇక్కడే తిరకాసు ఉంది, ఆ తిరకాసు ఏమిటంటే ప్రభుత్వం అది ప్రజల నిధి అని చెప్పి రైతుల దగ్గర దొరికిన ఆ సొమ్మును ముందే ఖర్చు పెట్టేస్తుంది లేదా ప్రభుత్వం చుట్టాలు ఆ లంకె బిందెను సగం ఖాళీ చేసేస్తారు.
ఆంధ్రుడు: అదెలా జరుగుతుంది పెద్ద పెద్ద బందోబస్తు చేసి మరీ తీసుకుని వెళతారు కదా!
స్నేహితుడు:బందోబస్తు అవసరం ఏమిటి! ఇక ఆ బందోబస్తు ఇచ్చేది ఎవరు?
ఆంధ్రుడు: ప్రభుత్వ రంగ సంస్థలు కదా!
స్నేహితుడు:మరి ఆ బందోబస్తు కు కావాల్సిన సరంజామా ఎవరు ఇస్తారు?
ఆంధ్రుడు: కాదు అది వ్యాపార సంస్థలు.
స్నేహితుడు: ఇక్కడ ధనం దొరికింది అన్నదానికన్నా ఆ ధనాన్ని కాపాడటానికి అయ్యే ఖర్చు పెరిగిపోతుంది.
ఆంధ్రుడు: అదేమిటి ఉద్యోగాలు వస్తున్నాయి పైపెచ్చు ఆ ధనం మళ్ళీ ప్రజలకే చేరుతుంది కదా!
స్నేహితుడు:  చదువకున్న వాడు అలా అర్ధం చేసుకున్నాడు చదువు రాని వాడు నా సంక్షేమానికి నిధులు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి వ్యర్ధం చేస్తున్నారు అనుకున్నాడు, మధ్య తరగతి వాడు నేను కట్టిన శుంకం తో ప్రభుత్వానికి బంధువుల శుంకం చెల్లిస్తున్నారు అని అర్ధం చేసుకున్నాడు, sudo communist లు ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇంకొక ధనవంతుడు తయారు కాలేదు కాబట్టి.
ఆంధ్రుడు:అంటే  communist లు ధనవంతులకు వ్యతిరేకులా? అయినా sudo ఏమిటి.
స్నేహితుడు: లేని communist లను ఎక్కడ నుంచీ తీసుకు రావాలి?

(సశేషం ...)

వైధ్యుడి భాష వైధ్యుదికే అర్ధం కాదు

స్నేహితుడు: నిర్మింప బడిన శరీరం అయితే ఎందుకు ఆహారం తీసుకుంటున్నావు?
రెండు వ్యతిరేక దిక్కులు ఈ స్థితికి కారణం!
స్నేహితుడు: కొన్ని గ్రంధాలు మనిషి జీవితం సుఖంగా మార్చేవి ఉన్నాయి.
ఆంధ్రుడు:  అంటే మేము చదివేవి మనిషిని కష్టాలలోకి నెట్టుతాయా?
స్నేహితుడు: నిజమే వైధ్యుడి భాష వైధ్యుడికి అర్ధం కాదు, అలాగే ఇది కూడా!
ఆంధ్రుడు: ఏమిటి వైధ్యుడి భాష వైధ్యుడికి ఎందుకు అర్థం కాదు?
స్నేహితుడు: ఒక నిజం చెబుతాను, మా మేనత్త ఒకరు ఉన్నారు ఆమెకు గుండె సమస్య ఉంది, 15 సంవత్సరాల క్రితం గుర్తించారు, అప్పటి నుంచీ ప్రతీ ౧౫ రోజులకు ఒకమారు Injection ఇచ్చేవారు, ఒక ౫ సంవత్సరాలుగా Injection స్థాయి దాటిపోయింది ఇక మీరు కేవలం Tablets వాడటం ఉప్పు మానెయ్యడం చెయ్యాలి అని చెప్పారు. ఎందుకంటే ఉప్పు తింటే గుండె వేగంగా కొట్టుకుంటుంది, గుండె వేగం తగ్గించాలి అంటే ఉప్పు మానెయ్యాలి అన్నారు.కానీ ఇంకో వైధ్యుడు ఉప్పు మానేస్తే ఎలాగా గుండె కొట్టుకోవడం ఆగిపోద్ది అంటాడు, ఎవరిని నమ్మాలి?
ఆంధ్రుడు: వైద్యుడి గురించి అటుంచండి, యోగా చేసే వాళ్ళను ఉప్పు మానెయ్యాలి అనే మీరు దీనిగురించి ఎలా మాట్లాడతారు?
స్నేహితుడు: ఉప్పును తీసుకోవడం మానెయ్యాలి కానీ యోగా చేసే వారు శరీరంలో ఉప్పును తయారు చేసుకుంటారు, వాళ్ళు తినే పచ్చి కూరలలో కావాల్సిన శాతంలో ఉప్పు ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ పరిస్థితి వేరు, గుండె వేగంగా కొట్టుకుంటుంది అని చెప్పి ఉప్పు ఆపించేసారు, మరి ఉప్పు లేకపోతె గుండె కొట్టుకోవడమే మానేస్తుంది కదా, మరి దాని గురించి?
ఆంధ్రుడు: అంటే మీ అభిప్రాయం వైధ్యులకు ఏమీ తెలియదు అనా?
స్నేహితుడు: నిజమో కాదో నాకు తెలియదు కానీ, మన సమాజంలో అందరికన్నా ముందు ఉండాలి అని శ్రమ పడే వాళ్ళు ముందు వెళ్ళడానికి కావలసినవి చూసుకుంటున్నారు కానీ అలా వేగంగా పరిగెట్టడం వలన కోల్పోతున్న విషయాలు గురించి పట్టించుకోరు.
ఆంధ్రుడు: అంటే మేము ముందరి కాళ్ళ బంధం వేసుకుని బ్రతకాలా?
స్నేహితుడు:అలాగా అక్కర్లేదు నువ్వు చేసే పని వల్ల ఇంకొకరు ఏమైనా కోల్పోతున్నారో లేదో తెలుసుకో అంటున్నాను.
ఆంధ్రుడు:అంటే మేము చేసే ప్రతీ పనికి ముందూ వెనకా ఆలోచించకుండా చేస్తున్నాము అనా?
స్నేహితుడు: నిజమే, అది ఖచ్చితం.
(సశేషం....)

రెండు వ్యతిరేక దిక్కులు ఈ స్థితికి కారణం!

స్నేహితుడు:కాదు ఇలా మనిషి సుఖంగా బ్రతికే విధానాలు మరుగున పర్చడం వలన ఈ స్థాయిలో ఉన్నాము.
శాసించడమే మన పనా? ప్రకృతి అవసరం లేనిది ప్రసాదించిందా?
ఆంధ్రుడు:మన శరీర ఎప్పుడో నిర్మించ బడింది
స్నేహితుడు:నిర్మింప బడిన శరీరం అయితే ఎందుకు ఆహారం తీసుకుంటున్నావు?
ఆంధ్రుడు:శరీరం పని చెయ్యడానికి కావాల్సిన శక్తి సమకూర్చు కోవడానికి.
స్నేహితుడు:శరీరం పని చెయ్యడానికి ఆహారం అవసరం కానీ ఇంత దారుణంగా నిల్వ చేసుకోవాలా?
ఆంధ్రుడు:అవసరమే శీతాకాలంలో మామిడి పళ్ళు తినలేము వేసవి కాలంలో బంతి పూలు వర్షాకాలంలో పండించాలేము కదా?
స్నేహితుడు: ప్రకృతి నిర్మితమైనది ఈ రెంటికీ సంయమనం పాటించడానికి, ప్రకృతి వేసవిలో మామిడి పళ్ళు వర్షాకాలంలో అనేక ఫలాలు ఉన్నాయి శీతాకాలంలో ఇంకా చాలా ఫలాలు ఉన్నాయి, కానీ మనిషికి కొన్ని రుచులు నచ్చి ఈ స్థితికి తీసుకు వచ్చాము.
ఆంధ్రుడు:అంటే మీ అభిప్రాయం ప్రకారం శీతాకాలంలో మామిడి పళ్ళు తినడం నేరమా?
స్నేహితుడు:నా అభిప్రాయం కాదు అది ప్రకృతి నియమం, ప్రకృతి తయారు చేసిన వాటిలో ఏదీ ప్రకృతికి హాని కల్గించేది లేదు, మనిషి సృష్టించిన వాటి వల్ల ప్రకృతికే కాదు మనిషికే హాని కలుగుతుంది. అలాగే మనిషికి కానీ ఏ జీవికీ పనికి రానిది ఈ ప్రకృతిలో లేదు, కానీ మనిషి తన లాభాపేక్ష వల్ల ప్రకృతి నాకు ప్రతీదీ ఇవ్వాలి అని కోరిక పెంచుకుని జీవి నిర్మాణానికి అవసరమైన వాటితో పనికి రానివి తయారు చేస్తున్నాడు.
ఆంధ్రుడు:  అంటే మేము తాయారు చేసినవి మనిషికి ఉపయోగ పడనవే అనుకుందాం మరి మనిషి కష్టపడక పొతే ఆహారం ఎలా వస్తుంది, ముందు నీ కుహోనా వాదనలు కూడా ఆపు.
స్నేహితుడు: నేను కుహోనా వాడిని కాను మొదట నువ్వు గుర్తు పెట్టుకోవాలి, మన పూర్వీకులు చేసిన ప్రతీ పనిలో మనిషికి కావలిసినవి ఉన్నాయి అని నమ్మే వాడిలో నేను ముందున్నాను, మన పూర్వికులు తయారు  చేసుకున్న కొన్ని నియమాలు కొంతమంది విశృంఖలత్వానికి అడ్డు వస్తున్నాయి అని అవి పనికి రావు అని ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రుడు:ఉదాహరణలు!
స్నేహితుడు:స్వగోత్రీకులు వివాహం చేసుకోవడం.
ఆంధ్రుడు:ఇంకొకడు తయారయ్యాడు, అసలు ఆ నియమం ఎక్కడ పొందు పరిచారు?
స్నేహితుడు:ఎక్కడా పొందు పరచలేదు కానీ తర తరాల మునుపే మనిషి దగ్గర దగ్గర శరీర నిర్మాణాలు ఉన్న వారు కళ్యాణం చేసుకుంటే తరువాత తరానికి చిక్కులు వస్తాయి అని ఈ నియమం పెట్టుకున్నారు, దానిని ఒప్పుకొని వారు ఈ విష ప్రచారాలు చేస్తున్నారు.
ఆంధ్రుడు:అంటే Simalar Gene structure అంటావు, మరి నువ్వు అన్నది నిజం అనుకుందాం మరి ఇప్పుడు చాలా స్వగోత్రీకుల శరీర నిర్మాణాలు ఒకేలా ఎక్కడ ఉన్నాయి.
స్నేహితుడు: నీలాంటి వాళ్ళు ఈ ప్రశ్న తరచుగా అడగడం పరిపాటే, కొన్ని సార్లు కొంతమంది అతి తెలివైన వాళ్ళ వల్ల ఈ స్వగోత్రీకుల శరీర నిర్మాణాలు కొంచం దూరం అయ్యాయి, ఎందుకంటే దత్తత అనేది ఒక కారణం అయితే Artificial insemination లేదా Surrogacy
ఆంధ్రుడు:అంటే దత్తత  లేదా Surrogacy తప్పా?
స్నేహితుడు: దత్తత తప్పు అనను కానీ Surrogacy మాత్రం తప్పే.
ఆంధ్రుడు: చెప్పొచ్చావు, ఆడది నూటికి నోరు తెచ్చుకోవాలి అంటే గర్భవతి కావాలి.
స్నేహితుడు: కొన్ని సార్లు మనం ప్రశ్న నుంచీ దారి మళ్ళుతున్నాము, నీ ప్రశ్న ఎక్కడా పొందు పరచని నియమం ఎందుకు పాటించాలి అని.
ఆంధ్రుడు:నువ్వు మాట్లాడిన ప్రతీ మారు తెలివైన వాళ్ళ మీద అభాండాలు మోపడం సరికాదు.
స్నేహితుడు: నేను అభాండాలు మోపట్లేదు, నేను చెబుతున్నది ఆ నియమం ఎందుకు ఆచరిస్తున్నారు అని ఆలోచించకుండా ఆ నియమం తప్పు అంటున్నారు కదా అది నేను చెబుతున్నది, నియమం ఎందుకు ఆచరిస్తున్నారు అని ఆలోచించకుండా, నియమం తప్పు అంటే ఎలాగ?
ఆంధ్రుడు:మనం అందరికన్నా ముందే చదవడం వ్రాయడం నేర్చుకున్నాము అని అంటారు కదా మరి ఈ నియమం ఎందుకు పొందు పరచలేదు?
స్నేహితుడు:పొందు పరిచారో లేదో ఎవరికీ తెలియదు ఎందుకంటే ఈ తరానికి మా తరానికే మన సంస్కృతిక గ్రంధాలూ చదవడం నిషేధం!
ఆంధ్రుడు:ఎవరు నిషేదించారు?
స్నేహితుడు:ఎవరూ నిషేదించలేదు అలాగని ప్రచురించట్లేదు, మరి ఈ విషయాలు ఎలా తెలుస్తాయి?
ఆంధ్రుడు: చదివే వాళ్ళు ఉంటే ఎందుకు ప్రచురించరు?
స్నేహితుడు:నిజమే మనం కార్యాలయం నుంచీ తిరిగి వచ్చకా శృంగార రసం పాండిచే పరదేశీ పుస్తక పఠనానికి వెచ్చించే సమయం పోతుంది కదా!
ఆంధ్రుడు:అంటే మేము అవి చదివే ఇలా బ్రతుకుతున్నమా?
స్నేహితుడు:కొన్ని గ్రంధాలు మనిషి జీవితం సుఖంగా మార్చేవి ఉన్నాయి.
(సశేషం...)

శాసించడమే మన పనా? ప్రకృతి అవసరం లేనిది ప్రసాదించిందా?


స్నేహితుడు: అందుకే అప్పట్లో అవి కట్టే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకునే వారు, ఉదాహరణకు వెదురు కర్రలతో కట్టే ఇళ్ళు చొట్టూ సాధారణం గా పెద్ద చెట్లు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉండేవి, మట్టి గోడల ఇళ్ళు చెరువుల దగ్గరలో ఉండేవి, వాటి వలన కొంతలో కొంత నష్టం తగ్గించ గలిగే వాళ్ళు. ఇక పొతే ప్రతీ ఒక్కరి ఇంట్లో అవుగానీ గేదేగానీ ఉండేది, ఇప్పుడు?
ఎవరిది బాధ్యత?
స్నేహితుడు:కాదు ఇలా మనిషి సుఖంగా బ్రతికే విధానాలు మరుగున పర్చడం వలన ఈ స్థాయిలో ఉన్నాము.
ముందుగా మనం నిర్మాణాలు ఆపేస్తే ఆనందంగా బ్రతకగలము. పేక మేడలు మన జీవితాలు, మనం అంతా ఎడారిలో నీటి నిల్వ చెయ్యడానికి ప్రయత్నిస్తూ నీళ్ళు ఉన్న ప్రదేశాలను ఎడారిగా మారుస్తున్నాము.
దేవుడు ఇచ్చిన లేదా అదేదో సిద్దాంతాలు నమ్మే వాళ్ళు
ఒక వ్యక్తి:జీవ పరిమాణ సిద్దాంతం.
స్నేహితుడు:అదే, ప్రకృతి తనకి నచ్చినట్టు మనిషిని తాయారు చేసింది, ప్రకృతి మనిషికి కావలసినవి ఇచ్చింది, కానీ బుద్ధిని మాత్రం ఇవ్వలేదు. అదే ప్రకృతి చేసిన తప్పు.
ఆంధ్రుడు:అంటే మాకు బుద్ది లేదు అనా మీ అభిప్రాయం?
స్నేహితుడు: నిజమే ఎందుకంట,ప్రకృతి ప్రసాదించిన వాటిని మనకు అనుకూలం కాకపొతే నాశనం చెయ్యడం మొదలు పెట్టాము కాబట్టి.
ఆంధ్రుడు:ఏమిటి ఆ నాశనాలు మనం చేసినవి?
స్నేహితుడు: మొదటగా ఇళ్ళు కట్టడం.
ఆంధ్రుడు:మొదలు పెట్టినప్పటి నుంచీ చూస్తున్నాను ఇళ్ళు కట్టడం అంటే నాశనం  చెయ్యడం అంటున్నారు ఇదేమీ బాగోలేదు.
స్నేహితుడు:నేను మొదటి నుంచీ అదే మాట మీద ఉన్నాను, ఎందుకంటే అది ఒక ఆడంబరం కాబట్టి. కేవలం ధనం ఉంది అన్న ఒక్క కారణం నీ చేత ఈ పని చేయిస్తుంది. ఇక దీనికి కారణం చెబుతాను మనం ఇళ్ళు కడుతున్నాము అంటే మనం మన శరీర నిర్మాణానికి అవసరమైన వాటిని పనికి రాకుండా చేస్తున్నాము అని.
ఆంధ్రుడు:మన శరీర ఎప్పుడో నిర్మించ బడింది
(సశేషం...)

ఎవరిది బాధ్యత?

ఆంధ్రుడు:ఆగాగు ఆపకపోతే ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోయేట్టున్నావు, వాటికి సమయం ఎక్కడ ఉంది, మనల్ని మనం శుభ్రం చేసుకోవడానికే సమయం లేదు అవి వేసిన పేడ పెంట ఎక్కడ వేస్తాం?
ముందు వరసలో కూర్చున్నాడా అంటే తెలివైన వాడు!
స్నేహితుడు:కాదు ఇలా మనిషి సుఖంగా బ్రతికే విధానాలు మరుగున పర్చడం వలన ఈ స్థాయిలో ఉన్నాము.
సగం సమయం ఎవరు భాద్యత తీసుకోవాలి అని తగువు, ఎందుకు భాద్యతనుంచీ తప్పించుకోవడం ప్రతీ ఒక్కరికీ అలవాటే కదా. దీన్ని అలుసుగా తీసుకుని కొన్ని రక్షణ సంస్థలు పుడతాయి, వాళ్ళకు డబ్బు అవసరం కాబట్టి విడగోట్టము అని అనకుండా రక్షించాము అని డబ్బులు దండుకోవడం.
ఆంధ్రుడు: మీరు ఇక్కడ చేస్తున్నది అదే కదా, మీరు ఇంకొకరిని వేలెత్తి చూపడం ఎలా ఉంది అంటే ఇంకొకరి వైపు ఒక వేలు చూపిస్తే మూడు వెళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి అన్నట్టు ఉంది.
స్నేహితుడు: నిజమే మేము ఇక్కడ చేస్తున్నది అదే చేస్తున్నాము, మరి ధనం ఎక్కడికి వెళుతుంది?
ఆంధ్రుడు: మాకు ఎలా తెలుస్తుంది?
స్నేహితుడు:  మేము ఇక్కడ ఎవరినీ చేరాలి అని అడగము, చేరే వాళ్ళను ఆపము. ఇక మీ ప్రశ్న కు మా సమాధానం ఇక్కడ ఎవరికీ ఆ ధనం అవసరం లేదు, కేవలం సమాజానికి మాత్రమే అవసరం.
ఆంధ్రుడు: సమాజం అంటే మనుషులు కాదా?
స్నేహితుడు: సమాజం వ్యక్తి ఒకటి కాదు, మనిషి కేవలం తన కోసం బ్రతుకుతాడు సమాజం మనిషి కోసం బ్రతుకుతుంది.
ఆంధ్రుడు: ఏమిటి ఈ విపరీతార్ధం?
స్నేహితుడు: నిజానికి మనిషికి ఎల్లప్పుడూ ధనం ఆవశ్యకత లేదు కేవలం కొన్నిసార్లు మాత్రమే, కానీ మనిషి ఆ మాయలో పడి మనిషికి ఇవ్వాల్సిన విలువ డబ్బుకు ఇస్తున్నాడు.
ఆంధ్రుడు: అంటే డబ్బుకు విలువ ఇవ్వడం మానేస్తే మనం సుఖంగా బ్రతక గలమా?
స్నేహితుడు: మాయ లేని చోట నువ్వు ధనం లేకుండా బ్రతక గలవు.
ఆంధ్రుడు: ఇంతకీ మాయ అంటే ఏమిటి?
స్నేహితుడు: రామకృష్ణ పరమహంస మఠం లో ఒక భక్తుడు ఒకరోజు స్వామి వారిని మాయ అంటే ఏమిటి అని అడిగాడు, దానికి కాలంతో నీకు సమాధానం చెబుతాను అన్నారు, ఒక రోజు స్వామి వారి దర్శించు కోవడానికి అప్పటి రాష్ట్రపతి వచ్చారు స్వామి వారి ఆశిస్సులు తీసుకుని బయలుదేరగానే అక్కడ భక్తులు అందరూ రాష్ట్రపతి వెనకాల బయలు దేరారు, అప్పుడు స్వామి వారు ఆ భక్తుడితో నువ్వు ఒకనాడు మాయ అని అడిగావు కదా ఇదే మాయ అంటే.
ఆంధ్రుడు: అర్ధం కాలేదు
స్వామి: అర్ధం అయ్యిందో లేదో నీ అంతరాత్మని ప్రశ్నించుకో నీ అంతరాత్మే చెబుతుంది. సంధ్యా వందనం సమయం అయ్యింది ఈరోజుకు ఇంతే.
(సశేషం ..)

ముందు వరసలో కూర్చున్నాడా అంటే తెలివైన వాడు!

ఆంధ్రుడు: ఏమిటి ఆ అంతర్లీనత?
తెలివైన వాడు చెడ్డ వాడికి అండగా!
స్నేహితుడు: అందుకే అప్పట్లో అవి కట్టే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకునే వారు, ఉదాహరణకు వెదురు కర్రలతో కట్టే ఇళ్ళు చొట్టూ సాధారణం గా పెద్ద చెట్లు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉండేవి, మట్టి గోడల ఇళ్ళు చెరువుల దగ్గరలో ఉండేవి, వాటి వలన కొంతలో కొంత నష్టం తగ్గించ గలిగే వాళ్ళు. ఇక పొతే ప్రతీ ఒక్కరి ఇంట్లో అవుగానీ గేదేగానీ ఉండేది, ఇప్పుడు?
ఆంధ్రుడు:ఆగాగు ఆపకపోతే ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోయేట్టున్నావు, వాటికి సమయం ఎక్కడ ఉంది, మనల్ని మనం శుభ్రం చేసుకోవడానికే సమయం లేదు అవి వేసిన పేడ పెంట ఎక్కడ వేస్తాం?
స్నేహితుడు:నిజమే ఎక్కడ వేస్తాం, ముందుగా ఒక ప్రశ్న ఎంతమంది దగ్గర యాంత్రిక వాహనాలు ఉన్నాయి?
ఒకరిద్దరు తప్పించి అందరూ చేతులు ఎత్తుతారు.
స్నేహితుడు:అంటే అందరి దగ్గరా వాహనాలు ఉన్నాయి, మరి వాటిని ఎవరు శుభ్రం చేస్తారు?
మేమే అని అనర్గళంగా చెప్పారు జనాలు.
స్నేహితుడు: వాటిని శుభ్రం చేసే సమయం ఉంది కానీ వీటిని శుభ్రం చెయ్యడానికి సమయం లేదా?
ఆంధ్రుడు: అవి మా ఉన్నత స్థితిని సూచిస్తాయి, ఇంట్లో గోడ్లచావిడి ఉంది అంటే మాకే అవమానం.
స్నేహితుడు:అది ఒక జీవికి స్థానం కల్పించలేము కానీ ఒక యంత్రానికి స్థానం కలిపిస్తున్నాము.
ఆంధ్రుడు:వాటికి రోగం వస్తే ఎవరు చూస్తారు?
స్నేహితుడు:మీ యంత్రాలకు రోగం వస్తే ఎవరు చూస్తున్నారు?
ఆంధ్రుడు:మేమే.
స్నేహితుడు:ఇదీ అంతే, మనిషికి ఏవ దేని మీద ఉంటే దానిలోనే శక్తివంతుడు అవుతాడు. మిగిలిన విషయాలు అతనికి బానిసత్వం కోవలోకే వస్తాయి.
ఆంధ్రుడు:అంటే మేము ఆవులను గేదెలను సాకడం బానిసత్వం అనుకుంటున్నాం అనా మీ అభిప్రాయం? మీ దృష్టిలో మేము యంత్రాలకు బానిసలమా?
ఏకాకి: నిజం బాగా ఒప్పుకున్నావు, అంతే కదండీ.
స్నేహితుడు: మీకు నచ్చినది చేస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ ఇంకొకడు మీకు స్థాయిని నిశ్చయించాడు, అది యాంత్రిక జీవనం వల్ల లాభాలు అని, కనీ నష్టాలు ఎన్ని ఉన్న నా వరకూ రాలేదు కదా అని ప్రాప్త కాలజ్ఞుడి  పంథా ఎంచు కుంటున్నారు, కానీ చివరిగా దీర్ఘసూత్రుడు కు వచ్చిన కష్టాలు ఏరి కోరి తెచ్చుకుంటున్నారు, ఇక ప్రస్తుతం మన నాయకులు ప్రాప్త కాలజ్ఞుడి పంథా ఎంచుకుంటున్నారు అని తెలిసి నిజంగా శక్తి కోల్పోయిన వాడా అని పరీక్షలు చేస్తూ మరీ దోచుకుంటున్నారు. మరి దీర్గ దర్శి ఈ నరకం నుంచీ బయట పడిందా అంటే, ఆ దీర్గ దర్శిని జాలరి వల వేసి పట్టుకుని అమ్మడం మొదలు పెట్టాడు. దీర్గ దర్శి బ్రతుకున్నాను తిండి దొరుకుతుంది అని మాత్రమే ఆనందంలో మునిగి తేలుతున్నాడు.
ఆంధ్రుడు:అంటే మీ అభిప్రాయం ఈ మూడు చేపలూ కష్టాల కడలిలో కొట్టు మిట్టాడు కుంటున్నాయి అనా?
స్నేహితుడు:కాదు ఇలా మనిషి సుఖంగా బ్రతికే విధానాలు మరుగున పర్చడం వలన ఈ స్థాయిలో ఉన్నాము.
(సశేషం....)

తెలివైన వాడు చెడ్డ వాడికి అండగా!

స్నేహితుడు: నేను అలా చెప్పలేదు, ఆ మొదట ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటున్నాను, వాటికి సమాధానం తెలియనంత కాలం మనం మన కాళ్ళు నరకడానికి ఇంకొకరికి ఆయుధం ఇస్తూనే ఉంటాము.
తెలివైన వాడు చేసిన తప్పు ఏమిటి?
స్నేహితుడు: లేవు అని కాదు సమాధానం కోసం ప్రయత్నించవు అని మరియు నీ సమాధానం సమాజం బాగుకు ఉపయోగ పడుతుందా అని. మొదటి ప్రశ్నకు చాలా సులభంగా సమాధానం చెప్పావు, కానీ అంతర్లీనంగా ఆ ప్రశ్న ఎందుకు వేసాను అని ఆలోచించావా? లేదు ఎందుకంటే చాలా ప్రశ్నలకు అది ఆజ్యం పోస్తుంది.
ఆంధ్రుడు: ఏమిటి ఆ అంతర్లీనత?
స్నేహితుడు: మనం కట్టే కట్టడాలు మరియు రహదారుల వలన భూమి నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం తగ్గిపోయింది దాని వలన మనం పెద్ద పెద్ద Dams కట్టించాము దాని వలన సహజ వనరులు కొండల నుంచీ కిందకి రాక అక్కడే పేరుకుపోయి అక్కడ నీటి నిల్వకోసం కట్టినది ఉపయోగ పడకుండా చేసి మనకు మనం గొయ్య తవ్వుకునే పరిస్థితి తెచ్చుకున్నాము.
ఆంధ్రుడు: ఇలాంటివే చెప్పి మా ముందర కాళ్ళ బంధం వేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు.
స్నేహితుడు: ఏమిటి అభివృద్ది కెంపేగౌడ నిర్మించిన తటాకాలను పూడ్చి ఇళ్ళు కట్టి నీరు లేదు అని ఏడవడమా? లేక ఒక పక్క నీరు లేదు మేము పంటలు ఎలా పండించాలి రైతులు బాధ పడుతుంటే కట్టడాలు కట్టడానికి నీరు మరల్చడమా? లేదా flourosis బాధితులను మీ జీవితం మీరు బ్రతకండి మేము నీళ్ళు మళ్ళించం అని అన్న రాజకీయ నాయకుడుని దేవుడిగా కొలవడమా?
ఆంధ్రుడు: ఆ మేము Donation ఇచ్చాము సద్వినియోగం చేసుకోకపోతే అది మా తప్పా?
స్నేహితుడు: తెలివైన వాడు ప్రపంచంలోని అన్ని రోగాలకు మూల కారణమైన వాడిని బ్రతికించడానికి పరదేశం పారిపోయాడు, ఇక తెలివితక్కువ వాడు ఆ స్థానంలో చేరుకున్నాడు, వాడు చెప్పింది వీడికి అర్ధం అయ్యే సమయానికి కాలం మొత్తం అయిపోతుంది, ఇక ఏమి చేస్తాడు, ఇక వార్త పత్రికలలో ఉటకించి నట్లు తెలివైన వాళ్ళు భారత దేశానికీ తిరుగు ప్రయాణం అయ్యారు అని ఆనందిద్దాం అనుకునే లోపు వాళ్ళు చేసిన అవినీతి కట్టడాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో.
ఆంధ్రుడు:  అవినీతి కట్టడాలేమిటి అన్నీ సక్రమాలే @కదా!
స్నేహితుడు: సక్రమం పాతకాలంలో కట్టడాలు, అవి ఎందుకు మంచివి అంటే, మొదటగా వెదురు కర్రలతో కట్టిన ఇళ్ళు లేదా మట్టి గోడల ఇళ్ళు లాంటివి!
ఆంధ్రుడు:అవి విపరీతమైన గాలి వేస్తె కూలిపోతాయి ఎక్కువ వర్షం పడినా ఆ ధాటికి చెల్లా చేడురైపోతాయి.
స్నేహితుడు: అందుకే అప్పట్లో అవి కట్టే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకునే వారు, ఉదాహరణకు వెదురు కర్రలతో కట్టే ఇళ్ళు చొట్టూ సాధారణం గా పెద్ద చెట్లు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉండేవి, మట్టి గోడల ఇళ్ళు చెరువుల దగ్గరలో ఉండేవి, వాటి వలన కొంతలో కొంత నష్టం తగ్గించ గలిగే వాళ్ళు. ఇక పొతే ప్రతీ ఒక్కరి ఇంట్లో అవుగానీ గేదేగానీ ఉండేది, ఇప్పుడు
(సశేషం ...)

తెలివైన వాడు చేసిన తప్పు ఏమిటి?

అందరూ తినడానికి వెళ్ళారు, అక్కడ నుంచీ అగమ్యి స్నేహితుడు మాత్రం వెళ్ళలేదు.
ఆకలి తీరిందా?
ఆంధ్రుడు: అమలు పరచడం అంటే ఏమిటి? మేము అన్నీ మా నెత్తిన ఎత్తుకోవాలా?
స్నేహితుడు: నేను అలా చెప్పలేదు, ఆ మొదట ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటున్నాను, వాటికి సమాధానం తెలియనంత కాలం మనం మన కాళ్ళు నరకడానికి ఇంకొకరికి ఆయుధం ఇస్తూనే ఉంటాము.
ఆంధ్రుడు: ఏమిటి నువ్వనేది, మనం మన కాళ్ళు నరుక్కోవడానికి ఇంకొకడికి ఆయుధం ఇస్తున్నామా?
స్నేహితుడు:  ఎదుట వాడు ఆకాశంలో ఉన్నాడు అని అనుకుని వాడు తప్పు చేసినా తప్పు కాదు అని వాదించడమే ఈ ఆయుధం ఇవ్వడం.
ఆంధ్రుడు: ఏది పడితే అది మాట్లాడకు, మా ముందరి కాళ్ళకు బంధం వేయడానికే మీ ఈ ప్రయత్నం.
స్నేహితుడు: ముందరి కాళ్ళకు బంధం మేము ఎందుకు వెయ్యకూడదు అంటే, రేపటి మీ తరానికి కావలిసినవి దూరం చేస్తున్నా ఒప్పుకోవడమా?
ఆంధ్రుడు: అదే మీ ముసలి వాళ్ళతో వచ్చిన తగువు.
స్నేహితుడు: సరే ఇంతకీ నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నావు,
ఆంధ్రుడు(మనసులో): ఈయన అభిప్రాయం చూస్తుంటే నేను సమాధానాలు చెప్పకపోతే వదిలేలా లేడు.
ఆంధ్రుడు:  సరే సమాధానాలు చెబుతాను, మీరు నన్ను ఇంకా ప్రశ్నలు అడగకూడదు?
స్నేహితుడు:నీ సమాధానం పరీక్షలో సమాధానం లా ఉండ కూడదు, జీవితం చూసేలా ఉండాలి అప్పుడు నా ప్రశ్నలు ఆగిపోతాయి!
ఆంధ్రుడు: అంటే, నేను సమాధానం చెప్పలేను అనా?
స్నేహితుడు: లేవు అని కాదు సమాధానం కోసం ప్రయత్నించవు అని.
(సశేషం...)

ఆకలి తీరిందా?

ఆంధ్రుడు: ఇళ్ళు లేకుంటే ఎక్కడ జీవిస్తాం?
తప్పు చెయ్యొద్దు అంటే మీ వాళ్ళు తప్పు చేశారు కదా!
ఆంధ్రుడు: ఆకలి వేస్తుంది ఆకలి తీరాకా చెబుతాను!
అందరూ తినడానికి వెళ్ళారు, అక్కడ నుంచీ అగమ్యి స్నేహితుడు మాత్రం వెళ్ళలేదు.
స్నేహితుడు:ఏమిటి నువ్వు ఎందుకు వెళ్ళలేదు?
అగమ్యి: ఈ రోజు ఉపవాసం ఉంటున్నాను.
స్నేహితుడు: ఎందుకు?
అగమ్యి: మహా శివరాత్రి అని, మీరు ఎందుకు వెళ్ళలేదు?
స్నేహితుడు: అందుకే రామానుజుల వారు నిన్ను ఎన్నుకున్నారు!
అగమ్యి: అదొక్కటే కాదు నా జన్మ రహస్యం తెలిసిన వారు, అది నాకు నా జీవిత లక్ష్యం ఏమిటి అని వెతకడం మొదలు పెట్టిన రోజున తెలిసింది.
అగమ్యి స్నేహితుడు కి అతని జీవితం లో ఒడిదుడుకులకు కారణాలు చెప్పాడు,  ఈ లోగా అందరూ ఫలహారాలు చేసి వచ్చారు. ఒక్కడికీ ఆకలి తీరిన తరువాత కలిగే సంతృప్తి కన్పించలేదు ప్రతీ ఒక్కరూ ఎందుకు ఇక్కడకు వచ్చాము అని బాధ పడుతున్న వాళ్ళే, ఆ ముఖ కవళికలు స్నేహితుడికి అర్ధం అయ్యింది.
స్నేహితుడు: అందరికీ ఆకాలి తీరిందా?
ఆంధ్రుడు: తెలిసి అడుగుతున్నారా?
స్నేహితుడు: నా ప్రశ్నలకు సమాధానం చెబుతారు అని! మీరే అన్నారు కదా ఆకలి తీరాకా సమాధానాలు చెబుతాను అన్నారు కదా
ఆంధ్రుడు: ఏమి ఆకలి తీరడం అన్నీ ఉదాకబెట్టని కూరలు మరియు పండ్లు ఆకలి ఎక్కడ తీరుతుంది!
స్నేహితుడు: నిజమే ఆకలి తీరదు ఆకలి ఎలా తీరుతుంది మీరు అందరూ నేను అడిగిన నాలుగు ప్రశ్నలు మొదటి అడుగు వేసే మునుపు అడగలేదు కనుక.
ఆంధ్రుడు: ఏమిటి వాటికి సమాధానం తెలియదు అని అనుకుంటున్నారా? లేదా అవి చెయ్యలేము అనుకుంటున్నారా?
ఏకాకి: అయితే సమాధానం చెప్పండి మీ యొక్క విజ్ఞత తెలుస్తుంది.
ఆంధ్రుడు: అసలు విజ్ఞత అంటే ఏమిటి?
స్నేహితుడు: స్వామీ మీరు ఒంటరి కావడానికి కారణం ఇది కూడా, అందరినీ మీరు ప్రశ్నించే విధానం మీకే అన్నీ తెలుసు అనే అభిప్రాయంతో ఉన్నారు అని అనుకుంటున్నారు! మనం కొంతమంది తెలివైన వాళ్ళ వల్ల ఈ స్థితిలో ఉన్నాము అని అర్ధం చేసుకోండి.
ఆంధ్రుడు: ఏమిటి తెలివైన వాళ్ళ వల్ల ప్రస్తుతం మీరు ఈ స్థితిలో ఉన్నారా, కొంచం కారణాలు చెబుతారా?
స్నేహితుడు: అవి రహస్యాలు అవి బయటపడితే బ్రతకడం కష్టం, అవి మీ చేతే చెప్పిస్తాను నా నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అసలే మీకు ఆకలి వేస్తే సమాధానాలు ఆలోచించడం మానేస్తాం!
ఆంధ్రుడు: మనం జీవిస్తున్నది ఆ సమాధానాల అన్వేషణ లోనే కదా.
స్నేహితుడు: ఆ సమాధానలా అన్వేషణ గురించి నేను చెబుతానండి ముందు ఆ నా నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
ఆంధ్రుడు: మీ ప్రశ్నలు ఏమిటి, భూమి లోపలికి నీరు ఎలా వెళుతుంది అనే కదా, ఏముంది వర్షం పడితే నీళ్ళు భూమిలోకి ఇంకి భూమి మధ్య పొరల్లోకి చేరి నిలుస్తాయి, ఇది పెద్ద ప్రశ్నా?
స్నేహితుడు: కాదు అనుకుంటే కాదు అవును అంటే అవును. మీ సమాధానం పరిక్షలలో విద్యార్ధి వ్రాసేదిలా ఉంది, చిన్న ప్రశ్న ఇస్తే పుటాలు పుటాలు వ్రాసే పిల్ల వాడిలాగా ఉన్నాయి.
ఆంధ్రుడు: అంటే మీ అభిప్రాయం, ప్రశ్న కు సమాధానం వెతకడం లో మేము బట్టీ పద్దతి అవలంభిస్తున్నాం అనా?
స్నేహితుడు: నిజమే మీరు కేవలం గుర్తు పెట్టుకుంటున్నారు కానీ వాటిని అమలు పరచట్లేదు!
ఆంధ్రుడు: అమలు పరచడం అంటే ఏమిటి? మేము అన్నీ మా నెత్తిన ఎత్తుకోవాలా?

(సశేషం....)

తప్పు చెయ్యొద్దు అంటే మీ వాళ్ళు తప్పు చేశారు కదా!

ఆంధ్రుడు: అదేమిటి అవి మనల్ని ఉత్తేజ పరచడానికి కదా వింటున్నారు కదా అని నువ్వేది చెప్పినా వీనేస్తాము అనుకుంటున్నావా?
వాస్తవ ప్రపంచంలో జీవించండి....
ఆంధ్రుడు:ఏమిటి, నిజంగా నా?
స్నేహితుడు: నిజమే, వాటిలో మొదటిది ఇల్లు కట్టడం.
ఆంధ్రుడు: ఇళ్ళు లేకుంటే ఎక్కడ జీవిస్తాం?
స్నేహితుడు: నిజమే నాకు తెలియదు ఇల్లు లేకపోతే జీవించడం కష్టం అని. ఇప్పటి వరకూ ఇల్లు కట్టకుండా జీవించ వచ్చు అనుకున్నానే
ఆంధ్రుడు: చాల్లే వెటకారం ముందు చెప్పు ఇల్లు లేకుండా ఎలా జీవించగలం?
స్నేహితుడు: నేను ఇల్లు కట్టడం నేరం అన్నాను కానీ ఇల్లు లేకుండా బ్రతకగలం అనలేదు కదా
ఆంధ్రుడు: రెంటికీ తేడా ఏమిటి?
స్నేహితుడు: మొదటిది ఇల్లు కట్టడం అంటే ప్రకృతిని జీవరాసికి ఉపయోగం లేకుండా చెయ్యడం, ఇల్లు లేకపోవడం అంటే మనం నివసించడానికి ప్రదేశం లేకపోవడం
ఆంధ్రుడు: రెండింటికీ తేడా ఏమిటి?
స్నేహితుడు: ఇప్పుడే చెప్పాను కదా, సరే మీకు ఇంకా విడమర్చి చెబుతాను మనకు మన స్వగ్రమంలో ఇల్లు ఉంది, కానీ ఉద్యోగ రిత్యా వేరే ప్రాంతానికి బదిలీ అయ్యాము అక్కడ ఇల్లు కట్టుకోవడం, అంటే అక్కడ భూమిని ఉపయోగం లేని విధంగా మార్చడం అన్నమాట.
ఆంధ్రుడు: మీ కాలంలో చేస్తే ఒప్పు ఇప్పుడు చేస్తే తప్పా?
ఏకాకి: మీ మొదటి ప్రశ్న నువ్వు చేస్తే ఒప్పు నేను చేస్తే తప్పు, బంధాలు తెగిపోవడానికి మొదటి కారణం ఇది.
స్నేహితుడు: ఆగండి స్వామి మీరు అలా వాళ్ళ స్వభావం చెప్పేస్తే నిజం ఎప్పటికీ తెలుసుకోలేరు
నువ్వు ఆ ప్రశ్న నీ మనస్సాక్షిని అడుగు నీకే సమాధానం తెలుస్తుంది
అడిగే ముందు ఒక్కసారి ప్రశ్నించుకో ఈ ప్రశ్నలను
1. భూమి లోపలికి నీరు ఎలా వెళుతుంది?
2. నువ్వు తినే ఆహారం ఎక్కడ నుంచీ వస్తుంది
3. జంతు జాతిని TV లో నీ తరువాత తరానికి చూపిస్తావా
4. నీ తరువాత తరానికి పోషక విలువలలో కూడా కోటా పాద్ధతి ప్రవేశ పెట్టగలవా?
ఆంధ్రుడు: ఆకలి వేస్తుంది ఆకలి తీరాకా చెబుతాను
(సశేషం..)

వాస్తవ ప్రపంచంలో జీవించండి....

స్వామి:తెప్పించాను కానీ వాళ్ళు వాడట్లేదు అని తెలిసింది, ఎలా నమ్మించగలను నిరూపించాలి నేను తప్పు చెయ్యలేదు అని?
మనందరి కోసము: కొన్ని కొన్ని సలహాలు పాటిస్తే ఈ ప్రపంచంలో జీవనం చా...
స్నేహితుడు:ఇవే బాధలు, సరే నిషేదించ వలిసిన వస్తువులు చెబుతాను, మొదటగా Mobile Phone ఎందుకు అంటే అవి మనిషిని వాస్తవ ప్రపంచానికి దూరం చేస్తున్నాయి, తరువాత అవాస్తవ ఆటలు ఇవి శరీరానికి ఏవిధమైన శ్రమ ఇవ్వకపోగా మీ బుధ్ధిని నసింపజేస్తుంది.
ఆంధ్రుడు: అదేమిటి అవి మనల్ని ఉత్తేజ పరచడానికి కదా వింటున్నారు కదా అని నువ్వేది చెప్పినా వీనేస్తాము అనుకుంటున్నావా?
స్నేహితుడు:సరే కారణం చెప్పిన తరువాత నిషేదించ వల్సిన వస్తువు గురించి నీచేతే చెప్పిస్తాను
ఆంధ్రుడు: సరే చూద్దాం నీ ధైర్యం నీది, నాది నాది.
స్నేహితుడు: మొదట ఆ నాది నాది వదిలితే మనం చాలా సుఖమైన జీవితం అవలంభిస్తాం, వస్తు ప్రీతి ఉండాలి కానీ వస్తువు మనిషికన్నా గొప్పది కాకూడదు.
ఆంధ్రుడు: అంటే ఎవరైనా వస్తువు నాకు ఇచ్చేయి అంటే ఇచ్చేయాలా?
స్నేహితుడు: వాళ్ళ వస్తు ప్రీతి మీకు లేదు అని సంతోషించండి, ఇవ్వడం వలన మీ మానవ బంధం బలపడుతుంది అంటే ఇచ్చేయండి లేకపోతే మానేయ్యండి. సరే మనం ప్రస్తుతానికి వదల వలసిన వస్తువుల గురించి చర్చించుకుంటున్నాం, మొదటగా అవాస్తవిక ఆటలు అని నేను అన్నాను కాదు అని ఆయన అభిప్రాయం, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను మీరు సమాధానం చెప్పండి, మొదటిగా మనకి శక్తి ఎలా వస్తుంది?
సభికుడు ౧: బాగా ఆహారం తింటే వస్తుంది
సభికుడు ౨: కాదు ఎక్కువగా తిన్నా శారీరక శ్రమ చేస్తే తిన్న ఆహారం వంటబట్టి శరీరం ధృడంగా మారుతుంది.
సభికుడు ౩: ఆయన చెప్పినది ఒక్కటే కాదు మానసిక ఉల్లాసం కలిగినప్పుడు కూడా ధృడంగా అవుతుంది.
స్నేహితుడు:ఇక మీ వంతు మూడవ ఆయన చెప్పినదానికి నేను అంగీకరిస్తున్నాను మరి మీ అభిప్రాయం?
ఆంధ్రుడు: అంటే ఆటలు ఆడాలి!
స్నేహితుడు:ఎలాంటి ఆటలు?
ఆంధ్రుడు: Cricket Hockey లాంటివి, చిన్న పిల్లలైతే నేలా బండా ఆడుకోవచ్చు దాగుడుమూతలు ఆడుకోవచ్చు
స్నేహితుడు:మరి ఇవి ఆడాలి అంటే ఏమి చెయ్యాలి?
ఆంధ్రుడు: ఏమిచెయ్యాలి? మీరే చెప్పండి!
స్నేహితుడు: నేను ముందే చెప్పాను మీరు ఒప్పుకోలేదు, మరి ఇప్పుడు మీరు వాస్తవిక ఆటలు గురించి చెబుతున్నారు.
ఆంధ్రుడు: ఆ మీరు ప్రశ్నలు వేసి నన్ను తికమక పెడుతున్నారు, సరే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి కొంతమందిని ఆటలో అరటిపండును చేస్తారు మరి వాళ్ళ పరిస్థితి?
స్నేహితుడు: వాళ్ళు స్వతహాగా తప్పుకుని వ్యాయామం చేసుకోవచ్చు.
ఆంధ్రుడు: మరి మీరు ఆ మూడవ సభికుడు చెప్పినట్టు మానసిక ఉల్లాసం అతను కోల్పోతున్నాడు కదా?
స్నేహితుడు: ఆలాంటి వారి కోసం మనం పూర్వికులు కూర్చుని ఆడే ఆటలు చదరంగం, పరమపధసోపానం లాంటివి చేసారు.
ఆంధ్రుడు: సరే ఇక్కడ కూడా ఇంకో ఆలోచించాల్సిన విషయం ఉంది, అది ఒకళ్ళు ఒదోపోవడం అన్నది ఎప్పటికీ నిజమే కదా!
స్నేహితుడు: గెలుపు ఓటమి అన్నవి ఎప్పటికీ శాస్వతం కావు మానవ బంధాలే శాస్వతం అన్న నిజం గెలిచినా వారికైనా ఓడిపోయిన వారికైనా చెప్పడం మంచిది, అది పెద్దల బాధ్యత.
ఆంధ్రుడు:అంటే మనం జీవితాంతం ఇంకొకరి మాటలు వింటూనే ఉండాలా?
స్నేహితుడు: అందుకే నేను అవాస్తవిక ప్రపంచానికి దూరంగా ఉండాలి అంటున్నాను, ఈ అవాస్తవిక ప్రపంచంలో నేను చెప్పినదే నిజం నేను చేసేదే సరైనది అనే నమ్మకం అందరికీ ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం అవాస్తవిక పాటశాలలు చాలా ఉన్నాయి
ఆంధ్రుడు:ఏమిటి, నిజంగా నా?
(సశేషం..)