మనిషి పనిచేస్తే మనిషికి కావలిసినది దొరుకుతుంది అదే Machine పనిచేస్తే ఒక్కడికే డబ్బులు వెళతాయి.

అగమ్యి:కొన్ని ఉదాహరణలు చెప్పండి!
దేవుడు కోసం పనిచేస్తూ దెయ్యాలు మాత్రమే ధనవంతులు అవుతాయి
స్నేహితుడు:కాదు తెలివైన వాడు ఏది మన జీవనానికి ఉపయోగ పడుతుందో తెలుసుకోకుండా ఇంకొకడి ఉచ్చులో పడి వాడిని ధనవంతుడిని చేస్తున్నాడు.
నిజానికి మనిషి మీద మనిషికి నమ్మకం పోవడం కూడా మనిషి యంత్రానికి బానిస అవ్వడానికి కారణం.జీవ పరిమాణ సిద్దాంతం నిజం అని నమ్మే వాళ్ళు శరీరం ఎలా ఉన్నా ఎందుకు ఒప్పుకోలేరు? ఒప్పుకోరు కూడా ఎందుకంటే శరీర నిర్మాణాన్ని ఒప్పుకుంటే మనిషి ఆహారం పండించుకుని బ్రతికేస్తాడు, ఇక వీళ్ళు ఖాళీగా కూర్చుని డబ్బు సంపాదించలేరు.
అగమ్యి:అంటే సరేరంలో కొన్ని భాగాలు పనిచెయ్యకపోయినా అనా?
స్నేహితుడు:కాదు, బాగానే పనిచేస్తున్న భాగాలు అందంగా లేవు అని తొలగించుకోవడం గురించి, ఉదాహరణకు కొంతమంది తెలివైన వాళ్ళు చెప్పారు ఆసలు మన ముక్కులో వెంట్రుకల వలన బయట నుంచీ వచ్చే దుమ్ము ముక్కు ద్వారా లోపలికి చేరడాన్ని నిరోధిస్తుంది అని, కానీ అవి అందానికి అడ్డు అని వాటిని కత్తిరుంచు కుంటున్నారు, అలాగే కనుబొమ్మలు.
అగమ్యి:మరి మీరు దీనికి పరిష్కారం ఏమిటి?
స్నేహితుడు:ఇక్కడకు వచ్చిన వాళ్ళలో కొందరు జీవ పరిమాణ సిద్దాంతం నమ్మే వాళ్ళు, ఇంకొందరు దేవుడిని నమ్మే వాళ్ళు వాళ్ళకు ఒక్కటే తెలిపాను శరీరంలో ఏదీ పనికి రానిది ఉండదు అని.
అగమ్యి:సరే ఇది బాగానే ఉంది మరి కొంత సమయం క్రితం అడిగాను అసలు మలం ఎలా సద్వినియోగం చేస్తున్నారు అని! దాని గురించి చెప్పరే
స్నేహితుడు:అక్కడికే వస్తున్నాను, ప్రతీ ఒక్కరికీ మురుగుదొడ్లు ఉండాలి అని కట్టించేస్తే అది మలంతో నిండిన తరువాత యంత్రాలు ఉపయోగించి మాత్రమే తియ్యగలం, ఎందుకంటే అది కుళ్ళిపోయి రోగాల బారిన పడేలా చేస్తుంది మరియు అది శుభ్రం చేసే ౧౦ ౧౫ రోజులు అక్కడికి వెళ్ళలేము మరి అప్పుడు ఎక్కడ మలవిసర్జన చేస్తాడు అనే అనుమానం వచ్చి ఆశ్రమంలో ఒక ప్రదేశాన్ని ౨ భాగాలుగా చేసి వాటిని రెండు ౪ విభాగాలు చేసాము. ఒక భాగం భాగం ఒక సంవత్సరం వాడితే ఇంకో భాగం ఇంకో సంవత్సరం, ఆ చిన్న విభాగాలు ప్రతీ మూడు నెలలకు ఉపయోగం ఆపేస్తాం.
అగమ్యి:మరి అక్కడైనా మలం మలమే కదా.
స్నేహితుడు:అక్కడికే వస్తున్నాను ఇక్కడ మురుగుదొడ్లు Cement తో చెయ్యలేదు, కేవలం వెదురుతో కట్టిన తడికెల సంగ్రహం. ౩ నెలలు అవగానే మురుగ్గుంటలోకి ఈ వెదురు కర్రలు వేసి కప్పెట్టేస్తాం, అక్కడ చెట్లు నాటుతాం, అలా ఒక సంవత్సరం పాటు అక్కడ చెట్లు పెరుగుతాయి వాటిని మరు సంవత్సరం compost ఎరువులు తయారు చెయ్యడానికి ఉపయోగించి ఎరువులు క్రింద మార్చి తిరిగి మురుగుదొడ్లు మురుగ్గుంట  తవ్వుతాం.
అగమ్యి:ఆలోచన బాగుంది మరి ఎంతవరకు సాధ్యం?
స్నేహితుడు:మనిషి పనిచేస్తే మనిషికి కావలిసినది దొరుకుతుంది అదే Machine పనిచేస్తే ఒక్కడికే డబ్బులు వెళతాయి అన్న నిజం వారికి అర్ధం అయ్యేట్టు చెప్పగలిగాను.వాళ్ళు అర్ధం చేసుకున్నారు.
అగమ్యి:మీరు గతంలో ఒకసారి అన్నారు అందరి శరీరాలు ఒకేలాగా ఉండవు మరి ఈ ప్రక్రియలో కొంతమంది జబ్బులు పడే అవకాశం ఉంది కదా, మరి ఈ ప్రక్రియ అందరూ చేస్తారా?
(సశేషం...)