ఆకలి తీరిందా?

ఆంధ్రుడు: ఇళ్ళు లేకుంటే ఎక్కడ జీవిస్తాం?
తప్పు చెయ్యొద్దు అంటే మీ వాళ్ళు తప్పు చేశారు కదా!
ఆంధ్రుడు: ఆకలి వేస్తుంది ఆకలి తీరాకా చెబుతాను!
అందరూ తినడానికి వెళ్ళారు, అక్కడ నుంచీ అగమ్యి స్నేహితుడు మాత్రం వెళ్ళలేదు.
స్నేహితుడు:ఏమిటి నువ్వు ఎందుకు వెళ్ళలేదు?
అగమ్యి: ఈ రోజు ఉపవాసం ఉంటున్నాను.
స్నేహితుడు: ఎందుకు?
అగమ్యి: మహా శివరాత్రి అని, మీరు ఎందుకు వెళ్ళలేదు?
స్నేహితుడు: అందుకే రామానుజుల వారు నిన్ను ఎన్నుకున్నారు!
అగమ్యి: అదొక్కటే కాదు నా జన్మ రహస్యం తెలిసిన వారు, అది నాకు నా జీవిత లక్ష్యం ఏమిటి అని వెతకడం మొదలు పెట్టిన రోజున తెలిసింది.
అగమ్యి స్నేహితుడు కి అతని జీవితం లో ఒడిదుడుకులకు కారణాలు చెప్పాడు,  ఈ లోగా అందరూ ఫలహారాలు చేసి వచ్చారు. ఒక్కడికీ ఆకలి తీరిన తరువాత కలిగే సంతృప్తి కన్పించలేదు ప్రతీ ఒక్కరూ ఎందుకు ఇక్కడకు వచ్చాము అని బాధ పడుతున్న వాళ్ళే, ఆ ముఖ కవళికలు స్నేహితుడికి అర్ధం అయ్యింది.
స్నేహితుడు: అందరికీ ఆకాలి తీరిందా?
ఆంధ్రుడు: తెలిసి అడుగుతున్నారా?
స్నేహితుడు: నా ప్రశ్నలకు సమాధానం చెబుతారు అని! మీరే అన్నారు కదా ఆకలి తీరాకా సమాధానాలు చెబుతాను అన్నారు కదా
ఆంధ్రుడు: ఏమి ఆకలి తీరడం అన్నీ ఉదాకబెట్టని కూరలు మరియు పండ్లు ఆకలి ఎక్కడ తీరుతుంది!
స్నేహితుడు: నిజమే ఆకలి తీరదు ఆకలి ఎలా తీరుతుంది మీరు అందరూ నేను అడిగిన నాలుగు ప్రశ్నలు మొదటి అడుగు వేసే మునుపు అడగలేదు కనుక.
ఆంధ్రుడు: ఏమిటి వాటికి సమాధానం తెలియదు అని అనుకుంటున్నారా? లేదా అవి చెయ్యలేము అనుకుంటున్నారా?
ఏకాకి: అయితే సమాధానం చెప్పండి మీ యొక్క విజ్ఞత తెలుస్తుంది.
ఆంధ్రుడు: అసలు విజ్ఞత అంటే ఏమిటి?
స్నేహితుడు: స్వామీ మీరు ఒంటరి కావడానికి కారణం ఇది కూడా, అందరినీ మీరు ప్రశ్నించే విధానం మీకే అన్నీ తెలుసు అనే అభిప్రాయంతో ఉన్నారు అని అనుకుంటున్నారు! మనం కొంతమంది తెలివైన వాళ్ళ వల్ల ఈ స్థితిలో ఉన్నాము అని అర్ధం చేసుకోండి.
ఆంధ్రుడు: ఏమిటి తెలివైన వాళ్ళ వల్ల ప్రస్తుతం మీరు ఈ స్థితిలో ఉన్నారా, కొంచం కారణాలు చెబుతారా?
స్నేహితుడు: అవి రహస్యాలు అవి బయటపడితే బ్రతకడం కష్టం, అవి మీ చేతే చెప్పిస్తాను నా నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అసలే మీకు ఆకలి వేస్తే సమాధానాలు ఆలోచించడం మానేస్తాం!
ఆంధ్రుడు: మనం జీవిస్తున్నది ఆ సమాధానాల అన్వేషణ లోనే కదా.
స్నేహితుడు: ఆ సమాధానలా అన్వేషణ గురించి నేను చెబుతానండి ముందు ఆ నా నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
ఆంధ్రుడు: మీ ప్రశ్నలు ఏమిటి, భూమి లోపలికి నీరు ఎలా వెళుతుంది అనే కదా, ఏముంది వర్షం పడితే నీళ్ళు భూమిలోకి ఇంకి భూమి మధ్య పొరల్లోకి చేరి నిలుస్తాయి, ఇది పెద్ద ప్రశ్నా?
స్నేహితుడు: కాదు అనుకుంటే కాదు అవును అంటే అవును. మీ సమాధానం పరిక్షలలో విద్యార్ధి వ్రాసేదిలా ఉంది, చిన్న ప్రశ్న ఇస్తే పుటాలు పుటాలు వ్రాసే పిల్ల వాడిలాగా ఉన్నాయి.
ఆంధ్రుడు: అంటే మీ అభిప్రాయం, ప్రశ్న కు సమాధానం వెతకడం లో మేము బట్టీ పద్దతి అవలంభిస్తున్నాం అనా?
స్నేహితుడు: నిజమే మీరు కేవలం గుర్తు పెట్టుకుంటున్నారు కానీ వాటిని అమలు పరచట్లేదు!
ఆంధ్రుడు: అమలు పరచడం అంటే ఏమిటి? మేము అన్నీ మా నెత్తిన ఎత్తుకోవాలా?

(సశేషం....)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.