ముందు వరసలో కూర్చున్నాడా అంటే తెలివైన వాడు!

ఆంధ్రుడు: ఏమిటి ఆ అంతర్లీనత?
తెలివైన వాడు చెడ్డ వాడికి అండగా!
స్నేహితుడు: అందుకే అప్పట్లో అవి కట్టే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకునే వారు, ఉదాహరణకు వెదురు కర్రలతో కట్టే ఇళ్ళు చొట్టూ సాధారణం గా పెద్ద చెట్లు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉండేవి, మట్టి గోడల ఇళ్ళు చెరువుల దగ్గరలో ఉండేవి, వాటి వలన కొంతలో కొంత నష్టం తగ్గించ గలిగే వాళ్ళు. ఇక పొతే ప్రతీ ఒక్కరి ఇంట్లో అవుగానీ గేదేగానీ ఉండేది, ఇప్పుడు?
ఆంధ్రుడు:ఆగాగు ఆపకపోతే ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోయేట్టున్నావు, వాటికి సమయం ఎక్కడ ఉంది, మనల్ని మనం శుభ్రం చేసుకోవడానికే సమయం లేదు అవి వేసిన పేడ పెంట ఎక్కడ వేస్తాం?
స్నేహితుడు:నిజమే ఎక్కడ వేస్తాం, ముందుగా ఒక ప్రశ్న ఎంతమంది దగ్గర యాంత్రిక వాహనాలు ఉన్నాయి?
ఒకరిద్దరు తప్పించి అందరూ చేతులు ఎత్తుతారు.
స్నేహితుడు:అంటే అందరి దగ్గరా వాహనాలు ఉన్నాయి, మరి వాటిని ఎవరు శుభ్రం చేస్తారు?
మేమే అని అనర్గళంగా చెప్పారు జనాలు.
స్నేహితుడు: వాటిని శుభ్రం చేసే సమయం ఉంది కానీ వీటిని శుభ్రం చెయ్యడానికి సమయం లేదా?
ఆంధ్రుడు: అవి మా ఉన్నత స్థితిని సూచిస్తాయి, ఇంట్లో గోడ్లచావిడి ఉంది అంటే మాకే అవమానం.
స్నేహితుడు:అది ఒక జీవికి స్థానం కల్పించలేము కానీ ఒక యంత్రానికి స్థానం కలిపిస్తున్నాము.
ఆంధ్రుడు:వాటికి రోగం వస్తే ఎవరు చూస్తారు?
స్నేహితుడు:మీ యంత్రాలకు రోగం వస్తే ఎవరు చూస్తున్నారు?
ఆంధ్రుడు:మేమే.
స్నేహితుడు:ఇదీ అంతే, మనిషికి ఏవ దేని మీద ఉంటే దానిలోనే శక్తివంతుడు అవుతాడు. మిగిలిన విషయాలు అతనికి బానిసత్వం కోవలోకే వస్తాయి.
ఆంధ్రుడు:అంటే మేము ఆవులను గేదెలను సాకడం బానిసత్వం అనుకుంటున్నాం అనా మీ అభిప్రాయం? మీ దృష్టిలో మేము యంత్రాలకు బానిసలమా?
ఏకాకి: నిజం బాగా ఒప్పుకున్నావు, అంతే కదండీ.
స్నేహితుడు: మీకు నచ్చినది చేస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ ఇంకొకడు మీకు స్థాయిని నిశ్చయించాడు, అది యాంత్రిక జీవనం వల్ల లాభాలు అని, కనీ నష్టాలు ఎన్ని ఉన్న నా వరకూ రాలేదు కదా అని ప్రాప్త కాలజ్ఞుడి  పంథా ఎంచు కుంటున్నారు, కానీ చివరిగా దీర్ఘసూత్రుడు కు వచ్చిన కష్టాలు ఏరి కోరి తెచ్చుకుంటున్నారు, ఇక ప్రస్తుతం మన నాయకులు ప్రాప్త కాలజ్ఞుడి పంథా ఎంచుకుంటున్నారు అని తెలిసి నిజంగా శక్తి కోల్పోయిన వాడా అని పరీక్షలు చేస్తూ మరీ దోచుకుంటున్నారు. మరి దీర్గ దర్శి ఈ నరకం నుంచీ బయట పడిందా అంటే, ఆ దీర్గ దర్శిని జాలరి వల వేసి పట్టుకుని అమ్మడం మొదలు పెట్టాడు. దీర్గ దర్శి బ్రతుకున్నాను తిండి దొరుకుతుంది అని మాత్రమే ఆనందంలో మునిగి తేలుతున్నాడు.
ఆంధ్రుడు:అంటే మీ అభిప్రాయం ఈ మూడు చేపలూ కష్టాల కడలిలో కొట్టు మిట్టాడు కుంటున్నాయి అనా?
స్నేహితుడు:కాదు ఇలా మనిషి సుఖంగా బ్రతికే విధానాలు మరుగున పర్చడం వలన ఈ స్థాయిలో ఉన్నాము.
(సశేషం....)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.