ఎవరిది బాధ్యత?

ఆంధ్రుడు:ఆగాగు ఆపకపోతే ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోయేట్టున్నావు, వాటికి సమయం ఎక్కడ ఉంది, మనల్ని మనం శుభ్రం చేసుకోవడానికే సమయం లేదు అవి వేసిన పేడ పెంట ఎక్కడ వేస్తాం?
ముందు వరసలో కూర్చున్నాడా అంటే తెలివైన వాడు!
స్నేహితుడు:కాదు ఇలా మనిషి సుఖంగా బ్రతికే విధానాలు మరుగున పర్చడం వలన ఈ స్థాయిలో ఉన్నాము.
సగం సమయం ఎవరు భాద్యత తీసుకోవాలి అని తగువు, ఎందుకు భాద్యతనుంచీ తప్పించుకోవడం ప్రతీ ఒక్కరికీ అలవాటే కదా. దీన్ని అలుసుగా తీసుకుని కొన్ని రక్షణ సంస్థలు పుడతాయి, వాళ్ళకు డబ్బు అవసరం కాబట్టి విడగోట్టము అని అనకుండా రక్షించాము అని డబ్బులు దండుకోవడం.
ఆంధ్రుడు: మీరు ఇక్కడ చేస్తున్నది అదే కదా, మీరు ఇంకొకరిని వేలెత్తి చూపడం ఎలా ఉంది అంటే ఇంకొకరి వైపు ఒక వేలు చూపిస్తే మూడు వెళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి అన్నట్టు ఉంది.
స్నేహితుడు: నిజమే మేము ఇక్కడ చేస్తున్నది అదే చేస్తున్నాము, మరి ధనం ఎక్కడికి వెళుతుంది?
ఆంధ్రుడు: మాకు ఎలా తెలుస్తుంది?
స్నేహితుడు:  మేము ఇక్కడ ఎవరినీ చేరాలి అని అడగము, చేరే వాళ్ళను ఆపము. ఇక మీ ప్రశ్న కు మా సమాధానం ఇక్కడ ఎవరికీ ఆ ధనం అవసరం లేదు, కేవలం సమాజానికి మాత్రమే అవసరం.
ఆంధ్రుడు: సమాజం అంటే మనుషులు కాదా?
స్నేహితుడు: సమాజం వ్యక్తి ఒకటి కాదు, మనిషి కేవలం తన కోసం బ్రతుకుతాడు సమాజం మనిషి కోసం బ్రతుకుతుంది.
ఆంధ్రుడు: ఏమిటి ఈ విపరీతార్ధం?
స్నేహితుడు: నిజానికి మనిషికి ఎల్లప్పుడూ ధనం ఆవశ్యకత లేదు కేవలం కొన్నిసార్లు మాత్రమే, కానీ మనిషి ఆ మాయలో పడి మనిషికి ఇవ్వాల్సిన విలువ డబ్బుకు ఇస్తున్నాడు.
ఆంధ్రుడు: అంటే డబ్బుకు విలువ ఇవ్వడం మానేస్తే మనం సుఖంగా బ్రతక గలమా?
స్నేహితుడు: మాయ లేని చోట నువ్వు ధనం లేకుండా బ్రతక గలవు.
ఆంధ్రుడు: ఇంతకీ మాయ అంటే ఏమిటి?
స్నేహితుడు: రామకృష్ణ పరమహంస మఠం లో ఒక భక్తుడు ఒకరోజు స్వామి వారిని మాయ అంటే ఏమిటి అని అడిగాడు, దానికి కాలంతో నీకు సమాధానం చెబుతాను అన్నారు, ఒక రోజు స్వామి వారి దర్శించు కోవడానికి అప్పటి రాష్ట్రపతి వచ్చారు స్వామి వారి ఆశిస్సులు తీసుకుని బయలుదేరగానే అక్కడ భక్తులు అందరూ రాష్ట్రపతి వెనకాల బయలు దేరారు, అప్పుడు స్వామి వారు ఆ భక్తుడితో నువ్వు ఒకనాడు మాయ అని అడిగావు కదా ఇదే మాయ అంటే.
ఆంధ్రుడు: అర్ధం కాలేదు
స్వామి: అర్ధం అయ్యిందో లేదో నీ అంతరాత్మని ప్రశ్నించుకో నీ అంతరాత్మే చెబుతుంది. సంధ్యా వందనం సమయం అయ్యింది ఈరోజుకు ఇంతే.
(సశేషం ..)