ఉచితంగా ఉన్నా మనం ఉచితాలు ఇష్టపడం కదా!

దీన్ని అలా అనడం కన్నా ఉచితంగా వస్తుంది అంటే అనుమానం మనకు.
ఉదాహరణకు అప్పుడే పుట్టిన పిల్లలకు(లేదా కొన్ని రోజుల క్రితం పుట్టిన వారికి ) వేడి అవసరం బాగా ఎదగడానికి అని అన్నా మనం వాళ్ళ కోసం ఒక తొట్టె కొని ఇంట్లో తిప్పడానికి ఉపయోగిస్తాం, తరువాత దాన్ని చెత్త బుట్టలో పాడేస్తాం, తరువాత అతనికి ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు తరువాత doctor చుట్టూ తిరగడం, ఇక మన పెద్దలు పెట్టిన కొన్ని విషయాలు మనకు ఎందుకు మంచి చేస్తాయో చూద్దాం
కార్తీక మాసంలో ఉల్లిపాయలు తినకూడదు అనేవారు - ఎందుకంటే వర్షా కాలం తరువాత దొరికే ఉల్లి అంట మంచిది కాదు కానీ మనం మన అతి తెలివి ఉపయోగించి వాటిని నిల్వ చెయ్యడం అలవాటు చేసి తరువాత నిల్వ ఇంకా పెంచి పెంచి ప్రజలకు దొరక కుండా చేసి మధ్య వర్తిని బ్రతికిస్తున్నాము.
కొంత కాలం క్రితం ఎక్కడో చదివాను తులసి మొక్కలు ఎందుకు పెంచాలి అన్న విషయం మీద పూర్తిగా గుర్తులేదు కానీ కొన్ని విషయాలు పంచుకుంటాను
౧. తులసి దగ్గు నివారించడానికి దివ్యమైన ఔషదం
౨. తులసి మొక్క రోజులో ౧౮ గంటలు ప్రాణవాయువు ఇస్తుంది.
ఇక మనం చేసుకున్న కొన్ని చెడ్డ విషయాలు
ప్రజలు మన తెలివి తేటలు అర్ధం చేసుకోవడం మీద ఉపయోగించడం మానేసి మంచిని నాశనం చెయ్యడం మీద ఉపయోగిచడం మొదలు పెట్టాము.
ఇదివరకు చాలా మంది ఇళ్ళ ముందు ఆవులో గేదోలో ఉండేవి కానీ ఇప్పుడు వాటిని పెంచడం నామోషి లేదా పెంచ లేము, దాని వల్ల చాలా కోల్పోయాం, ఇక వ్యాపారస్తుడి బానిస అయ్యాము, వాడు నిశ్చయించిన ధరకే మనం కొనాలి లేదా Doctor లేదా ప్రకృతికి నకలు వాటిని(Horlicks Boost Bournvita అని సంభోదిస్తాం).
ఇక ఉమ్మడి కుటుంబాలు విడగొట్టి చాలా నాశనం చేసాము, అవి మనిషిని ఒంటరిని చేసాయి-ఒంటరి తనం తోడూ కావాలి అని కోరుకుంటుంది దాంతో అందరూ చెడ్డదారి ఎన్నుకొంటున్నారు దాన్ని మంచితనం గా చూపడానికి నాటకాలు ప్రజలకు ఎక్కిస్తున్నాయి.
గోత్రాలు ఎందుకు ఉపయోగపడతాయి అని చాలా మందికి అనుమానాలు వాటిని అబద్దాలు అని చెప్పే వాళ్ళు కోకొల్లలు, ఇక ప్రజలు అర్ధం చేసుకోవలిసినది modern science చెబుతున్నది ఏమిటంటే ఒకే genetic code ఉన్నవాళ్ళకు పుట్టే వాళ్ళు రోగాల బారిన ఎక్కువ పడతారు అని, అది మన పూర్వీకులు ఎప్పుడో తెలుసుకున్నారు అందుకే గోత్రాలు వ్రాసారు, దాని వల్ల అతని genetic code తెలుసుకోవచ్చు అని(అదే కాదు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమనేది కూడా అదే కారణం అవ్వొచ్చు కాదు నిజం), దాని వల్ల ఒకే gene code ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకోరు అని.
ఇక కుంకుడు కాయలకు దూరం అవ్వడానికి కారణం
౧. బద్ధకం
౨. అపనమ్మకం
నిజానికి మనకు ఉపయోగించడం తెలియక, అవి ఉపయోగించాల్సిన విధానం తెలియ కూడా, నిజానికి తలస్నానికి ఒక గంట ముందు కొబ్బరి నూనె వ్రాసుకొని తరువాత తలస్నానం చెయ్యాలి అప్పుడు పొడుగ్గా పెరుగుతాయి.
మొన్న తాతగారు వ్రాసారు మట్టి కుండలో ఎందుకు తినేవి ఎందుకు వండుకోవాలో.
ఇలాంటివి ఎన్నో మన పెద్దలు చెప్పినవి మనం డబ్బు పిచ్చలో మానేసి వైద్య బాధితులం అవుతున్నాము, చిన్న చిన్న విషయాలకు కూడా వైద్యుడిని ధనవంతుడిని చెయ్య వద్దు.
Dabur Lal Tail