మోజుగా మారనంత వరకూ ప్రపంచం ప్రశాంతంగా ఉంది మారాకా!

విగ్రహారాధన ఎందుకు చెయ్యొద్దు అన్నారు?
స్నేహితుడు: మనకు పెద్దల మీద నమ్మకం పోవడము మరియు వస్తువుల మీద మోజు పెరగడం కూడా!
ఆంధ్రుడు:వస్తు ప్రీతి పెరగడానికి వీటికి సంబంధం ఏమిటి?
స్నేహితుడు:  వస్తువుల మీద విపరీతమైన మోజు పెరిగిపోవడంతో మనం వాటితో ఎక్కువ సమయం వెచ్చించాలి అని దైవారాధన సమయాన్ని తగ్గించేసాము వేగం వేగం అని అంటున్నాము కానీ నిజానికి మోజు ఎవరైనా ముందుగా పొందేస్తారేమో అని వాళ్ళు పొందకుండా మనం ముందు పొందడానికి కొన్ని యంత్రాలు చేసుకున్నాము అవి కొన్ని రోజులు పనిచేస్తాయి తరువాత ఎందుకూ పనికిరావు, ఒక యంత్రం ఇంకొక యంత్రానికి పోటీ కొత్త యంత్రం పాత యంత్రానికి పోటీ, పాత యంత్రం తయారీకి పెట్టుబడి పెట్టిన వాడికి కొత్త యంత్రం పోటీ
ఆంధ్రుడు:అర్ధం కాలేదు?
స్నేహితుడు: ఒక యంత్రం తయారయ్యింది దాని ధర తరువాత తయారైన వాటికన్నా ఎక్కువ ఉపకరణాలు ఉన్న కొత్త యంత్రం కన్నా ఎక్కువ, దీని వల్ల పాత యంత్రం కొత్త యంత్రం కొన్న వాడి పోటీకి తట్టుకోలేదు, అలా అన్నీ కోల్పోతాడు, పైగా ఇప్పుడు వస్తున్నా యంత్రాలు
ఆంధ్రుడు: మీరు ఎప్పుడూ అంతే ఎదుట వారు బాగుపడితే చూడలేరు
స్నేహితుడు:బాగు పడటం అంటే తమ స్వార్ధం కోసం ఇంకొకరు నాశనం అయినా పర్వాలేదు అనుకోవడమా? లేదా తమకు ఆధిపత్యం కావాలి అని కోరుకోవడమా?
ఆంధ్రుడు:  అది లేకపోతే పేదవాడు బ్రతకలేడు!
స్నేహితుడు:ఇది అందరూ చెబుతున్న అబద్దం...........
(సశేషం...)