పులిని చూసి నక్క వాత పెట్టుకుంది

దీని కన్నా సరిగ్గా చెప్పాలి అంటే నక్క లా బ్రతకాలి అని పులి రంగు పులుము కుంది.
ఇది సరిగ్గా ఈ రోజు కుదేలు పడుతున్న వాహన రంగం పరిస్థితి.
అనవసరంగా ad's ఇచ్చి డబ్బులు వృధా చేసారు. ఎందుకంటే పన్ను ఎగ్గొట్టడానికి. దాంతో అవకాసా వాదులు ఎంత డబ్బు ఉన్నా ఇంకా కావాలి అని అనుకునే ఆటగాళ్ళు రెచ్చిపోయి నటించడానికి డబ్బులు తీసుకుని ఆటను పాడు చేసుకుని ఆడడం పాడైపోయినా ఇంకా తమ రొక్కం పెంచుకుంటూ పోయారు. దాని పర్యవసానం ఇప్పుడు కుదేలవుతున్న వాహన సంస్థలు.
అవే కాకుండా ఇంకా కొన్ని
అవసరం కోసం మనిషి కొంటాడు అనే ప్రాధమిక సత్యం మరచిపోయి అవసరం చెయ్యడానికి ప్రయత్నించి కొన్నాళ్ళు సఫలీకృతం అయ్యాయి! కానీ ఎల్లప్పుడూ అది నిజం కాదు! కొన్ని రోజులకు అర్ధం అవుతుంది నేను అవసరానికి మించి వస్తువును కొంటున్నాను అని, దాంతో కొనే శక్తి ఉన్నా కొనడం మానేస్తాడు! ఇది అక్షర సత్యం తత్ఫలితం సంస్థలు నష్టాల బాట పడతాయి.
మరి ఇప్పుడు అవి తిరిగి లాభాల లోకి రావాలి అంటే, అది ఇదివరకు లా సాధ్యం కాదు, కానీ ప్రజలకు ఉపయోగ పడి బ్రతికే ఒక ఆలోచన అయితే నా దగ్గర ఉంది, అదేమిటంటే ఇప్పుడు ఉన్న యంత్రాల మరమత్తు చెయ్యడమో, ఈ యంత్రాలను వృద్ది చేసే పనిలో పడాలి.
ఇక పులి ఎవరు అంటే మనం, నక్క ఎవరు అంటే మీకు అర్ధం అయ్యే ఉంటుంది!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.