ఇది అందరికీ రుచించని నిజం

నేను ప్రేమికుల రోజును అనడం కన్నా ప్రేమను వ్యతిరేకించడానికి కారణం
ఇద్దరు వ్యక్తులు తమ పెద్దలు చేసిన కట్టుబాట్లు నాశనం చెయ్యడానికి అని అర్ధం ఈ ప్రేమ, ఎందుకంటే మన పెద్దలు గోత్రాలు ఏర్పాటు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉండి ఉంటారు అలా వ్యతిరేకించిన వాళ్ళు గోత్రాలు లేకుండా ఉన్నారు.
మరి గోత్రాల వల్ల లాభాలు ఏమిటి?
ఒకే జీవ కణం నుండీ పుట్టిన వారు భార్యా భర్తలు అయ్యే అవకాశాలు తగ్గించడానికి, ఎందుకంటే తండ్రి గోత్రం కొడుకుకు వస్తుంది. మరి ఇక్కడ వెంటనే పుట్టే ప్రశ్న మరి తల్లి గోత్రం అని అడిగే స్త్రీ వాదులు ఉన్నారు, కానీ మన పెద్దలు తండ్రి గోత్రం ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఎక్కువ జన్యు కణాలు తండ్రి నుంచే వస్తాయి అని తెలుసుకుని ఉండవచ్చు, కానీ పెళ్లి సంబంధాలు చూసే సమయంలో తల్లి గోత్రం కూడా చూస్తారు, ఎందుకంటే తల్లి జీవకణం/తండ్రి జీవకణం ఒకటే అయితే ఒక్కోమారు పుట్టే పిల్లలు అసమాన నిర్మాణాలు ఉండటం కారణం!

మరి ప్రేమికులు ఇవి పట్టించుకుంటారా?
ఇక తరువాత ప్రేమను వ్యక్త పరచడానికి బహుమతులు ఇస్తారు, మరి ఆ బహుమతులు ఎంతవరకు ఉపయోగం అన్న విషయం ఎవరూ గుర్తించరు! చిన్న పిల్లవాడైనా పెద్ద పిల్లవాడైనా బహుమతి ఒకమారు అలవాటు అయితే ఇక జీవితాంతం దాని కోసమే జీవిస్తారు, అంటే నువ్వు ఇచ్చే బహుమతి విలువ బట్టి నీ ప్రేమ స్థాయి నిర్ణయించ బడుతుందా?
ఇక మన సంకృతి యొక్క ఆకారం చూస్తే మనం లేదా మన పెద్దలు ఎక్కువగా మన సహచరులను లేదా మనల్ని బాగు చేసే మార్గం ఎన్నుకున్నాం అనిపిస్తుంది మరి అది గుదిబండ ఎలా అవుతుంది?
ఉదాహరణకు తులసి మొక్క - దీని వల్ల లాభాలు
1. sinusitis లో సమస్య ఉన్న వారికి ఇది చక్కని పరిష్కారం అని చాలా మంది తెలిపారు
2. Brest  cancer సమస్యను తగ్గించే ఔషద గుణాలు ఉన్నాయి అని అంటున్నారు చాలా మంది
ఇక పసుపు
సహజంగా దొరికే ఒక antioxidant, కొంచం ఎక్కువ తీసుకుంటే నష్టం కాదు అనను కానీ సమానంగా తీసుకుంటే నష్టం లేదు ఇంకా లాభమే!
ఇక మన పెద్దలు మన శరీరం సరిగ్గా పెరగే అవకాసం ఇచ్చే వస్తువులకే ప్రాధాన్యం ఇచ్చారు
అందుకే ఆడవాళ్ళకు blouse మగవాళ్ళకు లుంగీ కానీ మనం అవి కట్టుకోవడం పాపంగా చూస్తున్నాం.
ఇక వీటి వల్ల కేవలం నువ్వే బాగు పడుతున్నావు అనే వాళ్ళు కోకొల్లలు !
కానీ నిజం ఇప్పట్లో లాగా కాదు అప్పుడు(అప్పుడు అంటే నా అభిప్రాయం ఈ నియమాలు చక్కగా పాటించే సమయంలో - కొన్ని నియమాలు లాభాలకు వాడుకోనంత వరకూ), పని చేసిన వాడికే లాభం వెళ్ళేది బద్దకస్తుడికి కాదు.
బద్దకస్తుడు అంటే
1. తను నడవగలిగినా వాహనం చొదించె వాడు
2. తను కాకుండా యంత్రంతో చేయించే వాడు
ఇది వరకు రోజులలో మనం వేసుకునే వస్త్రాలు దూదితో నేసినవే, ఇప్పుడు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మనం విదేశీ వస్త్రాలు ధరిస్తున్నాం, ఏదైనా అంటే కొంతమంది వింతగా యుద్ద సామగ్రీ మనం విదేశాల నుంచీ దిగుమతి చేసుకోవాలి అని కూడా వ్రాస్తున్నారు, యుద్ధం అనివార్యం అంటే ఎదుట వాడికి మనం తప్పు చేస్తున్నాం అని అనిపించడం అని కూడా అర్ధం చేసుకోలేని వ్యక్తులు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.